నోయెల్ టాటా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నోయెల్ టాటా
జననంనోయెల్ టాటా
1957 (age 66–67)
పౌరసత్వంఐరిష్
వృత్తివ్యాపారవేత్త
పదవి పేరుటాటా గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ టాటా గ్రూప్ ట్రస్ట్ చైర్మన్
పిల్లలు3
తల్లిదండ్రులునావల్ టాటా షిమోన్ టాటా
బంధువులుపల్లోంజీ షాపూర్‌జీ మిస్త్రీ (మామ) రతన్ టాటా (అన్న)

నోయెల్ నావల్ టాటా (జననం 1957) భారతదేశంలో జన్మించిన ఐరిష్ వ్యాపారవేత్త ఈయన ప్రముఖ వ్యాపారవేత్త టాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్ టాటా సోదరుడు. నోయెల్ టాటా ట్రస్ట్స్, ట్రెంట్ టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా ఉన్నాడు అలాగే, టాటా ఇంటర్నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్ టైటాన్ కంపెనీ టాటా స్టీల్ వైస్ ఛైర్మన్.[1][2]

నోయెల్ టాటా తన సోదరుడు రతన్ టాటా మరణం తరువాత 2024 అక్టోబర్ 11న టాటా ట్రస్ట్ చైర్మన్గా నియమితుడయ్యాడు. టాటా ట్రస్ట్ టాటా సన్స్ లో 66% వాటాను కలిగి ఉంది, ఇది టాటా గ్రూప్ అనేక సంస్థల హోల్డింగ్ కంపెనీ.[3]

ప్రారంభ జీవితం

[మార్చు]

టాటా కుటుంబం లో భాగమైన నోయెల్ టాటా నావల్ టాటా సిమోన్ టాటా దంపతులకు జన్మించాడు.[4] నోయెల్ టాటా టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా జిమ్మీ టాటా లకు నోయెల్ టాటా సోదరుడు అవుతాడు.[4]

నోయెల్ టాటా సస్సెక్స్ విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీ పట్టా ను అందుకున్నాడు. ఫ్రాన్స్ దేశంలో జరిగిన పలు వ్యాపార కార్యక్రమాలకు హాజరయ్యాడు అలాగే పలు బిజినెస్ స్కూల్ లను కూడా ప్రారంభించాడు..[4]

కెరీర్

[మార్చు]

విదేశాలలో అందించే టాటా గ్రూప్ ఉత్పత్తులు అందించడం కోసం టాటా గ్రూప్ లో భాగమైన టాటా ఇంటర్నేషనల్ ద్వారా నోయెల్ టాటా తన వ్యాపార జీవితాన్ని ప్రారంభించాడు. జూన్ 1999లో, నోయెల్ టాటా తన తల్లి స్థాపించిన వ్యాపార సంస్థ రిటైల్ ఆర్మ్ ట్రెంట్ కు మేనేజింగ్ డైరెక్టర్ అయ్యాడు. ఈ సమయానికి నోయెల్ టాటా నష్టాల్లో ఉన్న, ట్రెంట్ డిపార్ట్మెంట్ స్టోర్ లిటిల్ వుడ్స్ ఇంటర్నేషనల్ అనే వ్యాపార సంస్థను కొనుగోలు చేసి ఆ సంస్థను లాభాల బాటలో నడిపించాడు. . 2003లో నోయెల్ టాటా టైటాన్ ఇండస్ట్రీస్ వోల్టాస్ డైరెక్టర్ గా పనిచేశాడు.

టాటా ఇంటర్నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్న నోయెల్ టాటా 70 బిలియన్ డాలర్ల సమ్మేళనం విదేశీ వ్యాపారాన్ని నిర్వహించే సంస్థ టాటా ఇంటర్నేషనల్ మేనేజింగ్ డైరెక్టరు అవుతారని 2006లో టాటా గ్రూప్ ప్రకటించింది, టాటా గ్రూప్ చైర్మన్గా ఉన్న రతన్ టాటా తరువాత టాటా గ్రూప్ చైర్మన్గా నోయెల్ టాటా బాధ్యతలు చేపడతాడని అప్పట్లో పెద్ద ఎత్తున ఊహాగానాలు వచ్చాయి..[5][6] అయితే, 2011లో రతన్ టాటా తన వారసుడిగా బావమరిది సైరస్ మిస్త్రీ ని ప్రకటించాడు. .[7] అక్టోబర్ 2016లో, సైరస్ మిస్త్రీ మీద విమర్శలు రావడంతో టాటా సన్స్ ఛైర్మన్ పదవి నుండి తొలగించారు. రతన్ టాటా తరువాత టాటా గ్రూప్ చైర్మన్గా నాలుగు నెలల పాటు బాధ్యతలు చేపట్టాడు..[8] నోయెల్ టాటా 2018 లో టైటాన్ కంపెనీ వైస్ ఛైర్మన్గా నియమితుడయ్యాడు ఫిబ్రవరి 2019 లో సర్ రతన్ టాటా ట్రస్ట్ బోర్డులో సభ్యుడిగా ఉన్నాడు.[9] 2022 మార్చి 29న, నోయెల్ టాటా టాటా స్టీల్ వైస్ ఛైర్మన్గా నియమితులయ్యారు.[1]

నోయెల్ టాటా 2024 అక్టోబర్ 11న టాటా గ్రూప్ లో భాగమైన టాటా ట్రస్ట్ చైర్మన్గా నియమితులయ్యారు, నోయెల్ టాటా సోదరుడు రతన్ టాటా 2024 అక్టోబర్ 9న 86 సంవత్సరాల వయసులో మరణించారు. అంతకుముందు అక్టోబర్ 11న ముంబైలో జరిగిన సమావేశంలో ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నట్టు టాటా గ్రూప్ ప్రకటించింది.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

నోయెల్ టాటా టాటా సన్స్ (టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ) లో అతిపెద్ద వాటాదారుగా ఉన్న పల్లోంజీ మిస్త్రీ కుమార్తె ఆలూ మిస్త్రీని వివాహం చేసుకున్నాడు.[10] నోయెల్ టాటా ఆలూ మిస్త్రీ దంపతులకు ముగ్గురు పిల్లలు సంతానం.[11]

పెద్దదైన లియా టాటా మాడ్రిడ్లోని ఐఈ బిజినెస్ స్కూల్ నుండి మార్కెటింగ్లో మాస్టర్స్ డిగ్రీ పట్టాను అందుకుంది .లియా టాటా ప్రస్తుతం టాటా గ్రూప్ లో పనిచేస్తుంది, ప్రస్తుతం లియా టాటా ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తోంది.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Dutt, Ishita Ayan (29 March 2022). "Tata Steel board approves appointment of Noel Naval Tata as vice-chairman". Business Standard.
  2. Telugu, TV9 (2024-10-11). "Noel Tata: ఇప్పుడు రతన్‌ టాటా బాధ్యతలు చేపట్టే నోయెల్‌ టాటా ఎవరో తెలుసా?". TV9 Telugu. Retrieved 2024-10-12.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  3. "Ratan Tatas Successor: Noel Tata Appointed Chairman of Tata Trusts". Times of India. 11 October 2024. Retrieved 11 October 2024.
  4. 4.0 4.1 4.2 Carvalho, Brian; Layak, Suman (1 November 2009). "The Other Tata". Business Today. Retrieved 1 February 2019.
  5. "Noel Tata to be Tata International MD". Rediff.com. PTI. 2010-07-29. Archived from the original on 2019-12-25.
  6. ET Bureau (30 July 2010). "Is Noel Tata being groomed to succeed Ratan Tata?". The Times of India. Retrieved 30 May 2018.
  7. "Cyrus P. Mistry is Ratan Tata's heir apparent". The Hindu. 24 November 2011. Retrieved 24 November 2011.
  8. "Big shakeup! Cyrus Mistry removed as Tata Sons chairman, Ratan Tata steps in". Benette, Coleman & Co. Ltd. Economic Times. 24 October 2016. Retrieved 24 October 2016.
  9. Vijayaraghavan, Kala; John, Satish (14 February 2019). "Venkataramanan quits Tata Trusts; Noel joins Ratan Tata Trust". The Economic Times. Retrieved 19 June 2020.
  10. Vijayraghavan, Kala; Mandavia, Megha (26 August 2018). "How next gen scions Leah, Maya and Neville are working their way up in Tata Group companies". Retrieved 26 August 2018 – via The Economic Times.
  11. "Ratan Tata family tree: Look at its members from Jamsetji to Noel Tata". India Today. 10 October 2024. Retrieved 10 October 2024.