నౌమాన్ అలీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నౌమాన్ అలీ
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
నౌమాన్ అలీ
పుట్టిన తేదీ (1986-10-07) 1986 అక్టోబరు 7 (వయసు 37)
ఖిప్రో, సింధ్, పాకిస్తాన్
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుఎడమచేతి ఆర్థడాక్స్ స్పిన్
పాత్రబౌలర్
బంధువులురిజ్వాన్ అహ్మద్ (మామ)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 243)2021 జనవరి 26 - దక్షిణాఫ్రికా తో
చివరి టెస్టు2023 జూలై 24 - శ్రీలంక తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2007హైదరాబాదు
2012–2018Khan Research Laboratories
2019Multan Sultans (స్క్వాడ్ నం. 7)
2019–2023Northern
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు ఫక్లా లిఎ T20
మ్యాచ్‌లు 15 95 81 45
చేసిన పరుగులు 275 2,486 803 182
బ్యాటింగు సగటు 18.33 20.89 16.38 9.57
100లు/50లు 0/1 1/12 0/4 0/0
అత్యుత్తమ స్కోరు 97 103* 74 26*
వేసిన బంతులు 3,208 18,296 4,341 1,007
వికెట్లు 47 334 107 41
బౌలింగు సగటు 33.53 25.44 29.47 29.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 4 24 1 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 6 0 0
అత్యుత్తమ బౌలింగు 7/73 8/71 5/10 3/31
క్యాచ్‌లు/స్టంపింగులు 1/– 33/– 24/– 11/–
మూలం: Cricinfo, 24 July 2022

నౌమాన్ అలీ (జననం 1986, అక్టోబరు 7) పాకిస్తానీ క్రికెట్ ఆటగాడు. సింధ్‌లోని సంఘర్ ఉపవిభాగమైన ఖిప్రోలో జన్మించాడు.[1] 2021 జనవరిలో పాకిస్తాన్ క్రికెట్ జట్టులోకి అరంగేట్రం చేసాడు.[2] ఘనీ గ్లాస్ క్రికెట్ టీమ్ తరపున కూడా ఆడాడు.

ప్రారంభ జీవితం, కుటుంబం[మార్చు]

నౌమాన్ అలీ 1986, అక్టోబరు 7న సింధ్‌లోని సంఘర్ జిల్లా ఉపవిభాగంలోని ఖిప్రో అనే చిన్న నగరంలో పంజాబీ కుటుంబంలో జన్మించాడు.[3] ఇతని మేనమామ రిజ్వాన్ అహ్మద్ కూడా పాకిస్తాన్ తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. నౌమాన్ క్రికెటర్‌గా ఎదగడంలో కీలకపాత్ర పోషించాడు.[3] లతీఫాబాద్ నుండి వాణిజ్యంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేశాడు.[3]

క్రికెట్ రంగం[మార్చు]

2018–19 క్వాయిడ్-ఎ-అజామ్ వన్ డే కప్‌లో ఖాన్ రీసెర్చ్ లాబొరేటరీస్ తరఫున తొమ్మిది మ్యాచ్‌లలో పదిహేడు మందిని ఔట్‌ చేసి అగ్రస్థానంలో నిలిచాడు.[4] 2018-19 క్వాయిడ్-ఎ-అజం ట్రోఫీలో ఖాన్ రీసెర్చ్ లాబొరేటరీస్ తరఫున ఎనిమిది మ్యాచ్‌లలో 43 అవుట్‌లతో ప్రముఖ వికెట్-టేకర్ గా గుర్తింపు పొందాడు.[5] 2019 మార్చిలో, 2019 పాకిస్తాన్ కప్ కోసం సింధు జట్టులో ఎంపికయ్యాడు.[6][7]

2019 సెప్టెంబరులో, 2019–20 క్వాయిడ్-ఇ-అజామ్ ట్రోఫీ టోర్నమెంట్ కోసం నార్తర్న్ జట్టులో ఎంపికయ్యాడు.[8][9] పది మ్యాచ్‌ల్లో 54 అవుట్‌లతో టోర్నమెంట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.[10][11] 2021 జనవరిలో, 2020–21 పాకిస్తాన్ కప్ కోసం నార్తర్న్ జట్టులో ఎంపికయ్యాడు.[12][13]

2021 జనవరిలో, దక్షిణాఫ్రికాతో సిరీస్ కోసం పాకిస్తాన్ టెస్ట్ జట్టులో ఎంపికయ్యాడు.[14][15] 2021 జనవరి 26న దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ తరపున తన అరంగేట్రం చేశాడు. [16] దీంతో పాక్ తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేసిన నాల్గో వయస్కుడిగా నిలిచాడు.[17] 2021 జనవరి 26న దక్షిణాఫ్రికా కెప్టెన్ క్వింటన్ డి కాక్‌ ఔట్ చేసి అంతర్జాతీయ క్రికెట్‌లో తన మొదటి వికెట్‌ని సాధించాడు.[18] రెండో ఇన్నింగ్స్‌లో, 35 పరుగులకు 5 వికెట్లు తీసుకున్నాడు, టెస్టు క్రికెట్‌లో అరంగేట్రంలో ఐదు వికెట్లు తీసిన పాకిస్థాన్‌కు 12వ బౌలర్‌గా నిలిచాడు.[19]

2021 మార్చిలో జింబాబ్వేపై తన మొదటి విదేశీ సిరీస్‌కు ఎంపికయ్యాడు.[20] రెండో టెస్టులో నౌమన్ 97 పరుగులు చేసి అబిద్ అలీతో కలిసి 169 పరుగుల భాగస్వామ్యానికి సహకరించాడు.[21]

మూలాలు[మార్చు]

  1. "Nauman Ali opens up on his long journey to Pakistan team". Sportstar. 26 January 2021.
  2. "Nauman Ali". ESPN Cricinfo. Retrieved 9 November 2015.
  3. 3.0 3.1 3.2 "Nauman Ali, the Khipro kid who turned history-making late bloomer". ESPNcricinfo.
  4. "Quaid-e-Azam One Day Cup, 2018/19 - Khan Research Laboratories: Batting and bowling averages". ESPN Cricinfo. Retrieved 1 November 2018.
  5. "Quaid-e-Azam Trophy, 2018/19 - Khan Research Laboratories: Batting and bowling averages". Retrieved 22 November 2018.
  6. "Federal Areas aim to complete hat-trick of Pakistan Cup titles". Pakistan Cricket Board. Retrieved 25 March 2019.
  7. "Pakistan Cup one-day cricket from April 2". The International News. Retrieved 25 March 2019.
  8. "PCB announces squads for 2019-20 domestic season". Pakistan Cricket Board. Retrieved 4 September 2019.
  9. "Sarfaraz Ahmed and Babar Azam to take charge of Pakistan domestic sides". ESPN Cricinfo. Retrieved 4 September 2019.
  10. "Quaid-e-Azam Trophy, 2019/20: Most wickets". ESPN Cricinfo. Retrieved 30 December 2019.
  11. "Central Punjab win first-class Quaid-e-Azam Trophy 2019-20". Cricket World. Retrieved 30 December 2019.
  12. "Pakistan Cup One-Day Tournament promises action-packed cricket". Pakistan Cricket Board. Retrieved 7 January 2021.
  13. "Pakistan Cup One-Day Tournament: Fixtures Schedule, Teams, Player Squads – All you need to Know". Cricket World. Retrieved 7 January 2021.
  14. "Shan Masood, Mohammad Abbas, Haris Sohail dropped from Pakistan Test squad". ESPN Cricinfo. Retrieved 15 January 2021.
  15. "Nine uncapped players in 20-member side for South Africa Tests". Pakistan Cricket Board. Retrieved 15 January 2021.
  16. "1st Test, Karachi, Jan 26 - Jan 30 2021, South Africa tour of Pakistan". ESPN Cricinfo. Retrieved 26 January 2021.
  17. "Nauman Ali becomes fourth oldest Test debutant for Pakistan". Times of India.
  18. "Who is Pakistan Test debutant Nauman Ali?". Wisden. 27 January 2021.
  19. "Pak vs SA: Pakistan win first Test against South Africa". Geo TV. Retrieved 29 January 2021.
  20. "Wasim names Pakistan squad for Zimbabwe, South Africa tours; Dahani makes the cut". Geo News. Retrieved 8 May 2021.
  21. "Abid Ali 215*, Nauman Ali 97 put Pakistan in complete command against Zimbabwe". ESPN Cricinfo. Retrieved 8 May 2021.

బాహ్య లింకులు[మార్చు]