Jump to content

పట్నం సుబ్బయ్య

వికీపీడియా నుండి
పట్నం సుబ్బయ్య

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1985 - 1999
నియోజకవర్గం పలమనేరు నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1960
కొత్తపల్లె, ఐరాల మండలం, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ బీజేపీ
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ
వృత్తి డాక్టర్, రాజకీయ నాయకుడు

పట్నం సుబ్బయ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన పలమనేరు నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పని చేశాడు.[1]

జీవిత విశేషాలు

[మార్చు]

వైద్య వృత్తి నిర్వహిస్తున్న అతను 1985లో ఎన్.టి.రామారావు పిలుపు మేరకు తెలుగు దేశం పార్టీలోకి చేరాడు[2]. అతను 1985లో పలమనేరు ఎస్.సి నియోజక వర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎన్.షణ్ముగం పై విజయం సాధించాడు. [3] 1989లో అదే నియోజకవర్గం నుండి తెలుగు దేశం పార్టీ అభ్యర్థిగా మరల పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి పి.ఆర్.మునస్వామి పై విజయం సాధించాడు.[4] 1994లో అదే నియోజకవర్గం నుండి తెలుగు దేశం పార్టీ అభ్యర్థిగా మరల పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి ఎం. తిప్పెస్వామి పై విజయం సాధించాడు[5] అతను ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పౌరసరఫరాల శాఖ, ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అతమి మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ సమక్షంలో  భారతీయ జనతా పార్టీలో చేరాడు.[6] 2014లో బీజేపీలో చేరిన‌ అనంతరం 2019 ఎన్నికల్లో అతను మళ్ళీ చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరాడు. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం ఒడిపోవడంతో అతను తిరిగి మళ్ళీ బీజేపీ లోకి చేరాడు. రెండు సార్లు మంత్రి గా పనిచేసిన ఆయన చనిపోయేవరకు కూడా సాధారణ జీవితం గడిపాడు.[7]

అతను 2021 జనవరి 15న చిత్తూరు జిల్లా ఐరాల మండలం కొత్తపల్లె గ్రామంలో గుండెపోటుతో మృతి చెందాడు.[2] [8]

మూలాలు

[మార్చు]
  1. TV9 Telugu (15 January 2021). "మాజీ మంత్రి పట్నం సుబ్బయ్య కన్నుమూత.. రేపు స్వగ్రామంలో అంత్యక్రియలు.. సంతాపం తెలిపిన ప్రముఖులు". Retrieved 4 June 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)CS1 maint: numeric names: authors list (link)
  2. 2.0 2.1 "Former A.P. Minister Patnam Subbaiah passes away". The Hindu (in Indian English). Special Correspondent. 2021-01-15. ISSN 0971-751X. Retrieved 2022-06-05.{{cite news}}: CS1 maint: others (link)
  3. "Andhra Pradesh Assembly Election Results in 1985". Elections in India. Archived from the original on 2022-06-05. Retrieved 2022-06-05.
  4. "Andhra Pradesh Assembly Election Results in 1989". Elections in India. Archived from the original on 2022-06-19. Retrieved 2022-06-05.
  5. "Andhra Pradesh Assembly Election Results in 1994". Elections in India. Archived from the original on 2022-04-25. Retrieved 2022-06-05.
  6. narsimha.lode. "మాజీ మంత్రి పట్నం సుబ్బయ్య బీజేపీలో చేరిక". Asianet News Network Pvt Ltd. Retrieved 2022-06-05.
  7. Samrat, Medi (2021-01-15). "మాజీ మంత్రి పట్నం సుబ్బయ్య కన్నుమూత‌". telugu.newsmeter.in. Retrieved 2022-06-05.
  8. Andhra Jyothy (16 January 2021). "మాజీ మంత్రి పట్నం సుబ్బయ్య కన్నుమూత" (in ఇంగ్లీష్). Archived from the original on 10 June 2022. Retrieved 10 June 2022.