పత్రలేఖ పాల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పత్రలేఖ పాల్
పాల్ 2018 లో
జననం
పత్రలేఖ పాల్

20 ఫిబ్రవరి 1989
ఇతర పేర్లుఅన్వితా పాల్
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2014–ప్రస్తుతం
జీవిత భాగస్వామిరాజ్‌కుమార్ రావు

పత్రలేఖ పాల్ (జననం: 1989 ఫిబ్రవరి 20) భారతీయ నటి[2][3].[4] ఆమె దర్శకుడు హన్సల్ మెహతా హిందీ చిత్రం సిటీలైట్స్ [3],[5] రాజ్‌కుమార్ రావ్‌తో కలిసి తన అరంగేట్రం చేసింది.[6] [7]

ప్రారంభ జీవితం[మార్చు]

పత్రలేఖ మేఘాలయలోని షిల్లాంగ్‌లో బెంగాలీ కుటుంబంలో చార్టర్డ్ అకౌంటెంట్ తండ్రి, గృహిణి తల్లి పాప్రీ పాల్‌కు జన్మించింది. ఒక ఇంటర్వ్యూలో ఆమె, తన అమ్మమ్మ కవయిత్రి అని పేర్కొంది. ఆమెకు ఇద్దరు తోబుట్టువులు పర్ణలేఖ పాల్, అగ్నిష్ పాల్ ఉన్నారు. ఆమె బోర్డింగ్ స్కూల్ అయిన అస్సాం వ్యాలీ స్కూల్‌కి వెళ్లి, ఆపై బెంగళూరులోని బిషప్ కాటన్ గర్ల్స్ స్కూల్ నుండి పట్టభద్రురాలైంది. ఆమె తన అడుగుజాడల్లో నడవాలని ఆమె తండ్రి కోరుకున్నారు, కానీ ఆమెకు నటన పట్ల ఆసక్తి ఉండేది.[8] హెచ్.ఆర్. కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్‌లో చదువుతున్నప్పుడు ఆమెకు సినిమాల్లో అవకాశం రాకముందు బ్లాక్‌బెర్రీ, టాటా డొకోమో కోసం కొన్ని వాణిజ్య ప్రకటనలు చేసింది.[9]

వ్యక్తిగత జీవితం[మార్చు]

పత్రలేఖ 2010 నుండి నటుడు రాజ్‌కుమార్ రావుతో అనుబంధంలో ఉంది.[10] 2021 నవంబరు 15 న ఈ జంట, చండీగఢ్‌లోని ఒబెరాయ్ సుఖ్‌విలాస్ స్పా రిసార్ట్‌లో సాంప్రదాయ హిందూ పద్ధతిలో పెళ్ళి చేసుకుంది.[11][12]

కెరీర్[మార్చు]

పత్రలేఖ రాజ్‌కుమార్ రావు సరసన సిటీలైట్స్ డ్రామాలో ప్రముఖ పాత్రతో సినీ రంగ ప్రవేశం చేసింది.[13] హన్సల్ మెహతా దర్శకత్వం వహించిన ఈ చిత్రం రాజస్థాన్‌లో నివసిస్తున్న ఓ పేద జంట, జీవనోపాధి కోసం ముంబైకి వెళ్ళిన కథను చెబుతుంది.[14]  తక్కువ బడ్జెట్‌తో రూపొందించబడిన ఈ చిత్రం వాణిజ్యపరంగా విజయవంతమైంది, విమర్శకుల నుండి ఆమెకు సానుకూల సమీక్షలు వచ్చాయి.[15]

లవ్ గేమ్‌ల సహనటులు గౌరవ్ అరోరా, తారా అలీషా బెర్రీతో పత్రలేఖ

ఆమె తదుపరి చిత్రం, లవ్ గేమ్స్. ఇది, విక్రమ్ భట్ దర్శకత్వం వహించిన అర్బన్-థ్రిల్లర్. ముఖేష్ భట్, మహేష్ భట్ నిర్మించారు.[16][17] ఈ చిత్రం తారాగణంలో పత్రలేఖ, గౌరవ్ అరోరా, తారా అలీషా బెర్రీ ఉన్నారు.[18] [19]

ఫిల్మోగ్రఫీ[మార్చు]

సినిమాలు[మార్చు]

సంవత్సరం శీర్షిక పాత్ర గమనికలు మూలాలు
2014 సిటీ లైట్స్ రాఖీ సింగ్ సినిమా రంగ ప్రవేశం
2016 లవ్ గేమ్స్ రామోనా రాయ్‌చంద్
2018 నానుకీ జాను సిద్ధి [20]
2023 ఫూలే సావిత్రిబాయి ఫూలే ప్రకటించారు [21]
టీబిఏ వైల్డ్ వైల్డ్ పంజాబ్ ఇంకా విడుదల చేయని [22]
టీబిఏ వేర్ ఈజ్ మై కన్నడ ఇంకా విడుదల చేయని

వెబ్ సిరీస్[మార్చు]

సంవత్సరం శీర్షిక పాత్ర వేదిక గమనికలు మూలాలు
2017 బోస్:డెడ్/అలైవ్ నందిని ఏఎల్టిబాలాజీ వెబ్ అరంగేట్రం [23]
2018 చీర్స్ ప్రేమ జియో సినిమా భారతదేశపు మొదటి విఆర్ వెబ్ సిరీస్
2019 బద్నాం గాలి నయోనికా జీ5 [24]
2020 ఫర్బిడెన్ లవ్ కీయ జీ5 సెగ్మెంట్  : అరేంజ్డ్ మ్యారేజ్ [25]
2021 మై హీరో బోల్ రహా హు లైలా ఏఎల్టిబాలాజీ, జీ5 [26]

అవార్డ్స్[మార్చు]

సంవత్సరం అవార్డు (లు) వర్గం పని ఫలితం
2015 స్టార్ స్క్రీన్ అవార్డులు స్టార్ స్క్రీన్ అవార్డ్ మోస్ట్ ప్రామిసింగ్ న్యూకమర్ - ఫిమేల్ సిటీలైట్స్ గెలిచింది

మూలాలు[మార్చు]

 1. "Patralekha wants to act with everyone — from Meryl Streep to Ranbir Kapoor". Hindustan Times. 29 May 2014. Retrieved 12 April 2016.
 2. "Why Rajkummar and Patralekha are tight-lipped about their relationship". The Times of India. 6 May 2014. Retrieved 12 April 2016.
 3. 3.0 3.1 IANS (29 May 2014). "Newcomer Patralekha eyeing Hollywood". The Times of India. Retrieved 12 April 2016.
 4. Anand Vaishnav (28 May 2014). "CityLights Actress Patralekha Is Happy With Her Unconventional Debut". Indiatimes.com. Retrieved 12 April 2016.
 5. Indo-Asian News Service (29 May 2014). "Patralekha Wants to go to Hollywood, Star With Streep, Roberts and Winslet". NDTV Movies.com. Archived from the original on 19 అక్టోబరు 2015. Retrieved 12 April 2016.
 6. IANS (26 May 2014). "Patralekha has a clarity about what she's doing: Mahesh Bhatt". The Times of India. Retrieved 12 April 2016.
 7. Aanchal Tuli (11 May 2014). "Patralekha talks about memories of Delhi". The Times of India. Retrieved 12 April 2016.
 8. IANS (28 May 2014). "Vidya Balan my inspiration: Patralekha". The Times of India. Retrieved 12 April 2016.
 9. Vaibhavi V Risbood (20 February 2016). "Reports about my break-up with Rajkummar astonished me: Patralekha". The Times of India. Retrieved 12 April 2016.
 10. "Bollywood celebs on a vacation". The Times of India.
 11. "Rajkummar Rao marries Patralekhaa in Chandigarh". India Today. 15 November 2021.
 12. "Rajkummar Rao and Patralekhaa tied the knot at this stunning Chandigarh resort". 16 November 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
 13. "Rajkummar Rao's girlfriend to debut in Citylights". India Today. 2 May 2014. Retrieved 12 August 2014.
 14. Jaskiran Kapoor (16 May 2014). "Girl And the City". The Indian Express. Retrieved 12 April 2016.
 15. IANS (12 June 2014). "Patralekha dedicates 'Citylights' success to Mahesh Bhatt, Hansal Mehta". The Indian Express. Retrieved 12 April 2016.
 16. Press Trust of India (28 March 2016). "Did not get many offers after 'CityLights': Patralekha". IBNLive (in ఇంగ్లీష్). Retrieved 12 April 2016.
 17. Gaikwad, Pramod (3 March 2016). "Love Games trailer: Patralekhaa starrer is all about love, lust and betrayals". The Indian Express. Retrieved 3 March 2016.[permanent dead link]
 18. "Patralekha sizzles in Love Games poster". The Hindu. 3 March 2016. Retrieved 3 March 2016.
 19. "Raj Kummar Rao calls Patralekha hot in 'Love Games' poster". Times of India. Retrieved 3 March 2016.
 20. Chauhan, Gaurang (26 March 2018). "It's Patralekhaa vs Rajkummar Rao at the box office as Nanu Ki Jaanu clashes with Omerta". Times Now. Retrieved 26 March 2018.
 21. "Pratik Gandhi & Patralekhaa to bring alive Mahatma Jyotirao Phule & Savitribai Phule in their biopic 'Phule'". Miss Malini. 11 April 2022.
 22. "Sunny Singh, Varun Sharma and Patralekhaa to star in Luv Ranjan's 'Wild Wild Punjab'", Miss Malini, 4 October 2021
 23. "Bose Dead/Alive trailer: Rajkummar Rao tells the difference between revolutionary and slave". Hindustan Times. 18 August 2017. Retrieved 11 November 2017.
 24. "Patralekhaa to play surrogate mother in Zee 5 web feature Badnaam Gali; film will release on 10 May". First Post. 28 April 2019. Retrieved 8 November 2021.
 25. "ZEE5 original 'Forbidden Love' pushes boundaries to deconstruct emotions & explore the edgy side of 4 love stories". India Today.
 26. "Patralekhaa plays aspiring actress in Mai Hero Boll Raha Hu". The New Indian Express (in ఇంగ్లీష్). Retrieved 2021-03-31.