పమిడి ఘంటం శ్రీనరసింహ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గౌరవ న్యాయమూర్తి
జస్టిస్ పీఎస్ నరసింహ
భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి
In office
31 ఆగష్టు 2021 – ప్రస్తుతం
Nominated byఎన్.వి రమణ
Appointed byరామ్‌నాథ్‌ కోవింద్‌
అదనపు సొలిసిటర్‌ జనరల్‌
In office
2014–2018 [1]
Appointed byప్రతిభా పాటిల్
వ్యక్తిగత వివరాలు
జననంమోదేపల్లి గ్రామం, అద్దంకి మండలం , ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
కళాశాలఢిల్లీ యూనివర్సిటీ

పమిడి ఘంటం శ్రీనరసింహ భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో 2014 నుండి 2018 వరకు అదనపు సొలిసిటర్‌ జనరల్‌గా పని చేశాడు. పమిడి ఘంటం శ్రీనరసింహ 30 ఆగష్టు 2021న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశాడు.[2][3]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

పీఎస్ నరసింహ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లా, అద్దంకి మండలం, మోదేపల్లి గ్రామం లో జన్మించాడు.[4] ఆయన హైదరాబాద్ బడీచౌడీలోని సెయింట్‌ ఆంథోనీ స్కూల్‌లో పదవ తరగతి వరకు, నిజాం కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి, ఢిల్లీలో న్యాయశాస్త్రంలో డిగ్రీ పట్టా అందుకున్నాడు.[5]

వృత్తి జీవితం

[మార్చు]

ఆయన 1990 నుంచి సుప్రీంకోర్టులో ప్రాక్టీసు ప్రారంభించాడు, ఆయనకు హైకోర్టు న్యాయమూర్తిగా అవకాశం వచ్చినప్పటికీ ఆయన వెళ్లడానికి ఇష్టపడలేదు. పీఎస్ నరసింహ 2014 నుంది 2018 వరకు సుప్రీంకోర్టు అదనపు సొలిసిటర్‌ జనరల్‌గా పని చేసి, తిరిగి న్యాయవాదిగా పని చేశాడు. ఆయన బార్ అసోసియేషన్ నుంచి నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియామకమై 31 ఆగష్టు 2021న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశాడు.[6]ఆయన సీనియారిటీ ప్రకారం అక్టోబరు 30, 2027 నుంచి మే 2028 వరకూ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నాడు.[7][8]

మూలాలు

[మార్చు]
  1. Bar and Bench - Indian Legal news (5 October 2018). "PS Narasimha resigns as Additional Solicitor General, will continue in office till Dec". Bar and Bench - Indian Legal news (in ఇంగ్లీష్). Archived from the original on 7 September 2021. Retrieved 7 September 2021.
  2. The Times of India (31 August 2021). "9 Supreme Court judges take oath on a day of many records | India News - Times of India" (in ఇంగ్లీష్). Archived from the original on 6 September 2021. Retrieved 6 September 2021.
  3. Andrajyothy (31 August 2021). "సుప్రీంకోర్టు జడ్జీలుగా 9 మంది ప్రమాణస్వీకారం". Archived from the original on 7 September 2021. Retrieved 7 September 2021.
  4. Andrajyothy (31 August 2021). "బడీచౌడీ స్కూలు నుంచి బడా కోర్టుకు". Archived from the original on 7 September 2021. Retrieved 7 September 2021.
  5. Andrajyothy (31 August 2021). "ప్రకాశం నుంచి న్యాయ ప్రస్థానం". andhrajyothy. Archived from the original on 31 August 2021. Retrieved 7 September 2021.
  6. Prabha News (1 September 2021). "సుప్రీం పీఠంపై తెలుగు తేజం.. జస్టిస్ పీఎస్ నరసింహ!". Archived from the original on 7 September 2021. Retrieved 7 September 2021.
  7. Sakshi (31 August 2021). "సర్వోన్నత న్యాయస్థానంలో... సరికొత్త చరిత్ర". Archived from the original on 7 September 2021. Retrieved 7 September 2021.
  8. 10TV (26 August 2021). "సుప్రీం పీఠంపై తెలుగు తేజం.. పీఎస్ నరసింహ!" (in telugu). Archived from the original on 7 September 2021. Retrieved 7 September 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)