పయ్యావుల లక్ష్మయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పయ్యావుల లక్ష్మయ్య
జననం
మరణం2014, మార్చి 9
సుపరిచితుడు/
సుపరిచితురాలు
తెలంగాణ సాయుధ పోరాట నాయకుడు

పయ్యావుల లక్ష్మయ్య, (మ. 2014, మార్చి 9) తెలంగాణ సాయుధ పోరాట యోధుడు,[1] రాజకీయ నాయకుడు. పదిహేనేళ్ళ వయస్సులోనే గ్రామంలో జరుగుతున్న అరాచకాలను ప్రశ్నించడంతో పాటు పోలీసు చర్యలకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించాడు.[2]

జననం

[మార్చు]

లక్ష్మయ్య తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా, ముదిగొండ మండలం, గోకినెపల్లిలో జన్మించాడు.

సాయుధ పోరాటం

[మార్చు]

బాలఖైదీగా పంపిస్తే శిక్ష తక్కువగా ఉంటుందని భావించిన పోలీసులు, లక్ష్మయ్యకు 19ఏళ్ళ యువకుడిగా నకిలీ ధ్రువపత్రం సృష్టించి నిజామాబాద్ జైలుకు పంపిచారు. ఏడాదిన్నరపాటు జైలు జీవితం గడిపిన తర్వాత జైలు కిటికీ ఊచలు కోసేసి, ధోవతులను కలిపికట్టి గట్టుమీద చెట్టును ఆధారం చేసుకుని అక్కడి నుంచి తప్పించుకొని స్వగ్రామానికి చేరుకున్నాడు.[2] ఇల్లెందు అడవుల్లోకి వెళ్ళి, కొంతకాలం తరువాత హుజూర్ నగర్ దళంలో కలిసి దళ సభ్యుడిగా పనిచేశాడు.

రాజకీయ ప్రస్థానం

[మార్చు]

సాయుధ పోరాటంలో, ఉమ్మడి కమ్యూనిస్టు ఉద్యమంలో పాల్గొన్న లక్ష్మయ్య ఆ తరువాతికాలంతో సీపీఎంలో కొనసాగాడు. పదేళ్ళపాటు గోకినేపల్లి గ్రామ సర్పంచ్ గా, రెండుసార్లు టేకులపల్లి సహకార బ్యాంకు సొసైటీ చైర్మన్‌గా కూడా పనిచేశాడు.[2]

మరణం

[మార్చు]

లక్ష్మయ్య అనారోగ్యంతో 2014, మార్చి 9ఖమ్మంలోని తన స్వగృహంలో మరణించాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. "తెలంగాణ సాయుధ పోరాటం అజరామరమైనది". NavaTelangana. 2020-09-30. Archived from the original on 2023-01-21. Retrieved 2023-01-21.
  2. 2.0 2.1 2.2 "తెలంగాణ పోరాటయోధుడు లక్ష్మయ్య కన్నుమూత". Sakshi. 2014-03-10. Archived from the original on 2023-01-21. Retrieved 2023-01-21.
  3. "తెలంగాణ సాయుధ పోరాట యోధుడు లక్ష్మయ్య ఇక లేరు". ap7am.com (in ఇంగ్లీష్). 2014-03-10. Archived from the original on 2022-03-19. Retrieved 2023-01-21.