పర్భుభాయ్ వాసవ
పర్భుభాయ్ వాసవ | |||
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 16 మే 2014 | |||
నియోజకవర్గం | బార్దోలి | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | కోల్‌ఖాడీ, మాండ్వి, సూరత్, గుజరాత్ | 1970 మార్చి 1||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | కాంగ్రెస్ పార్టీ | ||
జీవిత భాగస్వామి | పన్నాబెన్ పి. వాసవ | ||
సంతానం | 2 | ||
నివాసం | సతవవ్, మాండ్వి, సూరత్, గుజరాత్ | ||
మూలం | [1] |
పర్భుభాయ్ నాగర్‌భాయ్ వాసవ (ప్రభు) (జననం 1 మార్చి 1970) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన బార్దోలి లోక్‌సభ నియోజకవర్గం నుండి మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]పర్భుభాయ్ వాసవ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2012లో మాండ్వీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 2014లో భారతీయ జనతా పార్టీలో చేరి 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బార్దోలి లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి తుషార్ చౌదరిపై 1,24,895 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 2019 ఎన్నికలలో తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి తుషార్ చౌదరిపై 2,15,974 ఓట్ల మెజారిటీతో రెండోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2]
పర్భుభాయ్ వాసవ 2024 ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి సిద్ధార్థ్ అమర్‌సిన్హ్ చౌదరిపై 2,15,974 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా మూడోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3]
మూలాలు
[మార్చు]- ↑ TimelineDaily. "Gujarat: Prabhubhai Vasava, BJP Candidate From Bardoli Constituency" (in ఇంగ్లీష్). Archived from the original on 20 July 2024. Retrieved 20 July 2024.
- ↑ "Bardoli Election Results 2019: BJP Parbhubhai Vasava won by 2.15 lakh votes and will be Bardoli MP" (in ఇంగ్లీష్). 24 May 2019. Archived from the original on 20 July 2024. Retrieved 20 July 2024.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Bardoli". Archived from the original on 20 July 2024. Retrieved 20 July 2024.