Jump to content

పర్‌ఫ్యూమ్

వికీపీడియా నుండి
పర్‌ఫ్యూమ్
దర్శకత్వంజే.డి. స్వామి
స్క్రీన్ ప్లేజే.డి. స్వామి
పాటలు
కథజే.డి. స్వామి
నిర్మాత
  • జె.సుధాకర్
  • శివ.బి
  • రాజీవ్ కుమార్.బి
  • లావురి శ్రీనివాస్
  • శ్రీధర్ అక్కినేని
  • రాజేంద్ర కనుకుంట్ల
తారాగణం
ఛాయాగ్రహణంమహేష్
కూర్పుప్రవీణ్ పూడి
సంగీతంఅజయ్ అరసాడ
నిర్మాణ
సంస్థలు
శ్రీమాన్ మూవీస్ ప్రజెంట్స్, మిత్రా మూవీ మేకర్స్, ఫరెవర్ ఫ్రెండ్స్
విడుదల తేదీ
24 నవంబరు 2023 (2023-11-24)
దేశంభారతదేశం
భాషతెలుగు

పర్‌ఫ్యూమ్ 2023లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీమాన్ మూవీస్ ప్రజెంట్స్, మిత్రా మూవీ మేకర్స్, ఫరెవర్ ఫ్రెండ్స్ బ్యానర్‌పై జె.సుధాకర్, శివ.బి, రాజీవ్ కుమార్.బి, లావురి శ్రీనివాస్, రాజేంద్ర కనుకుంట్ల, శ్రీధర్ అక్కినేని నిర్మించిన ఈ సినిమాకు జే.డి. స్వామి దర్శకత్వం వహించాడు. నాగ్, ప్రాచీ థాకర్, అభినయ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను జనవరి 07న చేసి సినిమాను నవంబర్ 24న విడుదల చేశారు.[1] [2]

స్మెల్ అబ్‌సెషన్ వ్యాధితో బాధపడే సైకో వ్యాస్ (చేనాగ్) ఉంటాడు. అమ్మాయి వాసన వస్తే చాలు అతనిలో వైబ్రేషన్స్ వచ్చి ఓ రకంగా మారిపోయి మహిళలను చంపడం ప్రారంభిస్తాడు, ఈ కేసును దర్యాప్తు చేసే పనిని ఏసీపీ దీప్తి (అభినయ)కు అప్పగిస్తారు. అదే సమయంలో వ్యాస్ కోసం లీలా (ప్రాచీ థాకర్) వెతుకుతూ ఉంటుంది. అయితే లీలాకు వ్యాస్ కనిపించడంతో ఆమె ముద్దు పెడుతుంది. దీంతో ఆ మైకంలో ఉండిపోతాడు వ్యాస్ ఇక ఆమె కనిపించడంతో అందరి ముందు తనకు ముద్దు పెట్టగా ఆమె అందరి ముందు తనని అవమాన పరుస్తుంది దీంతో కోపంలో ఉన్న వ్యాస్ లీలాని కిడ్నాప్ చేస్తాడు. అసలు లీలా ఎవరు? ఆమె వ్యాస్ కు ఎందుకు ముద్దు పెట్టింది ? వ్యాస్ ఫ్లాష్ బ్యాక్ ఏంటి ? వ్యాస్‌ను పోలీసులు పెట్టుకున్నారా? లేదా అనేదే మిగతా సినిమా కథ.[3]

నటీనటులు

[మార్చు]
  • నాగ్
  • అభినయ
  • ప్రాచీ థాకర్
  • భూషణ్
  • రాయల హరిశ్చంద్ర
  • మీర్
  • కృష్ణ తేజ
  • సత్తన్న
  • గిరి ఖమ్మాపటి
  • కేశవ్ దీపక్
  • మేగ్ రాజ్
  • లావణ్య రెడ్డి
  • గీతాంజలి తస్య
  • గ్రీష్మ
  • ఇషాన్
  • నోమిన తార
  • గట్టు రవి


మూలాలు

[మార్చు]
  1. Andhrajyothy (17 November 2023). "ఇంత వరకు ఇండియన్ స్క్రీన్ మీద చూడని కథతో." Archived from the original on 18 November 2023. Retrieved 18 November 2023.
  2. 10TV Telugu (7 February 2023). "పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఎంగేజింగ్ థ్రిల్లర్ 'పర్‌ఫ్యూమ్'." (in Telugu). Archived from the original on 18 November 2023. Retrieved 18 November 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  3. NTV Telugu (24 November 2023). "అరుదైన వ్యాధితో బాధపడే సైకో కథ..పర్‌ఫ్యూమ్ రివ్యూ". Archived from the original on 22 February 2024. Retrieved 22 February 2024.