Jump to content

పహిల్వాన్

వికీపీడియా నుండి
ప‌హిల్వాన్‌
దర్శకత్వంఎస్‌.కృష్ణ
స్క్రీన్ ప్లేఎస్‌.కృష్ణ
డి.ఎస్. కన్నన్
మధూ
నిర్మాతస్వప్నకృష్ణ
తారాగణంసుదీప్
సునీల్ శెట్టి
ఆకాంక్ష సింగ్
కబీర్ దుహన్ సింగ్
సుశాంత్ సింగ్
అవినాష్
శరత్ లోహితాశ్వ
ఛాయాగ్రహణంకరుణాకర ఎ.
కూర్పురూబెన్
సంగీతంఅర్జున్‌ జన్యా
నిర్మాణ
సంస్థలు
జీ స్టూడియోస్
ఆర్.ఆర్.ఆర్ మోషన్ పిక్చర్స్ ప్రొడక్షన్
పంపిణీదార్లువారాహి చలన చిత్రం
విడుదల తేదీ
12 సెప్టెంబరు 2019 (2019-09-12)
సినిమా నిడివి
166 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

పహిల్వాన్ 2019లో విడుదలైన తెలుగు సినిమా. ఆర్‌.ఆర్‌.ఆర్‌. మోషన్‌ పిక్చర్స్‌, వారాహి చలనచిత్రం బ్యానర్ల పై స్వప్న కృష్ణ నిర్మించిన ఈ సినిమాకు ఎస్‌. కృష్ణ దర్శకత్వం వహించాడు. సుదీప్‌, ఆకాంక్ష సింగ్‌, సునీల్‌ శెట్టి, కబీర్‌ దుహన్‌ సింగ్‌, అవినాష్‌, సుషాంత్‌ సింగ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సెప్టెంబరు 12, 2019న విడుదలైంది.

కృష్ణ (సుదీప్) ఓ అనాథ. అతడిని కుస్తీ పహిల్వాన్ శంకర్ (సునీల్ శెట్టి) చేరదీస్తాడు. చిన్నతనం నుంచి తన దగ్గరే ఉంచుకొని పెంచి పెద్ద చేస్తాడు. సుదీప్ చిన్నప్పటి నుంచి కుస్తీ వాతావరణంలో పెరగడం వలన గురువు దగ్గర ఆ విద్యను నేర్చుకుంటాడు. కుస్తీ పోటీల్లో మంచి పేరు తెచ్చుకుంటాడు. ఈ సమయంలో కృష్ణ (సుదీప్) ఆకాంక్ష సింగ్ తో ప్రేమలో పడి కుస్తీని నిర్లక్ష్యం చేస్తాడు. ఈ విషయం తెలిసిన శంకర్ (సునీల్ శెట్టి) మందలించినా వినకుండా ఆకాంక్ష సింగ్ ను వివాహం చేసుకుంటాడు. ఇదంతా అతని గురువు శంకర్ కి నచ్చదు తన దగ్గర నేర్చుకున్న కుస్తీని ఎక్కడ ప్రదర్శించవద్దని చెప్పి, కృష్ణను ఇంటి నుంచి పంపించేస్తాడు. గురువు ఆజ్ఞను జవదాటని కృష్ణ అక్కడి నుంచి దూరంగాదూరంగా వెళ్ళి బాక్సింగ్ ఛాంపియన్ ఎలా అయ్యాడు..? అనేదే మిగతా సినిమా కథ.[1][2]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్లు: ఆర్‌.ఆర్‌.ఆర్‌. మోషన్‌ పిక్చర్స్‌, వారాహి చలనచిత్రం
  • నిర్మాత: స్వప్న కృష్ణ
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:ఎస్‌.కృష్ణ
  • సంగీతం: అర్జున్‌ జన్యా
  • సినిమాటోగ్రఫీ: కరుణాకర ఏ.
  • ఎడిటింగ్: రూబెన్‌

పాటలు

[మార్చు]

అన్ని పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి[4]

క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "వచ్చాడయ్యో పహిల్వాన్"  వ్యాస్ రాజ్ 3:14
2. "‘కన్నెపిచ్చుక’"  సంజిత్ హెగ్డే  
3. "జైహో పహిల్వాన్"    4:20
4. "జైహో పహిల్వాన్"  సాయి చరణ్ భాస్కరుని, సాకేత్ కోమండూరి  
5. "‘యోధుడా’"  విజయ్ ప్రకాష్, సిద్ధార్థ్ బాసూర్  
6. "‘ఫైర్ బ్రాండూ’"  రేవంత్  
7. "‘ప్రేమ కాలం’"  శ్రీ కృష్ణ, రమ్య బెహరా, రాహుల్ నంబియార్  

మూలాలు

[మార్చు]
  1. TV9 Telugu (12 September 2019). "'పహిల్వాన్' - టైటిల్ అదిరినా.. పట్టులేని కుస్తీ!". Retrieved 29 October 2021. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)CS1 maint: numeric names: authors list (link)
  2. Zee News Telugu (12 September 2019). "థియేటర్స్‌లో 'పహిల్వాన్' సత్తా ఏపాటిది ?..... మూవీ రివ్యూ మీకోసం". Archived from the original on 29 అక్టోబరు 2021. Retrieved 29 October 2021.
  3. Sakshi (23 December 2018). "పహిల్వాన్‌గా కిచ్చ సుదీప్‌". Retrieved 29 October 2021. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  4. 10TV (28 August 2019). "పహిల్వాన్ - జ్యూక్ బాక్స్" (in telugu). Retrieved 29 October 2021. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)