డి.ఎస్. కన్నన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డి.ఎస్. కన్నన్
జననం14 ఏప్రిల్
వృత్తితెలుగు సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత
క్రియాశీల సంవత్సరాలు2004 – ప్రస్తుతం
జీవిత భాగస్వామినిహారికారెడ్డి (వి. 2009)

డి.ఎస్. కన్నన్, తెలుగు సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత.[1][2] తెలుగు, తమిళ, కన్నడ, హిందీ సినిమాలకు కథా, స్క్రీన్ ప్లే రచయితగా పనిచేస్తున్న కన్నన్, 2009లో వచ్చిన సారాయి వీర్రాజు సినిమాకి దర్శకత్వం వహించాడు.[3]

జననం - విద్యాభ్యాసం

[మార్చు]

కన్నన్, ఏప్రిల్ 14న అరుణాచలంలో జన్మించాడు.[4] ఎమ్మెస్సి కంప్యూటర్స్ చదివిన కన్నన్, నాటకరంగంలో ఎం.ఏ., ఎంఫిల్ పూర్తిచేసాడు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (ఎన్.ఎస్.డి)లో చేరి రంగస్థల కళల్లో శిక్షణపొందాడు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

2009, నవంబరు 20న నిహారికారెడ్డి (ఫాషన్ డిజైనర్) తో కన్నన్ వివాహం జరిగింది.[5] వీరికి ఒక కుమార్తె (పూర్ణజ్ఞాన ఐశ్వర్య) ఒక కుమారుడు (యశో చెగువేరా).

సినిమారంగం

[మార్చు]

నాటకరంగంలో పట్టా అందుకున్న కన్నన్, యూనివర్సిటీలో కొత్తగా చేరిన వారికి శిక్షణ ఇచ్చేవాడు. అలా కమల్ హాసన్ నటించిన సత్యమ్-శివమ్ సినిమా స్క్రిప్ట్‌లో వర్క్‌ చేశాడు. ఈ తర్వాత విజయేంద్ర ప్రసాద్ పరిచయమవడంతో సినీ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ సినిమాలకు కథతో పాటు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశాడు.[6][7]

దర్శకుడిగా

[మార్చు]

విశాలాక్షి క్రియేషన్స్ పతాకంపై పి.ఆర్.కె. రావు నిర్మాణ సారథ్యంలో అజయ్, రమ్య నంబీశన్, మధులిక ముఖ్యపాత్రల్లో నటించిన సారాయి వీర్రాజు సినిమాకు కన్నన్ తొలిసారిగా దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఒకేసారి తెలుగు, తమిళ (తమిళచిత్రం: వెట్టట్టం) భాషలలో చిత్రీకరించబడింది.[8][9]

కథ, స్క్రీన్ ప్లే రచయితగా

[మార్చు]
  1. 2005: ఛత్రపతి
  2. 2006: విక్రమార్కుడు
  3. 2007: యమదొంగ
  4. 2007: అతిథి
  5. 2009: బిల్లా
  6. 2011: శక్తి
  7. 2013: బిరియాని
  8. 2015: గబ్బర్ (హిందీ)
  9. 2015: మాస్
  10. 2017: మార్షల్
  11. 2019: సైరా నరసింహారెడ్డి
  12. 2019: పహిల్వాన్ (కన్నడ)
  13. 2019: విజిల్
  14. 2021: కోటిగొబ్బ 3
  15. 2023: భోళా శంకర్
  16. 2023: జవాన్
  17. 2024: హరి హర వీరమల్లు

మూలాలు

[మార్చు]
  1. "D.S. Kannan". IMDb. Retrieved 14 April 2021.
  2. "D S Kannan - Movies, Biography, News, Age & Photos". BookMyShow. Retrieved 14 April 2021.
  3. "Telugu Cinema News | Telugu Movie Reviews | Telugu Movie Trailers - IndiaGlitz Telugu". IndiaGlitz.com. Archived from the original on 13 ఆగస్టు 2014. Retrieved 14 April 2021.
  4. "D.S. Kannan : Director Wiki, Bio, Filmography, D.S. Kannan Movies List, Songs, Age, Videos". MovieGQ. Retrieved 14 April 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  5. Namasthe Telangana (2 April 2021). "చీరకట్టు..కనికట్టు!". Archived from the original on 25 జూలై 2021. Retrieved 25 July 2021.
  6. "D.S. Kannan". www.amazon.com. Retrieved 14 April 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  7. సాక్షి, డైలీహంట్ (13 February 2019). "భాష లేనిది.. బంధమున్నది". Dailyhunt. Archived from the original on 14 April 2021. Retrieved 14 April 2021.
  8. "Sarai Veerraju press meet - Telugu cinema function - Ajay". www.idlebrain.com. Retrieved 14 April 2021.
  9. "Dil Raju buys Sarai Veeraju rights". www.bharatwaves.com. Retrieved 14 April 2021.{{cite web}}: CS1 maint: url-status (link)

బయటి లింకులు

[మార్చు]