Jump to content

రాక్షసుడు (2015 సినిమా)

వికీపీడియా నుండి
రాక్షసుడు
దర్శకత్వంవెంకట్ ప్రభు
రచనవెంకట్ ప్రభు
నిర్మాతఎం.ఎస్.ఆర్, మిర్యాల రాజాబాబు
తారాగణంసూర్య, నయనతార, ప్రణీత
ఛాయాగ్రహణంఆర్.డి.రాజశేఖర్
కూర్పుప్రవీణ్.కె.ఎల్
సంగీతంయువన్ శంకర్ రాజా
నిర్మాణ
సంస్థ
మేధా క్రియోష‌న్స్
విడుదల తేదీ
29 మే 2015 (2015-05-29)
సినిమా నిడివి
120 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

రాక్షసుడు 2015లో విడుదలైన తెలుగు సినిమా. మేధా క్రియోష‌న్స్ బ్యానర్ పై ఎం.ఎస్.ఆర్, మిర్యాల రాజాబాబు (కృష్ణారెడ్డి) నిర్మించిన ఈ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహించాడు. సూర్య, నయనతార, ప్రణీత ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తమిళంలో ‘మాసు ఎంగిర మసిలమణి’ పేరుతో, తెలుగులో ‘రాక్షసుడు’ పేరుతో మే 29, 2015న విడుదలైంది.

చిన్ననాటి మిత్రులు మధుసూదన్ అలియాస్ మాస్(సూర్య), జెట్టు(ప్రేమ్ జీ అమరెన్) ఇద్దరూ చిన్న చిన్న మోసాలు, దొంగతనాలు చేసుకుంటూ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంటారు. అలా సాఫిగా సాగుతున్న సమయంలో వీరికి ఓ సమస్య వచ్చిపడుతుంది. దాని నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించగా మాస్ కి యాక్సిడెంట్ అవుతుంది. దీంతో మాస్ ఓ రెండు క్షణాల్లో చచ్చి బ్రతుకుతాడు. హాస్పిటల్లో కోలుకున్న తర్వాత మాస్ కు ఆత్మలు కనిపించడం మొదలవుతాయి. ఆ ఆత్మలు తమ కోరికలను తీర్చమంటాయి. మాస్ ఇదే అదునుగా భావించి, హెల్ప్ చేయాలంటే తనకు హెల్ప్ చేయాలని చెప్పి, ఆ ఆత్మలను అడ్డం పెట్టుకొని డబ్బు సంపాదిస్తుంటాడు. ఇదే సమయంలో మాలిని(నయనతార)తో పరిచయం ఏర్పడటం, ప్రేమలో పడతాడు. మాస్ లైఫ్ లోకి అనుకోకుండా శివకుమార్(సూర్య) ఎంట్రీ ఇస్తాడు. మాస్ జీవితం పూర్తిగా మారిపోతుంది. తెలియకుండానే మాస్ పలు మర్డర్ కేసులు, రాబరీ కేసులలో ఇరుక్కుంటాడు. ఇక అక్కడి నుంచి ఏమయ్యింది? అసలు శివ ఎవరు? అసలు మాస్, శివలకు ఏంటి సంబంధం? శివ మనిషా లేక దెయ్యమా ? అనేదే మిగతా సినిమా కథ.[1]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]

స్పందనలు

[మార్చు]
  • "మాస్, శివకుమార్ గా రెండు భిన్నమైన పాత్రలను సూర్య బాగానే చేశాడు. కానీ కథానాయికలు నయనతార, ప్రణీతలకు సినిమాలో పెద్ద ప్రాధాన్యం లేకుండా పోయింది. మాస్ స్నేహితుడిగా నటించిన ప్రేమ్జీ అమరన్ తన రొటీన్ చేష్టలతో విసుగు తెప్పించాడు. అలానే బ్రహ్మానందానిదీ రొట్టకొట్టుడు కామెడీనే. విలన్ గా నటించిన దర్శకుడు సముద్రఖని, పోలీస్ అధికారిగా నటించిన మరో దర్శకుడు పార్తీబన్ అంతగా మెప్పించలేదు. యువన్ శంకర్ రాజా బాణీలు చెప్పుకోదగ్గవి కాదు. ఇలాంటి కథను సూర్య లాంటి హీరో చేయాల్సిన అవసరమే లేదు. ఏదో కొత్తగా చేయాలనే తపన తప్పితే, ఈ కథ ప్రేక్షకుల్ని ఏమేరకు మెప్పింస్తుందనే దానిపై సూర్య దృష్టి పెట్టినట్టు కనిపించదు. ఇక ప్రేక్షకులనైతే ఈ రాక్షసుడు బాగానే పొంసించాడని చెప్పాలి." అని ఫిల్మ్ జర్నలిస్ట్ వడ్డి ఓంప్రకాశ్ నారాయణ్ తన సమీక్షలో వ్యాఖ్యానించాడు.[2]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (30 May 2015). "'రాక్షసుడు' రివ్యూ". Archived from the original on 17 September 2021. Retrieved 17 September 2021.
  2. చంద్రం (8 June 2015). "ప్రేక్షకులను హింసించే రాక్షసుడు". జాగృతి వారపత్రిక: 50. Retrieved 22 February 2024.