Coordinates: 33°43′04.59″N 78°53′48.48″E / 33.7179417°N 78.8968000°E / 33.7179417; 78.8968000

పాంగోంగ్ సరస్సు

వికీపీడియా నుండి
(పాంగోంగ్ త్సో నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
పాంగోంగ్ త్సో
పాంగోంగ్ త్సో is located in Asia
పాంగోంగ్ త్సో
పాంగోంగ్ త్సో
పాంగోంగ్ త్సో is located in Ladakh
పాంగోంగ్ త్సో
పాంగోంగ్ త్సో
పాంగోంగ్ త్సో is located in Tibet
పాంగోంగ్ త్సో
పాంగోంగ్ త్సో
ప్రదేశంలడఖ్ లోని లేహ్ జిల్లా
టిబెట్
అక్షాంశ,రేఖాంశాలు33°43′04.59″N 78°53′48.48″E / 33.7179417°N 78.8968000°E / 33.7179417; 78.8968000
రకంసోడ్ సరస్సు
dimictic lake (east basin)[1]
cold monomictic lake (west basin)[ఆధారం చూపాలి]
ప్రవహించే దేశాలుభారతదేశం
గరిష్ట పొడవు134 km (83 mi)
గరిష్ట వెడల్పు5 km (3.1 mi)
ఉపరితల వైశాల్యంapprox. 700 km2 (270 sq mi)
గరిష్ట లోతు330 ft. (100 m)
ఉపరితల ఎత్తు4,225 metres (13,862 ft)[2]
ఘనీభవనంశీతాకాలంలో

పాంగోంగ్ త్సో లేదా పాంగోంగ్ సరస్సు తూర్పు లడఖ్ లోను, పశ్చిమ టిబెట్ లోనూ విస్తరించి ఉన్న భాష్పీభవన సరస్సు. త్సో అంటే టిబెటన్ భాషలో సరస్సు అని అర్థం. ఇది సముద్ర మట్టం నుండి 4,225 మీటర్ల ఎత్తున ఉన్న ఈ సరస్సు పొడవు 134 కిలోమీటర్లు. ఇది, పాంగోంగ్ త్సో, త్సో న్యాక్, రమ్ త్సో (జంట సరస్సులు), న్యాక్ త్సో అనే ఐదు ఉప సరస్సు‌లుగా విభజించబడి ఉంటుంది. మొత్తం సరస్సు పొడవులో సుమారు 50% టిబెట్ పరిధిలోను, 40% లడఖ్‌లోనూ ఉంది. మిగతాది భారత చైనాల మధ్య వివాదంలో ఉంది ఈ భాగం చైనా నియంత్రణలో ఉంది. ఈ సరస్సు అత్యధిక వెడల్పు 5 కిలోమీటర్లు. మొత్తమ్మీద దీని వైశాల్యం 604 చ.కి.మీ. ఉప్పునీటి సరస్సు అయినప్పటికీ శీతాకాలంలో ఇది పూర్తిగా గడ్డకడుతుంది. చిన్న శిఖరం దీన్ని సింధు నదీ పరీవాహక ప్రాంతం నుండి వేరు చేస్తుంది. దీని పరీవాహక ప్రాంతం భూ పరివేష్టితమై ఉంటుంది. చరిత్రపూర్వ కాలంలో ఇది సింధు నది పరీవాహక ప్రాంతంలో భాగంగా ఉండేదని భావిస్తున్నారు.[3]

రామ్‌సార్ కన్వెన్షన్ కింద ఈ సరస్సును అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన తడి నేలగా గుర్తించే పని జరుగుతోంది. అది పూర్తైతే, ఈ కన్వెన్షన్ కింద దక్షిణ ఆసియాలో సరిహద్దులకు ఇరువైపులా విస్తరించి ఉన్న తడి నేలలో ఇదే మొదటిది అవుతుంది.

పేర్లు[మార్చు]

చారిత్రికంగా, ఈ సరస్సు ఐదు ఉపసరస్సులుగా తయారైంది. సన్నటి అలుగులు (కాలువలు) వీటిని కలుపుతూంటాయి. పాంగోంగ్ త్సో అనే పేరు అత్యంత పశ్చిమాన ఉన్న సరస్సుకు మాత్రమే వర్తిస్తుంది. ఇది చాలావరకు లడఖ్‌లో విస్తరించి ఉంది. టిబెట్ వైపున ఉన్న ప్రధాన సరస్సును త్సో న్యాక్ ("మధ్య సరస్సు") అంటారు. దీని తరువాత రమ్ త్సో అనే రెండు చిన్న సరస్సులు ఉన్నాయి. రుటోగ్ సమీపంలో ఉన్న చివరి సరస్సును మళ్ళీ న్యాక్ త్సో అని పిలుస్తారు. [4] [5] మొత్తం ఈ సరస్సులన్నిటినీ కలిపి టిబెటన్ భాషలో సోమో న్గంగ్లా రింగ్పో అని అంటారు..

పాంగోంగ్ త్సో, సోమో న్గంగ్లా రింగ్పో రెండింటి అర్థాలపై భిన్నమైన వివరణలు ఉన్నాయి. లడఖ్ ప్రభుత్వ వెబ్‌సైట్‌లో "పాంగోంగ్ త్సో" అంటే టిబెట్ భాషలో "ఎత్తైన గడ్డి భూముల సరస్సు" అని అర్థమని చెబుతోంది. [6] అయితే దశాబ్దాల క్రితం నాటి యాత్రా కథనాల్లో పాంగోంగ్ అంటే "బోలు" అని రాసారు [7] [8] సోమో న్గంగ్లా రింగ్పో అనేది టిబెటన్ మాటకు వివిధ వర్గాలు వివిధ అర్థాలు చెబుతారు. ఇవన్నీ సారూప్యంగా ఉంటాయి. చైనా మీడియా "పొడవైన, సన్నటి, మంత్రించిన సరస్సు" అని అర్థం చెబుతుంది. [9] తొలి యూరోపియన్ అన్వేషకులు "ఆడ, సన్నటి, చాలా పొడవైన సరస్సు" అని, [10] ఇతర ఆధునిక వర్గాలు "పొడవైన మెడ గల హంస సరస్సు" అనీ అర్థం చెప్పాయి. [11] ఈ సరస్సును పాన్-కుంగ్ హు అని కూడా పిలుస్తారు.

వృక్ష, జంతుజాలాలు[మార్చు]

సరస్సు తూర్పు భాగంలో మంచినీరు ఉంటుంది. ఈ ప్రాంతంలో మొత్తం కరిగిన ఘనపదార్థాలు 0.68 గ్రా/లీ ఉంటాయి. సరస్సు పశ్చిమ భాగం ఉప్పునీటితో కూడుకుని ఉంటుంది. ఈ ప్రాంతంలో 11.02 గ్రా/లీ లవణీయత ఉంటుంది.[12] సరస్సు ఉప్పునీటిలో[13] చాలా తక్కువ సూక్ష్మ వృక్షజాలం ఉంటుంది. సరస్సుకు భారతీయ వైపున కొన్ని చిన్న క్రస్టేసియన్లు తప్ప, చేపలు గాని, ఇతర జలచరాలు గానీ లేవని గైడ్లు తమ నివేదికల్లో చెప్పారు. కానీ సరస్సు పైనా, ఉపరితలం మీదా అనేక బాతులు నీటికాకులూ సందర్శకులకు కనిపిస్తాయి. సరస్సు చుట్టూ చిత్తడి నేలలలో పెరిగే కొన్ని జాతుల పొదలు, మూలికలూ ఉన్నాయి.

ఈ సరస్సు అనేక వలస పక్షులతో సహా వివిధ రకాల పక్షులకు ముఖ్యమైన సంతానోత్పత్తి ప్రదేశంగా ఉపయోగపడుతుంది. వేసవిలో బార్-హెడ్ గూస్, బ్రాహ్మిణి బాతులూ ఇక్కడ కనిపిస్తూంటాయి. [14] సరస్సు చుట్టూ ఉన్న ప్రాంతంలో కియాంగ్, మార్మోట్లతో సహా అనేక జాతుల వన్యప్రాణులు కనిపిస్తాయి. సరస్సులో చేపలు, ముఖ్యంగా షిజోపైగోప్సిస్ స్టోలిస్కాయ్[15] రకోమా లబియాటా [16] రకం చేపలు, పెద్ద సంఖ్యలో ఉంటాయి.

పూర్వం, పాంగోంగ్ త్సో సింధు నదికి ఉపనది అయిన ష్యోక్ నది లోకి ఒక అలుగు ఉండేది. కాని ఇది ప్రకృతి సహజంగా ఏర్పడిన ఆనకట్ట కారణంగా మూసుకుపోయింది. భారతీయ వైపు నుండి రెండు ప్రవాహాలు సరస్సు లోకి నీళ్ళు తీసుకువస్తాయి. వీటి వలన సరస్సు అంచుల వద్ద చిత్తడి నేలలు, మాగాణి నేలలూ ఏర్పడుతాయి.[17] సరస్సు ప్రస్తుత మట్టానికి పైన కట్టపై కనిపించే చారలను బట్టి చూస్తే 5 మీటర్ల మందాన బురద, ఇసుకల పొర కనిపిస్తుంది. దీన్నిబట్టి సరస్సు మట్టం ఒకప్పటి స్థాయి నుండి ప్రస్తుత స్థాయికి చేరిందని తెలుస్తుంది. [13] భారత వైపున, చేపలేమీ కనబడలేదు గానీ, ఆగ్నేయం వైపు నుండి వచ్చే వాగులో (చుషూల్ నాలా) మాత్రం మూడు చేపల జాతులు (షిజోపైగోప్సిస్ స్టోలిస్కాయ్, టిబెటన్ స్టోన్ లోచ్, ట్రిప్లోఫైసా గ్రాసైలిస్) ఉన్నట్లు తెలుస్తోంది (భట్ తది., 2011 ). ఇక్కడి తక్కువ జీవవైవిధ్యానికి కారణం అధిక లవణీయత, కఠినమైన పర్యావరణ పరిస్థితులని నివేదికలున్నాయి (భట్ తది., 2011).

పాంగోంగ్ సరస్సులో బర్డ్ ఐలెట్ అనేది అత్యంత ప్రసిద్ధమైన ద్వీపం. [18]

శీతోష్ణస్థితి[మార్చు]

శీతోష్ణస్థితి డేటా - Pangong Tso
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
సగటు అధిక °C (°F) −5.9
(21.4)
−3.7
(25.3)
0.9
(33.6)
6.9
(44.4)
11.6
(52.9)
17.4
(63.3)
20.5
(68.9)
19.7
(67.5)
15.5
(59.9)
7.9
(46.2)
1.5
(34.7)
−3.3
(26.1)
7.4
(45.4)
రోజువారీ సగటు °C (°F) −13.3
(8.1)
−10.8
(12.6)
−6.0
(21.2)
−0.5
(31.1)
3.8
(38.8)
9.5
(49.1)
13.1
(55.6)
12.7
(54.9)
7.8
(46.0)
−0.3
(31.5)
−6.8
(19.8)
−11.3
(11.7)
−0.2
(31.7)
సగటు అల్ప °C (°F) −20.6
(−5.1)
−17.9
(−0.2)
−12.8
(9.0)
−7.8
(18.0)
−3.9
(25.0)
1.6
(34.9)
5.8
(42.4)
5.7
(42.3)
0.2
(32.4)
−8.5
(16.7)
−15.1
(4.8)
−19.3
(−2.7)
−7.7
(18.1)
సగటు అవపాతం mm (inches) 4
(0.2)
2
(0.1)
3
(0.1)
3
(0.1)
4
(0.2)
2
(0.1)
11
(0.4)
15
(0.6)
4
(0.2)
2
(0.1)
2
(0.1)
3
(0.1)
55
(2.3)
Source: Climate-Data.org

చేరుకోవడం[మార్చు]

ఘనీభవించిన పాంగోంగ్ సరస్సు

భారత చైనా వాస్తవాధీన రేఖపై ఉన్నందున ఈ సరస్సును సందర్శించడానికి భారతదేశపు ఇన్నర్ లైన్ పర్మిట్ అవసరం. భారతీయులు వ్యక్తిగత అనుమతులు పొందగలిగినప్పటికీ, ఇతరులు మాత్రం తప్పనిసరిగా గ్రూప్ పర్మిట్లనే పొందాలి (కనీసం ముగ్గురున్న గుంపు). వీళ్ళ వెంట గుర్తింపు పొందిన గైడ్లు ఉండాలి. లేహ్ లోని పర్యాటక కార్యాలయం చిన్న రుసుము తీసుకుని ఈ అనుమతులను జారీ చేస్తుంది. భద్రతా కారణాల దృష్ట్యా, భారతదేశం సరస్సులో బోటింగును అనుమతించదు.

చైనా జాతీయ రహదారి 219, పాంగోంగ్ సరస్సు తూర్పు కొన గుండా వెళుతుంది. రుటోగ్ నుండి 12 కి.మీ., షిక్వాన్‌హె నుండి 130 కి.మీ. ప్రయాణం చేసి సరస్సును చేరుకోవచ్చు. పర్యాటకులు సరస్సుపై పడవను అద్దెకు తీసుకోవచ్చు. కాని పక్షుల స్థావరమైన దీవులను రక్షించుకునేందుకు గాను ఆ ద్వీపాలలో దిగడానికి అనుమతి లేదు. సరస్సు ఒడ్డున అనేక రెస్టారెంట్లు ఉన్నాయి. [19]

పాంగోంగ్ సరస్సు వివాదాస్పద భూభాగంలో ఉంది. వాస్తవాధీన రేఖ ఈ సరస్సు గుండానే వెళుతుంది. రేఖకు తూర్పున 20 కి.మీ.వరకు విస్తరించి ఉన్న సరస్సు భాగాన్ని చైనా నియంత్రిస్తుంది. కాని ఈ భాగం తనదని భారతదేశం వాదన. సరస్సు తూర్పు కొన టిబెట్‌లో ఉంది. 19 వ శతాబ్దం మధ్యకాలం తరువాత, పాంగోంగ్ త్సో జాన్సన్ రేఖ దక్షిణ కొన వద్ద ఉండేది. ఇది అక్సాయ్ చిన్ ప్రాంతంలో భారత చైనాల మధ్య సరిహద్దును నిర్వచించే తొలి ప్రయత్నాల్లో ఒకటి.

ఖుర్నాక్ కోట, పాంగోంగ్ త్సో ఉత్తర తీరాన సగం దూరంలో ఉంది. [20] 1952 నుండి చైనీయులు ఖుర్నాక్ కోట ప్రాంతాన్ని నియంత్రణలో ఉంచుకున్నారు. [21] [22] దక్షిణాన స్పంగ్గూర్ త్సో అనే చిన్న సరస్సు ఉంది.

1962 భారత చైనా యుద్ధంలో, అక్టోబరు 20 న పాంగోంగ్ త్సో వద్ద సైనిక చర్య జరిగింది. [23]

పాంగోంగ్ త్సో ఇప్పటికీ వాస్తవాధీన రేఖ వెంట సున్నితమైన సరిహద్దు. [24] [25] ఇక్కడ, చైనా చొరబాట్లు జరపడం సర్వసాధారణం [26]

2017 ఆగస్టులో, పాంగోంగ్ త్సో సమీపంలో భారత, చైనా దళాలు పరస్పరం రాళ్ళు విసురుకున్నాయి.. [27] [28] [29]

2019 సెప్టెంబరు 11 న, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ దళాలు పాంగోంగ్ సరస్సు ఉత్తర ఒడ్డున భారత దళాలను ఎదుర్కొన్నాయి. [30] [31]

2020 మే 5-6 న, పాంగోంగ్ త్సో సరస్సు సమీపంలో సుమారు 250 మంది భారతీయ, చైనా దళాల మధ్య ముఖాముఖి జరిగింది. [32] [28] [33] [34] నలుగురు భారత సైనికులు, ఏడుగురు చైనా సైనికులూ గాయపడ్డారు. [35]

చిత్ర మాలిక[మార్చు]

పాంగోంగ్ త్సో

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Wang, M., Hou, J. and Lei, Y., 2014. Classification of Tibetan lakes based on variations in seasonal lake water temperature. Chinese Science Bulletin, 59(34): 4847-4855.
  2. Dortch et al., Catastrophic partial drainage of Pangong Tso (2011), p. 111.
  3. "River basins with Major and medium dams & barrages location map in India, WRIS". Archived from the original on 4 March 2016.
  4. Sven Anders Hedin (1907). Scientific Results of a Journey in Central Asia 1899-1902: Central and West Tibet. Lithographic institute of the General staff of the Swedish army. p. 521. From Noh to Bal Rawling followed the same route that I did along the northern shore of the Tso-ngombo, which he calls the Tso Mo Gualari, dividing it into the sections: Tso Nyak, the twin lakes Rum Tso and Nyak Tso. He says that it consists of a string of five lakes 120 m. in length, the four most southern of which are fresh, and Pangong, the most northerly, salt. They are joined together by channels about 60 feet in width and 15 feet deep, the current running at nearly 1½ mile an hour.
  5. Saward, M. H. (1878). Routes in Asia: Routes in the territories of the Maharaja of Jummoo and Kashmir, and adjacent countries. Office of the Superintendent of Government Printing. pp. 31–33. Only the lower lake (the Pangong Tso proper) lies in Ladak, the middle (Tso Nyak) and upper lakes being in Rudok territory. ... The waters of the western end are much more salt than those of the eastern end near Ot. in the stream connecting the Pangong Tso with Nyak Tso the water becomes drinkable, and rich grass is found on the banks.
  6. "Pangong Lake". Union Territory of Ladakh. 2019-10-29. Retrieved 9 January 2020. Pangong Lake, one of the most famous lakes in Leh Ladakh, derives its name from the Tibetan word, "Pangong Tso", which means "high grassland lake".
  7. Michelle Coxall; Paul Greenway (1 September 1996). Indian Himalaya: a Lonely Planet travel survival kit. Lonely Planet. ISBN 978-0-86442-413-6. The salty Pangong Tso - Pangong means 'hollow' - is the highest lake in Ladakh at about 4300m, and is flanked by massive peaks over 6500m high.
  8. Kirit Rindani (7 January 2016). Indian Himalaya: Story of a 100 Visits. Partridge Publishing India. p. 80. ISBN 978-1-4828-5886-0. The word Pangong means 'extensive concavity' which probably explains its size.
  9. "Pangong Tso Lake in Tibet". China Daily. 2012-07-17. Retrieved 9 January 2020. Pangong Tso Lake is a trans-border lake extending from the Ali prefecture of China's Tibet autonomous region to India. About 155 kilometers in length, the geographic features of the lake are indicated in the name which in Tibetan means "long, narrow, enchanted lake".
  10. Trotter, H. (1877). "Account of the Pundit's Journey in Great Tibet from Leh in Ladakh to Lhasa, and of His Return to India Via Assam". Journal of the Royal Geographical Society of London. 47: 86. doi:10.2307/1798740. ISSN 0266-6235. JSTOR 1798740. the Pangong, but better known to the Tibetans as the Chomo Gna Laring Cho, which, being literally interpreted, means "Female narrow very long lake."
  11. "Pangong Tso Lake in the Northern Tibet". Kangba TV. 2017-03-06. Pangong Tso Lake, at an altitude of 4,200 meters, is also called Tsomo Nganglha Ringpo Lake, which means "a swan with a long neck" in Tibetan.[permanent dead link]
  12. "班公错" (in Chinese).{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  13. 13.0 13.1 R. K. Pant; N. R. Phadtare; L. S. Chamyal; Navin Juyal (June 2005). "Quaternary deposits in Ladakh and Karakoram Himalaya: A treasure trove of the palaeoclimate records". Retrieved 29 January 2019. {{cite journal}}: Cite journal requires |journal= (help)
  14. Khan, Asif (2016). "Ladakh: The Land Beyond". Buceros. 21 (3): 6–15.
  15. "Schizopygopsis stoliczkae". China Animal Scientific Database. Archived from the original on 5 March 2016. Retrieved 22 September 2018.
  16. "Racoma labiata". China Animal Scientific Database. Archived from the original on 5 March 2016. Retrieved 22 September 2018.
  17. Biksham Gujja; Archana Chatterjee; Parikshit Gautam; Pankaj Chandan (August 2003). "Wetlands and Lakes at the Top of the World". Mountain Research and Development. Bern, Switzerland: International Mountain Society. 23 (3): 219–221. doi:10.1659/0276-4741(2003)023[0219:WALATT]2.0.CO;2. ISSN 1994-7151.
  18. Dreams of Snow Land. Beijing: Foreign Languages Press. 2005. pp. 273-275. ISBN 7-119-03883-4 – via Internet Archive.
  19. 黄慧英 (4 August 2018). "一措再措 邂逅高原湖泊的绝美" (in Chinese). tibet.cn. Retrieved 22 September 2018.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
  20. Negi, S.S. (1 April 2002). Himalayan Rivers, Lakes and Glaciers. India: Indus Publishing Company. p. 152. ISBN 978-8185182612. Retrieved 2009-09-12.
  21. Guruswamy, Mohan (January 2006). Emerging Trends in India-China Relations. India: Hope India Publications. p. 223. ISBN 9788178711010. Retrieved 2009-09-12.
  22. Mohan Guruswamy. "No longer a Great Game". Centre for Policy Alternatives, India. Archived from the original on 16 October 2007.
  23. Burkitt, Laurie; Scobell, Andrew; Wortzel, Larry M. (July 2003). The Lessons of History: The Chinese People's Liberation Army at 75 (PDF). Strategic Studies Institute. pp. 340–341. ISBN 1-58487-126-1. Archived from the original (PDF) on 2012-02-05. Retrieved 2020-10-29.
  24. Manu Pubby. "Pangong Lake is border flashpoint between India and China". The Indian Express. Retrieved 2009-06-24.
  25. Sultan Shahin. "Vajpayee claps with one hand on border dispute". Archived from the original on 2012-04-19. Retrieved 2009-06-24.
  26. Jonathan Holslag (2008). "China, India and the Military Security Dilemma, Vol 3(5)" (PDF). Brussels Institute of Contemporary China Studies (BICCS). Archived from the original (PDF) on 6 June 2011. Retrieved 2009-06-24. {{cite journal}}: Cite journal requires |journal= (help)
  27. 中共與印度邊境衝突!150士兵互毆10多人掛彩. New Tang Dynasty Television (in సాంప్రదాయక చైనీస్). 11 May 2020. Retrieved 16 May 2020.
  28. 28.0 28.1 費風 (11 May 2020). 中印邊境再爆衝突 150士兵毆鬥釀12傷. Hong Kong Economic Times (in సాంప్రదాయక చైనీస్). Retrieved 16 May 2020. 消息指,第一起事件發生於5月5日至6日,在中印邊境的班公錯湖(Pangong Tso )地區,當時解放軍的「侵略性巡邏」(aggressive patrolling)被印度軍方阻攔。「結果發生了混亂,雙方都有一些士兵受傷。」{...}2017年8月,兩國軍隊曾於拉達克地區班公湖附近爆發衝突,當時雙方擲石攻擊對方,雙方均有人受傷,最終兩軍在半小時後退回各自據點。
  29. Sushant Singh (20 May 2020). "India-China conflict in Ladakh: The importance of the Pangong Tso lake". The Indian Express. Retrieved 21 May 2020.
  30. "Indian, Chinese Troops Face-off in Ladakh Ahead of Modi-Xi Summit, Army Says Tension De-escalated". CNN-News18. 12 September 2019. Retrieved 12 May 2020.
  31. Chang Ya-Han 張雅涵, ed. (10 March 2020). 中國在西藏地區軍演頻繁 牽動中印未來危機應對. Radio Taiwan International (in Chinese (Taiwan)). Retrieved 16 May 2020.
  32. Dinakar Peri (10 May 2020). "Indian, Chinese troops face off in Eastern Ladakh, Sikkim". The Hindu. Retrieved 13 May 2020.
  33. "Chinese military bolsters troops in Aksai Chin region in Sino-India border: Report". The Economic Times. 19 May 2020. Retrieved 19 May 2020. On May 5, around 250 Indian and Chinese army personnel clashed in Pangong Tso lake area in Eastern Ladakh.
  34. "Chinese, Indian troops engage in border conflicts". Taiwan News. 25 May 2020. Retrieved 26 May 2020.
  35. 'All-out combat' feared as India, China engage in border standoff