అక్షాంశ రేఖాంశాలు: 33°50′36″N 73°51′05″E / 33.84333°N 73.85139°E / 33.84333; 73.85139

పాక్-ఆక్రమిత కాశ్మీరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పాక్ ఆక్రమిత కాశ్మీర్
పాకిస్తాన్ పాలనలో ఉన్న స్వయం పాలక ప్రాంతం
పైన:అరంగ కేల్
కింద: వివాదాస్పద కాశ్మీరు భూభాగం. ఆకుపచ్చ షేడింగు చేసిన ప్రాంతం -పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న రెండు భాగాలు [1]
Map of the disputed Kashmir region showing areas of control by India, Pakistan, and China
పటం
Interactive map of Azad Kashmir
Coordinates: 33°50′36″N 73°51′05″E / 33.84333°N 73.85139°E / 33.84333; 73.85139
పాలనపాకిస్తాన్
స్థాపన1947 అక్టోబరు 24
రాజధానిముజఫరాబాద్
అతిపెద్ద నగరంముజఫరాబాద్
Government
 • TypeSelf-governing state under Pakistani administration[2][3]
విస్తీర్ణం
 • Total13,297 కి.మీ2 (5,134 చ. మై)
జనాభా
 (2017)
 • Total40,45,366
 • జనసాంద్రత300/కి.మీ2 (790/చ. మై.)
Time zoneUTC+05:00 (PKT)
ISO 3166 codePK-AJK
ప్రధాన భాషలు
  • ఉర్దూ (అధికారిక)
  • పహరీ పొత్వాడీ (మెజారిటీ మాట్లాడే భాష)
  • ఇతర పంజాబు మాండలికాలు:
    హింద్‌కో, పంజాబీ
  • ఇతర భాషలు: గొజ్రి, పష్తో
అక్షరాస్యత (2017)74%[4]
HDI (2019)0.612 Increase[5]
Medium
డివిజన్లు3
జిల్లాలు10
తహసీళ్ళు33

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీరు (పీవోకే) అనేది పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న కాశ్మీరు భూభాగం. పేరుకే స్వయం పరిపాలనా ప్రాంతంగా ఉన్న ఈ ప్రాంతాన్ని పాకిస్తాన్ పరిపాలిస్తుంది.[6]1947 నుండి భారతదేశం, పాకిస్తాన్ల మధ్య వివాదాస్పదంగా ఉంది.[1] పాకిస్తాన్ ఈ ప్రాంతాన్ని ఆజాద్ కాశ్మీర్ అంటుంది. దీనికి సరిహద్దులుగా ఉత్తరాన గిల్గిట్ బల్టిస్తాన్ (గిల్గిట్ బల్టిస్తాన్ ఆజాద్ కాశ్మీర్‌లో భాగం కాదు), దక్షిణాన పాకిస్తాన్ పంజాబ్, పశ్చిమాన ఖైబర్ పఖ్తూన్‌క్వాలు ఉన్నాయి. తూర్పు వైపున, జమ్మూ కాశ్మీర్ ఉంది. ఈ రెంటి మధ్య నియంత్రణ రేఖ (LoC) ఉంది. ఇది భారత, పాకిస్తాన్ల మధ్య వాస్తవ సరిహద్దుగా పనిచేస్తుంది. భౌగోళికంగా, ఈ భూభాగం మొత్తం వైశాల్యం 13,297 కి.మీ2 (5,134 చ. మై.). ముజఫరాబాద్ నగరం దాని రాజధాని. 2017 జాతీయ జనాభా లెక్కల ప్రకారం మొత్తం జనాభా 40,45,366 .

పీవోకేలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఉంది. ముజఫరాబాద్ నగరం దాని రాజధాని. అధ్యక్షుడు రాజ్యాంగ బద్ధమైన దేశాధినేత కాగా, ప్రధాన మంత్రి, మంత్రుల మండలి మద్దతుతో, కార్యనిర్వాహకత్వం వహిస్తాడు. ఏకసభ లెజిస్లేటివ్ అసెంబ్లీ ప్రధానమంత్రి, రాష్ట్రపతి ఇద్దరినీ ఎన్నుకుంటుంది. ఈ భూభాగానికి దాని స్వంత సుప్రీంకోర్టు, హైకోర్టు ఉన్నాయి. అయితే పాకిస్తాన్ ప్రభుత్వ కాశ్మీర్ గిల్గిత్-బాల్టిస్తాన్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, పాకిస్తాన్‌ ప్రభుత్వానికి, పీవోకే ప్రభుత్వానికీ మధ్య లింకుగా పనిచేస్తాయి, అయితే దీనికి పాకిస్తాన్ పార్లమెంటులో ప్రాతినిధ్యం లేదు.

పీవోకే లోని ఉత్తర భాగం బలమైన భూ ప్రకంపనలు కలిగే ప్రాంతంలో ఉంది. 2005లో సంభవించిన భారీ భూకంపం వల్ల కనీసం లక్ష మంది మరణించారు. మరో 30 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు, దీని వలన ఈ ప్రాంతపు మౌలిక సదుపాయాలు, ఆర్థిక వ్యవస్థ విధ్వంసమయ్యాయి. అప్పటి నుండి, పాకిస్తాన్ ప్రభుత్వ సహాయం, విదేశీ సహాయాలతో మౌలిక సదుపాయాల పునర్నిర్మాణం జరుగుతోంది. పీవోకే ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా వ్యవసాయం, సేవలు, పర్యాటకం, బ్రిటన్ లోని బ్రిటిష్ మీర్పురీ ప్రజలు పంపే చెల్లింపులపై ఆధారపడి ఉంటుంది. దాదాపు 87% పీవోకే కుటుంబాలకు వ్యవసాయ భూములు ఉన్నాయి.[7] ఈ ప్రాంతంలో పాకిస్తాన్‌లోనే అత్యధికంగా పాఠశాల నమోదు రేటు ఉంది. అక్షరాస్యత రేటు దాదాపు 74%.[8]

చరిత్ర

[మార్చు]
1946 నాటి జమ్మూ, కాశ్మీర్ సంస్థానం మ్యాప్; ప్రస్తుత పీవోకేలో మూడు పశ్చిమ జిల్లాల ప్రాంతాలు భాగంగా ఉన్నాయి

1947లో భారతదేశ విభజన సమయంలో, బ్రిటిషు వారు పోతూ పోతూ, సంస్థానాలు భారత పాకిస్తాన్‌లలో ఏదో ఒకదానిలో చేరడమా లేదా స్వతంత్రంగా ఉండడమా అనే నిర్ణయాన్ని సంస్థానాలకే విడిచిపెట్టి వెళ్ళిపోయారు. జమ్మూ కాశ్మీర్ మహారాజా హరి సింగ్ తన సంస్థానం స్వతంత్రంగా ఉండాలని కోరుకున్నాడు.[9] జమ్మూ ప్రావిన్స్ లోని పశ్చిమ జిల్లాల్లో ఉన్న ముస్లిములు, ఫ్రాంటియర్ డిస్ట్రిక్ట్ ప్రావిన్స్ (ప్రస్తుత గిల్గిత్-బాల్టిస్తాన్) లోని పశ్చిమ జిల్లాల్లో ముస్లింలూ పాకిస్థాన్‌లో చేరాలని కోరుకున్నారు.[10]

1947 వసంతకాలంలో, పశ్చిమ పంజాబ్‌లోని రావల్పిండి డివిజన్ సరిహద్దులో ఉన్న పూంచ్‌లో మహారాజుకు వ్యతిరేకంగా తిరుగుబాటు జరిగింది. మహారాజా ప్రభుత్వం రైతులపై శిక్షాత్మక పన్నులు విధించడం ప్రారంభించిందని, ఇది స్థానికంగా తిరుగుబాటును రేకెత్తించిందనీ, ప్రభుత్వం దాన్ని క్రూరమైన అణచివేసిందనీ చెబుతారు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత తిరిగివచ్చిన సైనికుల వలన పెరిగిన జనాభా, మహారాజా దళాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి దాదాపు మొత్తం జిల్లాపై నియంత్రణ సాధించారు. ఈ విజయం తరువాత, ముజఫరాబాద్, పూంచ్, మీర్పూర్ పశ్చిమ జిల్లాలకు చెందిన పాకిస్తాన్ అనుకూల స్థానిక అధిపతులు 1947 అక్టోబరు 3 న రావల్పిండిలో తాత్కాలిక ఆజాద్ జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వాన్ని ప్రకటించారు [11] గులాం నబీ గిల్కర్, "మిస్టర్ అన్వర్" పేరుతో, ముజఫరాబాద్‌లో తాత్కాలిక ప్రభుత్వం పేరుతో ఒక ప్రకటనను విడుదల చేశాడు. అయితే, శ్రీనగర్‌లో అన్వర్‌ను అరెస్టు చేయడంతో ఈ ప్రభుత్వం త్వరగానే తేలిపోయింది. [12] అక్టోబరు 24న, సర్దార్ ఇబ్రహీం ఖాన్ నాయకత్వంలో పాలంద్రిలో రెండవ తాత్కాలిక పీవోకే ప్రభుత్వం ఏర్పడింది. [13]

అక్టోబరు 21న, మహారాజా పాలనకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటుకు సహాయం చేయడానికి వాయవ్య ఫ్రాంటియర్ ప్రావిన్స్ నుండి అనేక వేల మంది పష్టూన్ గిరిజనులు జమ్మూ కాశ్మీరు లోకి ప్రవేశించారు. వారికి అనుభవజ్ఞులైన సైనిక నాయకులు నాయకత్వం వహించారు. వారికి ఆధునిక ఆయుధాలు అందించారు. మహారాజు దళాలు వారి దాడిని తట్టుకోలేకపోయాయి. గిరిజనులు ముజఫరాబాద్, బారాముల్లా పట్టణాలను స్వాధీనం చేసుకున్నారు, వీటిలో రెండోది రాష్ట్ర రాజధాని శ్రీనగర్‌కు వాయవ్యంగా 32 కి.మీ. దూరంలో ఉంది. అక్టోబరు 24న, మహారాజా భారతదేశ సైనిక సహాయాన్ని అభ్యర్థించాడు, అతను భారతదేశంలో చేరితే తప్ప సహాయం చేయలేమని భారత ప్రభుత్వం ప్రతిస్పందించింది. దీని ప్రకారం, 1947 అక్టోబరు 26 న మహారాజా హరి సింగ్ సైన్య సహాయానికి బదులుగా రక్షణ, విదేశీ వ్యవహారాలు, కమ్యూనికేషన్ల నియంత్రణను భారత ప్రభుత్వానికి అప్పగిస్తూ ఒక విలీన అంగీకార పత్రంపై సంతకం చేశాడు.[14] వెంటనే భారత సైన్యాన్ని శ్రీనగర్‌లోకి తరలించారు. [15] ఆ తర్వాత పాకిస్థాన్ జోక్యం చేసుకుంది. ఇప్పుడు " నియంత్రణ రేఖ " అని పిలవబడే దాని చుట్టూ భారత పాకిస్తాన్ సైన్యాల మధ్య పోరాటం జరిగింది.[16]

భారతదేశం తరువాత ఐక్యరాజ్యసమితిని సంప్రదించి, వివాదాన్ని పరిష్కరించాలని కోరింది. కాశ్మీర్ భవిష్యత్తుకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణకు అనుకూలంగా తీర్మానాలు ఆమోదించబడ్డాయి. అయితే, అటువంటి ప్రజాభిప్రాయ సేకరణ ఇరువైపులా జరగలేదు. ఎందుకంటే ప్రభుత్వేతర శక్తులతో పాటు పాకిస్తాన్ సైన్యం ఈ ప్రాంతం నుండి పూర్తిగా ఉపసంహరించుకోవాలి, భారత సైన్యం [17] పాక్షికంగా ఉపసంహరించుకోవాలి అనే ముందస్తు షరతులు జరగనే లేదు.[18] 1949లో, కాశ్మీర్‌లోని భారత్-పాకిస్థానీ-నియంత్రిత భాగాలను వేరుచేసే అధికారిక కాల్పుల విరమణ రేఖ అమలులోకి వచ్చింది.

భారతదేశంతో 1949 కాల్పుల విరమణ ఒప్పందాన్ని అనుసరించి, పాకిస్తాన్ ప్రభుత్వం కాల్పుల విరమణ సమయానికి తమ నియంత్రణలో ఉన్న కాశ్మీర్ ఉత్తర, పశ్చిమ భాగాలను క్రింది రెండు వేర్వేరు రాజకీయ సంస్థలుగా విభజించింది:

  • ఆజాద్ జమ్మూ కాశ్మీర్- సన్నని, దక్షిణ భాగం, 400 కి.మీ. (250 మై.) పొడవు, వెడల్పు 15 నుండి 65 కి.మీ. (10 నుండి 40 మై.) ఉంటుంది. దీన్నే పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంటారు.
  • గిల్గిట్-బాల్టిస్తాన్ (గతంలో దీన్ని ఫెడరల్లీ అడ్మినిస్టర్డ్ నార్తర్న్ ఏరియాస్ (FANA) అని పిలిచేవారు) - 72,496 కి.మీ2 (27,991 చ. మై.) విస్తీర్ణంతో పీవోకేకి ఉత్తరాన ఉన్న చాలా పెద్ద ప్రాంతం.
పీవోకే జిల్లాలు

పరిపాలనా విభాగాలు

[మార్చు]

పరిపాలనాపరంగా రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా, వాటిని పది జిల్లాలుగా విభజించారు.[19]

విభజన జిల్లా విస్తీర్ణం (కిమీ 2 ) జనాభా (2017 జనాభా లెక్కలు) ప్రధాన కార్యాలయం
మీర్పూర్ మీర్పూర్ 1,010 4,56,200 కొత్త మీర్పూర్ సిటీ
కోట్లి 1,862 7,74,194 కోట్లి
భింబర్ 1,516 4,20,624 భింబర్
ముజఫరాబాద్ ముజఫరాబాద్ 1,642 6,50,370 ముజఫరాబాద్
హట్టియన్ 854 2,30,529 హట్టియన్ బాలా
నీలం లోయ 3,621 1,91,251 అత్ముకం
పూంచ్ పూంచ్ 855 5,00,571 రావలకోట్
హవేలీ 600 1,52,124 ఫార్వర్డ్ కహూటా
బాగ్ 768 3,71,919 బాగ్
సుధానోతి 569 2,97,584 పాలంద్రి
మొత్తం 10 జిల్లాలు 13,297 40,45,366 ముజఫరాబాద్

జనాభా వివరాలు

[మార్చు]

జనాభా

[మార్చు]

2017 జనాభా లెక్కల ప్రాథమిక ఫలితాల ప్రకారం పీవోకే జనాభా 40.45 లక్షలు.[20] ప్రభుత్వ వెబ్‌సైటు ప్రకారం అక్షరాస్యత రేటు 74%. ప్రాథమిక పాఠశాలలో నమోదు రేటు బాలురు 98%, బాలికలు 90%.[21]

పీవోకే జనాభా దాదాపు పూర్తిగా ముస్లింలే. ఈ ప్రాంత ప్రజలు జమ్మూ, కాశ్మీర్‌లోని కాశ్మీర్ లోయలో నివసిస్తున్న కాశ్మీరీల కంటే సాంస్కృతికంగా భిన్నంగా ఉంటారు, జమ్మూ సంస్కృతికి దగ్గరగా ఉంటారు. మీర్పూర్, కోట్లి, భీంబర్ జమ్మూ ప్రాంతంలోని పాత పట్టణాలు.[22]

పీవోకేలో జనాభా దాదాపు పూర్తిగా ముస్లింలే. క్రైస్తవ సంస్థల డేటా ప్రకారం, ఈ ప్రాంతంలో దాదాపు 4,500 మంది క్రైస్తవులు ఉన్నారు. భీంబర్‌లో ఎక్కువ మంది నివసిస్తున్నారు, తర్వాత మీర్పూర్, ముజఫరాబాద్ ఉన్నాయి. కోట్లి, పూంచ్, బాగ్‌లలో కూడా కొన్ని డజన్ల కుటుంబాలు నివసిస్తున్నాయి. అయితే, నివాస హోదా, ఆస్తి హక్కులను పొందడానికి క్రైస్తవ సంఘం పోరాడుతోంది.

ఇక్కడి బహాయిల సంఖ్యపై అధికారిక సమాచారం లేదు. కేవలం ఆరు బహాయి కుటుంబాలు మాత్రమే ముజఫరాబాద్‌లో నివసిస్తున్నాయని, మరికొందరు గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారని తెలిసింది.

అహ్మదీయులు 20,000, 25,000 మధ్య ఉన్నారని అంచనా వేసారు. వారిలో ఎక్కువ మంది కోట్లి, మీర్పూర్, భీంబర్, ముజఫరాబాద్‌లలో నివసిస్తున్నారు.[23]

ఇవి కూడా చూడండి

[మార్చు]

గమనికలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 The application of the term "administered" to the various regions of Kashmir and a mention of the Kashmir dispute is supported by the tertiary sources (a) through (e), reflecting due weight in the coverage. Although "controlled" and "held" are also applied neutrally to the names of the disputants or to the regions administered by them, as evidenced in sources (h) through (i) below, "held" is also considered politicized usage, as is the term "occupied" (see (j) below).
  2. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; brit అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  3. "Kashmir profile". BBC News. November 26, 2014. Archived from the original on July 16, 2015. Retrieved July 24, 2015.
  4. Tahir, Pervez. "Education spending in AJK". The Express Tribune. Archived from the original on March 20, 2022. Retrieved December 8, 2022.
  5. "Sub-national HDI - Area Database - Global Data Lab". hdi.globaldatalab.org. Archived from the original on September 23, 2018. Retrieved March 15, 2020.
  6. See:
  7. "Underdevelopment in AJK". The News International. Archived from the original on September 16, 2016. Retrieved June 18, 2016.
  8. "Education emergency: AJK leading in enrolment, lagging in quality". The Express Tribune. March 26, 2013. Archived from the original on August 7, 2016. Retrieved June 18, 2016.
  9. "The J&K conflict: A Chronological Introduction". India Together. Archived from the original on April 4, 2014. Retrieved June 5, 2010.
  10. Snedden 2013, p. 14: "Similarly, Muslims in Western Jammu Province, particularly in Poonch, many of whom had martial capabilities, and Muslims in the Frontier Districts Province strongly wanted J&K to join Pakistan.".
  11. Bose 2003, pp. 32–33.
  12. Snedden 2013, p. 59.
  13. Snedden 2013, p. 61.
  14. "Kashmir: Why India and Pakistan fight over it". BBC News. November 23, 2016. Archived from the original on December 24, 2018. Retrieved June 21, 2018.
  15. Bose 2003, pp. 35–36.
  16. Prem Shankar Jha. "Grasping the Nettle". South Asian Journal. Archived from the original on May 16, 2010.
  17. "UN resolution 47". Archived from the original on September 3, 2015. Retrieved September 11, 2012.
  18. "UNCIP Resolution of August 13, 1948 (S/1100) – Embassy of India, Washington, D.C." Archived from the original on October 13, 2007.
  19. "Administrative Setup". ajk.gov.pk. Archived from the original on April 9, 2010. Retrieved May 17, 2010.
  20. "Census 2017: AJK population rises to over 4m". The Nation. August 26, 2017. Archived from the original on June 12, 2018. Retrieved June 10, 2018.
  21. "AJ&K at a Glance". Archived from the original on June 12, 2018. Retrieved June 10, 2018.
  22. With Friends Like These... (Report). Vol. 18. Human Rights Watch. September 2006. Archived from the original on December 2, 2013. Retrieved November 24, 2013.
  23. "The Plight of Minorities in 'Azad Kashmir'". Asianlite.com. January 14, 2019. Archived from the original on April 15, 2020. Retrieved April 6, 2020.