పాతూరి శ్రీరామశాస్త్రి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పాతూరి శ్రీరామశాస్త్రి ప్రముఖ రంగస్థల నటుడు, రచయిత, దర్శకుడు, పండితుడు.

జననం[మార్చు]

ఈయన 1915, సెప్టెంబర్ 28తెనాలిలో జన్మించాడు. కలకత్తా విశ్వవిద్యాలయంలో 1938-40 మధ్యకాలంలో యం.యస్.సి. చదివాడు.

రంగస్థల ప్రస్థానం[మార్చు]

శ్రీరామశాస్త్రికి చిన్నతనం నుండే కళలపై ఆసక్తి ఉండేది. తెనాలికి చెందిన పాతతరం నటుడైన పెద్ధిభొట్ల చలపతి గారి నటనను చూసి, ఆయనలాగా అనుకరించేవాడు.

అలా తన ఏడవ ఏటనే ప్రతాపరుద్రీయంలో పేరిగాని పాత్రను పోషించి, పలువురి ప్రశంసలను అందుకున్నాడు. పాఠశాల వయసులోనే తెలుగు, ఆంగ్ల నాటకాలలో నటించాడు.

నటనలో, లైటింగ్ లో, వాచికాభినయంలో ఆచార్యుడిగా పనిచేశాడు. తెలుగు, ఆంగ్ల నాటకనాటికలకు ప్రయోక్తగా బాధ్యతలను నిర్వహించడమేకాకుండా నాట్యరంగానికి సంబంధించిన వ్యాసాలు రాసి ప్రచురించాడు.

పోణంగి శ్రీరామ అప్పారావుతో కలిసి ఆంగ్ల భాషలో 'ఏ మోన్ గ్రాఫ్ ఆన్ భరతనాట్య శాస్త్ర' అనే గ్రంథాన్ని రచించాడు.

1963 నుండి 1975 వరకు రవీంద్రభారతికి సంచాలకులుగా పనిచేశారు.

నటించిన పాత్రలు[మార్చు]

మరణం[మార్చు]

ఈయన 1986, సెప్టెంబర్ 16న హైదరాబాద్లో మరణించాడు.

మూలాలు[మార్చు]

  • పాతూరి శ్రీరామశాస్త్రి, నూరేళ్ల తెనాలి రంగస్థలి, నేతి పరమేశ్వరశర్మ, పుట. 139.