పామిరెడ్డి వెంకట సుబ్బారావురెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శ్రీ పామిరెడ్డి వెంకట సుబ్బారావు రెడ్డి గారు, డోకిపర్రు గ్రామంలో జన్మించారు. వీరి తండ్రి రామ శాస్త్రులు. సుబ్బారావు రెడ్డి గారు, రైతు బిడ్డ

, జిల్లా రైతు సంఘ అధ్యక్షులుగా పనిచేశారు. 19.6.1930 తేదీన ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొన్న కారణంగా, ఒక సంవత్సరం శిక్ష విధింపబడి, రాజమండ్రి, రాయవెల్లూర్ల జైళ్లలో శిక్ష అనుభవించారు. 11.1.1932 తేదీన జాతీయోద్యమానికి వాలంటీర్లను సమీకరించి నందుకు, గుడివాడలో లాఠీఛార్జీకి గురయ్యారు. 14.1.1932 తేదీన దివి తాలూకా కాజలో అరెస్టు చేసి, రెండేళ్లు కఠిన శిక్ష వేసి, రు.1000.00 జరిమానా విధించారు. రాజమండ్రి, బళ్లారి జైళ్లలో శిక్ష అనుభవవించి, 3.7.1933 న విడుదలయ్యారు. మరల 27.1.1941 న వ్యష్టి సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు,4 నెలల కఠిన శిక్ష విధించబడింది. రాజమండ్రి[1] జైలులో శిక్ష అనుభవించారు.

  1. సుధీర్ రెడ్డి, పామిరెడ్డి. మా చెట్టు నీడ, అసలేం జరిగింది. కస్తూరి విజయం. pp. 66, 67. ISBN 978-93-5445-095-2.