కాజ ( మొవ్వ)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కాజ పేరుతో ఇతర వ్యాసాలున్నవి. వాటి లింకుల కోసం కాజ (అయోమయ నివృత్తి) చూడండి.

కాజ
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం మొవ్వ
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీమతి మంద సుధారాణీ గారు
పిన్ కోడ్ 521 150
ఎస్.టి.డి కోడ్ 08671

కాజ గ్రామము, కృష్ణా జిల్లా మొవ్వ మండలములో ఉంది. పిన్ కోడ్ నం. 521 150.,ఎస్.టి.డి.కోడ్= 08671.

విషయ సూచిక

గ్రామ చరిత్ర[మార్చు]

క్రీ.శ. 1900 ప్రాంతములో కాజమ్మ అను గ్రామ దేవత విగ్రహము ఇక్కడి పొలములో దొరుకుటచే ఆ దేవత పేరు మీద ఈ గ్రామమునకు కాజ అను పేరు వచ్చినది అను ప్రచారము వాడుకలో ఉంది.

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

కాజ గ్రామము' కృష్ణా జిల్లా,మొవ్వ మండలములో ఉంది. కాజ గ్రామము మొవ్వ మండలములో అత్యదిక జనాభా కలిగిన గ్రామము. ఈ గ్రామము ప్రఖ్యాత పట్టణము అయిన మచిలీపట్టణము (బందరు) కు సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. క్రీ.శ. 1900 ప్రాంతములో కాజమ్మ అను గ్రామ దేవత విగ్రహము ఇక్కడి పొలములో దొరుకుటచే ఆ దేవత పేరు మీద ఈ గ్రామమునకు కాజ అను పేరు వచ్చినది అను ప్రచారము వాడుకలో ఉంది. ఈ గ్రామములో ప్రధానంగా రెడ్డి కులస్తులు నివసించెదరు.వీరు పూర్వము నెల్లూరు నుండి ఇక్కడకు వచ్చి స్థిరపడినట్లుగా ప్రచారము వాడుకలో ఉంది. ఇంకా ఈ గ్రామములో బ్రాహ్మణులు,గౌడ్లు, పద్మశాలీలు,నాయీ బ్రాహ్మణులు మరియు ఇతర కులస్తులు కలరు. గ్రామమును ఆనుకొని మంద పాలెం, కళాయి గుంట మరియు మట్ల మాలపల్లి అను దలిత వాడలు ఉన్నాయి. కాజ గ్రామములో రెడ్డి కులస్తులచే నిర్మించ బడిన శివాలయము, వేణుగోపాల స్వామి ఆలయము,కోదండ రామాలయము మరియు నూతనముగ నిర్మించిన గంగా పార్వతీ సమేత నాగేశ్వర స్వామి ఆలయములు మరియు శ్రీ భావనాఋషి స్వామి ఆలయము,కాజమ్మ (గ్రామ దేవత) ఆలయం మరియు,గ్రామ దేవత నాంచారమ్మ అమ్మ వారి ఆలయం కలవు

ప్రతి సంవత్సరం శ్రీ భావనాఋషి స్వామి వారి కల్యాణ మహొత్సవం అంగరంగ వైభవంగా జరుపుతారు.

గ్రామ దేవత నాంచారమ్మ అమ్మ వారి సంబరం అత్యంత వైభవంగా జరుపుతారు

ప్రముఖ నవల రచయిత యద్దనపూడి సులోచనా రాణీ గారు ఈ గ్రామానికి చెందిన వారె.

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్రమట్టానికి 7 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

ఈ గ్రామానికి సమీపంలో చిట్టూరు, మల్లంపల్లి, పోలవరం, కంచకోడూరు, ఐదుగుళ్ళపల్లి,కోసూరు,

గ్రామాలు ఉన్నాయి.

సమీప మండలాలు[మార్చు]

మొవ్వ, ఘంటసాల, చల్లపల్లి, పామర్రు

గ్రామానికి రవాణా సౌకర్యం[మార్చు]

మచిలీపట్టణము-మొవ్వ నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్:, మచిలీపట్టణము (బందరు) 15 కి.మీ, మరియు విమానాశ్రయం విజయవాడ 58 కి.మీ

గ్రామంలోని విద్యా సౌకర్యాలు[మార్చు]

శ్రీ పేకేటి నరసారెడ్డి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల:- మరియు ప్రాధమిక పాఠశాల .ఇటీవల నిర్వహించిన జిల్లాస్థాయి విద్యా వైఙానిక ప్రదర్శనలో, ఈ పాఠశాల విద్యార్థిని ధనికొండ భాను, వ్యర్ధపు వేడి నుండి విద్యుత్తు (Electricity from wastw heat) అను అంశాన్ని ప్రదర్శించగా, అది రాష్ట్రస్థాయి ప్రదర్శనకు ఎంపికైనది. [4]

మండల పరిషత్తు ఆదర్శ ప్రాథమిక పాఠశాల:- ఈ పాఠశాల వార్షికోత్సవాన్ని, 2017,ఫిబ్రవరి-18వతేదీ శనివారం రాత్రి, పాఠశాల విద్యా కుటుంబం, ఘనంగా నిర్వహించింది. [5]

గ్రామంలోని మౌలిక సదుపాయాలు[మార్చు]

రక్షిత మంచినీటి పథకం[మార్చు]

గ్రామములోని కంచర చెరువు వద్ద, ఈ పథకాన్ని, 1993 లో ఏర్పాటుచేసారు. కానీ ఇప్పుడు ఈ పథకం నిరుపయోగమైనది. [8]

బ్యాంకులు[మార్చు]

ఆంధ్రా బ్యాంక్. ఫోన్ నం. 08671/256264.

==గ్రామములోని సాగు/త్రాగునీటి సౌకర్యం== పూర్ణ చెరువు ద్వారా ప్రధానంగా ఈ గ్రామానికి తాగునీటి సౌకర్యం అందించబడుతుంది. నాగుల చెరువు:- పది ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువు అభివృద్ధి పనులను, 2015,మే నెల-16వ తేదీనాడు, నీరు-చెట్టు పథకం క్రింద ప్రారంభించారు. [2]

గ్రామ పంచాయతీ[మార్చు]

2013-జులైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీమతి మంద సుధారాణి, సర్పంచిగా ఎన్నికైనారు. [1]

==గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు== గంగా,పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయం.మరియు

శివాలయము[మార్చు]

కాజ గ్రామములో ఈ ఆలయం, రెడ్డి కులస్తులచే నిర్మించ బడింది. =

శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ రాజగోపాలస్వామివారి ఆలయం==[మార్చు]

ఈ ఆలయ పునఃప్రతిష్ఠా మహోత్సవాలను 2017,మార్చి-2 నుండి 5 వరకు నిర్వహించారు. లోక కల్యాణార్ధం కాజ గ్రామములో వేంచేసియున్న శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ రాజగోపాలస్వామి, రాజ్యలక్ష్మీ అమ్మవారు, ఆంజనేయస్వామి, జయ, విజయ ద్వారపాలకుల విగ్రహ పునఃప్రతిష్ఠ, ఆలయ శిఖర, జీవధ్వజ ప్రతిష్ఠా కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ ధ్వజస్తంభాన్ని శ్రీ పురిటిపాటి వెంకటకృష్ణారెడ్డి దంపతులు అందించారు. గ్రానైట్‌ను శ్రీ పురిటిపాటి గంగాధరరెడ్డి దంపతులు అందించారు. మార్చి-5వతేదీ ఆదివారం ఉదయం యంత్రస్థాపన, అనంతరం ఉదయం 8-05 కి విగ్రహ పునఃప్రతిష్ఠా కార్యక్రమం, అనంతరం పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా, విచ్చేసిన భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు. [6]&[7]

ఈ ఆలయంలోని శ్రీ ఆంజనేయస్వామివారికి, 2017,జూన్-19న, గ్రామానికి చెందిన శ్రీ కోదాటి గోపాలకృష్ణయ్య కుమారుడు శ్రీ సత్యప్రసాద్, శ్రీలక్ష్మి దంపతులు, అరవైవేల రూపాయల విలువైన వెంది పాదాలు, కవాలు సమర్పించినారు. [9]

శ్రీ రామాలయము[మార్చు]

శ్రీ గoగా పార్వతీ సమేత నాగేశ్వర స్వామి ఆలయము[మార్చు]

శ్రీ భావనాఋషి స్వామి ఆలయము[మార్చు]

ప్రతి సంవత్సరం మార్చి 14 న శ్రీ భావనాఋషి స్వామి వారి కల్యాణ మహొత్సవం అంగరంగ వైభవంగా జరుపుతారు.

శ్రీ కాజమ్మ (గ్రామ దేవత) ఆలయం[మార్చు]

గ్రామ దేవత శ్రీ నాంచారమ్మ అమ్మవారి ఆలయము[మార్చు]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి,మినుము పంట.

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం,చేనేత.

ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

  • ఈ గ్రామము మొవ్వ మండలములో అత్యదిక జనాభా కలిగిన గ్రామము.
  • ఈ గ్రామములో ప్రధానంగా రెడ్డి కులస్తులు నివసించెదరు. వీరు పూర్వము నెల్లూరు నుండి ఇక్కడకు వచ్చి స్థిరపడినట్లుగా ప్రచారము వాడుకలో ఉంది. ఇంకా ఈ గ్రామములో బ్రాహ్మణులు,గౌడ్లు, పద్మశాలీలు, నాయీ బ్రాహ్మణులు మరియు ఇతర కులస్తులు కలరు. గ్రామమును ఆనుకొని మందపాలెం, కళాయిగుంట మరియు మట్ల మాలపల్లి అను దళిత వాడలు ఉన్నాయి.

ఆదర్శ రైతు శ్రీ పేకేటి సీతారామిరెడ్డి[మార్చు]

  • ఈ గ్రామానికి చెందిన, ఐ.టి.ఐ.వరకు చదివిన రైతు శ్రీ పేకేటి సీతారామిరెడ్డి వ్యవసాయంలో రసాయనిక ఎరువులు వాడకుండా, సుభాష్ పాలేకర్ విధానంతో, పెట్టుబడి లేని, ప్రకృతి విధాన వ్యవసాయం చేసుకుంటూ, భూమిలోని సూక్ష్మజీవులను బతికించుకొని నేలతల్లినీ, గోమాతనూ నమ్ముకుని ప్రకృతి విధాన వ్యవసాయం చేస్తూ అధికదిగుబడులు సాధించుచున్నారు. ఈ రకంగా వీరు మొత్తం 40 ఎకరాలు వ్యవసాయంచేస్తూ, పలువురు రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. వీరు 2011లో ఉత్తమరైతుగా మంత్రి శ్రీ పార్ధసారథి గారినుండి ప్రశంసాపత్రం అందుకున్నారు. ఇటీవల హైదరాబాదులో జరిగిన ప్రపంచ వ్యవసాయ సదస్సులో పాల్గొన్నారు. [1]
  • రాష్ట్ర ప్రభుత్వం సేంద్రియ, గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించుచూ, ఆ విధానాలలో సాగుచేయుచున్న సర్టిఫికేషన్ రైతులచే, రాష్ట్రస్థాయిలో సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల విక్రయ మేళాలను నాలుగు సంవత్సరాలుగా నిర్వహించుచున్నది. శ్రీ సీతారామిరెడ్డి, ఈ సంవత్సరం కడపలో నిర్వహించిన మేళాలో పాల్గొని, మినుములు, పెసలు, అలసందలు, ఆవాలు, బియ్యం విక్రయించారు. గత సంవత్సరం గన్నవరం మరియూ విజయవాడలోని సింగ్ నగరులలో నిర్వహించిన మేళాలో వీరు ఏర్పాటుచేసిన స్టాళ్ళను, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు స్వయంగా సందర్శించి, వీరిని ప్రశంసించటం విశేషం. మచిలీపట్నం, హైదరాబాదు లలో గూడా వీరు తన ఉత్పత్తులను ప్రదర్శించారు. [3]

ఈ గ్రామములో మర్రివాడ సీతమ్మ ఒక శతాధిక వృద్ధురాలు ఉన్నారు. ఈమె 104 సంవత్సరాల వయస్సులో, 2017,జూన్-30న అనారోగ్యంతో కన్నుమూసినారు. ఈమె ఇటీవలి వరకు తన పనులు తానే చేసుకునేవారు. చివరి వారం రోజులు మాత్రం అనారొగ్యంతో బాధపడినారు. [10]

గణాంకాలు[మార్చు]

2011 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 7687.[2] ఇందులో పురుషుల సంఖ్య 3974, స్త్రీల సంఖ్య 3,713, గ్రామంలో నివాసగృహాలు 2344 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 2484 హెక్టారులు.

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు కృష్ణా; 2013,నవంబరు-15; 8వపేజీ. [2] ఈనాడు అమరావతి; 2015,మే-14; 41వపేజీ. [3] ఈనాడు అమరావతి; 2015,జూన్-25; 39వపేజీ. [4] ఈనాడు అమరావతి/పామర్రు; 2016,నవంబరు-2; 2వపేజీ. [5] ఈనాడు అమరావతి/పామర్రు; 2017,ఫిబ్రవరి-20; 1వపేజీ. [6] ఈనాడు అమరావతి/పామర్రు; 2017,ఫిబ్రవరి-25; 2వపేజీ. [7] ఈనాడు అమరావతి/పామర్రు; 2017,మార్చి-6; 1వపేజీ. [8] ఈనాడు అమరావతి/పామర్రు; 2017,మార్చి-11; 1వపేజీ. [9] ఈనాడు అమరావతి/పామర్రు; 2017,జూన్-20; 1వపేజీ. [10] ఈనాడు అమరావతి/పామర్రు; 2017,జులై-1; 1వపేజీ.


  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Movva/Kaza". Retrieved 24 June 2016. Cite web requires |website= (help); External link in |title= (help)
  2. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు