పెదపూడి (మొవ్వ మండలం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పెదపూడి (మొవ్వ మండలం)
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం మొవ్వ
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 3,264
 - పురుషులు 1,643
 - స్త్రీలు 1,621
 - గృహాల సంఖ్య 937
పిన్ కోడ్ 521136
ఎస్.టి.డి కోడ్ 08676

"పెదపూడి",కృష్ణా జిల్లా,మొవ్వ మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 136., ఎస్.టి.డి.కోడ్ = 08671.

గ్రామ చరిత్ర[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.[1]

కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలు[మార్చు]

విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరుళ్లపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంతభాగంతో పాటు శనగపాడు గ్రామం ఉన్నాయి.

మొవ్వ మండలం[మార్చు]

మొవ్వ మండలంలోని అయ్యంకి, కూచిపూడి, గుడపాడు, పెదపూడి, పెడసనగల్లు, బార్లపూడి, భట్లపెనుమర్రు, మొవ్వ, యద్దనపూడి, వేములమాడ గ్రామాలు ఉన్నాయి.

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

[2] సముద్రమట్టానికి 7 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

ఈ గ్రామానికి సమీపంలో అగినిపర్రు, మొవ్వ, పెనుమత్చ, పెడసనగల్లు, చోరగుడి గ్రామాలు ఉన్నాయి.

సమీప మండలాలు[మార్చు]

పమిడిముక్కల, ఘంటసాల, వుయ్యూరు, పామర్రు

గ్రామానికి రవాణా సౌకర్యం[మార్చు]

కూచిపూడి, మొవ్వ నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్ట్ఘేషన్: విజయవాడ 46 కి.మీ

గ్రామంలోని విద్యా సౌకర్యాలు[మార్చు]

  1. శ్రీ విద్యా నికేతన్.
  2. ఉర్దూ పాఠశాల.

గ్రామంలోని మౌలిక సౌకర్యాలు[మార్చు]

సంజీవని మల్టిస్పెషాలిటీ వైద్యశాల[మార్చు]

ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం[మార్చు]

బ్యాంకులు[మార్చు]

ఆంధ్రా బ్యాంక్:- పెదపూడి గ్రామంలోని పిన్నమనేని రాధాకృష్ణ భవనం ఆవరంణలో, "నవశక్తి రూరల్ మోడల్" పేరిట ఆదునికీకరించిన ఈ బ్యాంక్ శాఖను, 2015,జులై-21వ తేదీనాడు ప్రారంభించారు. [5]

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ సంపత్ వినాయకస్వామివారి ఆలయం[మార్చు]

శ్రీ రామలింగేశ్వరస్వామివారి ఆలయం[మార్చు]

శ్రీ కోదండరామాలయం[మార్చు]

ఇటీవల 50 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో, పునఃప్రతిష్ఠా మహోత్సవాలు 2017,ఫిబ్రవరి-13వతేదీ సోమవారం నుండి 15వతేదీ బుధవారం వరకు నిర్వహించారు. సోమవారంనాడు వేదపండితుల ఆధ్వర్యంలో గణపతి పూజ, పుణ్యాహవచనం, ఋత్విగ్వరణము, యాగశాల సంస్కారం, ప్రవేశం, అఖండ స్థాపనం, దేవతల ఆవాహనం, అంకురారోపణ, అగ్ని ప్రతిష్ఠ నిర్వహించారు. మంగళవారంనాడు నిత్య హోమం, పంచామేఋత పంచగవ్య పంచపల్లవ, జలాధివాసం గ్రామోత్సవం నిర్వహించారు. బుధవారం ఉదయం, బీజ న్యాసం, ధాతు న్యాసం, రత్న న్యాసం అనంతరం శ్రీ హనుమత్, భరత, లక్ష్మణ, శతృఘ్న, పరివార సమేత శ్రీ సీతారామచంద్రస్వామి, వినాయకస్వామివారల నూతన యంత్ర, విగ్రహ, శిఖర, ప్రతిష్ఠా మహోత్సవం భక్తజన సందోహం నడుమ, వైభవంగా నిర్వహించారు. యంత్ర ప్రతిష్ఠ, విగ్రహ స్థాపన, స్వామివారి దివ్య మంగళ దర్శనం, పూర్ణాహుతి కార్యక్రమాల అనంతరం అన్నసంతర్పణ నిర్వహించారు. అంతకు ముందు స్వామివారి కళ్యాణం కన్నులపండువ నిర్వహించారు. [5]

శ్రీ కాళీకృష్ణ దివ్య కిరణ పీఠం[మార్చు]

ఈ పీఠం వద్ద 2017,మార్చి-24వతేదీ శుక్రవారంనాడు, ఏకాహ మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం ఆరు గంటలకు ప్రారంభమైన ఈ ఉత్సవంలో జిల్లా నలుమూలలనుండి వచ్చిన భక్తులు భజన కార్యక్రమాలు, కుంకుమపూజలు నిర్వహించినార్ సందర్భంగా అన్న సమారాధన కార్యక్ర్మం గూడా చేపట్టినారు. శనివారం గూడా ఈ కార్యక్రమం కొనసాగించెదరు. [6]

శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం[మార్చు]

ఈ ఆలయ 25వ వార్షికోత్సవం, 2020,అక్టోబరు-28,బుధవారంనాడు, భక్తిశ్రద్ధలతో నిర్వహించినారు. ఉదయం బాబాకు అర్చకులు, వేద మంత్రాల నడుమ పంచామృతాభిషేకం, అర్చన, విశేష పూజలు నిర్వహించినారు. [7]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

గ్రామ ప్రముఖులు[మార్చు]

కీ.శే.మొవ్వా శ్రీరామచంద్రరావు, సీనియర్ వైద్యులు[మార్చు]

కీ.శే.మొవ్వా శ్రీరామచంద్రరావు, సీనియర్ వైద్యులు. వీరు కూచిపూడి రోటరీ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు. పెదపూడిలోని కేర్ బైర్రాజు ఆసుపత్రి వైద్యులుగా సేవలందించారు. 4 దశాబ్దాలుగా వీరు శ్రీదేవీ నర్సింగ్ హోం పేరిట వైద్య సేవలందించారు. వీరి భార్య జయలక్ష్మి, కుమారుడు శ్రీనివాస్, కుమార్తె శ్రీదేవి దంపతులు గూడా వైద్యులేకావడం విశేషం. వీరు 2015,నవంబరు-2న అనారోగ్యంతో కాలధర్మం చెందినారు. [4]

గ్రామ విశేషాలు[మార్చు]

ఈ గ్రామానికి చెందిన శ్రీమతి పోతినేని మహాలక్ష్మి, తన స్వగ్రామంపై మక్కువతో, ఈ గ్రామంలోని పేదలకు మేలు చేసే కార్యక్రమాలు చేపట్టాలని సంకల్పించి, "సాయి కోమల్ ఛారిటబుల్ ట్రస్ట్"ను స్థాపించి, ఛైర్ పర్సన్ హోదాలో మూడు సంవత్సరాలుగా, మహిళలకు పలు శిక్షణా శిబిరాలు నిర్వహించుచూ ఆదర్శంగా నిలుచుచున్నారు. 3 నెలలపాటు కొనసాగే ఈ శిక్షణలో చుట్టుప్రక్క గ్రామాలనుండి ఒక బ్యాచికి 35 మంది చొప్పున, ఎందరో మహిళలు సద్వినియోగం చేసుకుంటున్నారు. [3]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 3,264 - పురుషుల సంఖ్య 1,643 - స్త్రీల సంఖ్య 1,621 - గృహాల సంఖ్య 937

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3667.[3] ఇందులో పురుషుల సంఖ్య 1673, స్త్రీల సంఖ్య 1994, గ్రామంలో నివాస గృహాలు 862 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 214 హెక్టారులు.

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-22.
  2. "http://www.onefivenine.com/india/villages/Krishna/Movva/Pedapudi". Retrieved 24 June 2016. External link in |title= (help)
  3. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-08.

వెలుపలి లింకులు[మార్చు]

[3] [4] [5] ఈనాడు అమరావతి/పామర్రు;2017,ఫిబ్రవరి-16;1వపేజీ. [6] ఈనాడు అమరావతి/పామర్రు;2017,మార్చి-25;1వపేజీ. [7] ఈనాడు అమరావతి;2020,అక్టోబరు-29,4వపేజీ.