కోసూరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కోసూరు
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం మొవ్వ
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 5,099
 - పురుషులు 2,809
 - స్త్రీలు 2,816
 - గృహాల సంఖ్య 1,579
పిన్ కోడ్ 521150
ఎస్.టి.డి కోడ్ 08671

కోసూరు, కృష్ణా జిల్లా, మొవ్వ మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 150., ఎస్.టి.డి.కోడ్ = 08671.

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్రమట్టానికి 7 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

ఈ గ్రామానికి సమీపంలో చిలకలపూడి, కాజ, చిట్టూరు, ఘంటసాల, ఘంటసాలపాలెం గ్రామాలు ఉన్నాయి.

సమీప మండలాలు[మార్చు]

మొవ్వ మండలం, గూడూరు, చల్లపల్లి మండలం, పామర్రు మండలం

గ్రామానికి రవాణా సౌకర్యం[మార్చు]

కూచిపూడి, మొవ్వ నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్ట్ఘేషన్: విజయవాడ 56 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

శాఖా గ్రాంధాలయం[మార్చు]

ఈ గ్రామంలో స్వాతంత్ర్యం రాకముందే ఈ గ్రంథాలయాన్ని ఒక పూరిగుడిసెలో నడిపేవారు. అనంతరం 1955లో గ్రామస్థులు గ్రంథాలయం కొరకు, ఒక శాశ్వత భవనాన్ని నిర్మించుకున్నారు. దీనిని జిల్లా గ్రంథాలయ సంస్థకు అప్పగించారు. అనంతరం కాలక్రమేణా ఈ భవనం శిథిలమవడంతో రు. 10 లక్షల వ్యయంతో ఒక నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసి, పనులు పూర్తి చేసారు. ఈ నూతన భవనాన్ని 2016, మార్చ్-13న ప్రారంభించెదరు. [6]&[9]

జిలా పరిషత్తు ఉన్నత పాఠశాల[మార్చు]

ఈ పాఠశాలలో 2016-17 విద్యాసంవత్సరంలో పదవ తరగతి చదివిన కట్టా శివకుమార్ అను విద్యార్థి, పదవ తారగతి పరీక్షా ఫలితాలలో 9.5 గ్రేడ్ మార్కులు సాధించడమేగాక, ఒంగోలులోని ఐ.ఐ.ఐ.టిలో ప్రవేశానికి అర్హత సంపాదించాడు. [10]

జాన్ కుడెర్ పబ్లిక్ పాఠశాల[మార్చు]

విజయశ్రీ సన్ ఫ్లవర్ పాఠశాల[మార్చు]

గ్రామంలోని మౌలిక వసతులు[మార్చు]

శుద్ధజల కేంద్రం[మార్చు]

ఈ గ్రామంలో విజయలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో, 7 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన శుద్ధజలకేంద్రాన్ని, 2017, ఆగస్టు-12న ప్రారంభించారు. [11]

బ్యాంకులు[మార్చు]

ఇండియన్ బ్యాంక్. ఫోన్ నం. 08671/25637., సెల్= 9912223823.

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]

గోపాలం చెరువు.

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ చిందా వీరవెంకటనాగేశ్వరరాజు, సర్పంచిగా ఎన్నికైనారు. ఉప సర్పంచిగా శ్రీ తాతా అంజయ్య ఎన్నికైనారు. [7]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ రుక్మిఈ సత్యభామా సమేత శ్రీ సంతాన వేణుగోపాలస్వామివారి ఆలయం[మార్చు]

ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం, వైశాఖ పౌర్ణమికి స్వామివారి కళ్యాణమహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించెదరు. [4]

శ్రీ షిరిడీ సాయిబాబా ఆలయం[మార్చు]

ఈ ఆలయ పంచమ వార్షికోత్సవాలు, 2014, మార్చ్-6, గురువారం నుండి 10వ తేదీ సోమవారం వరకూ, 5 రోజులపాటు, వైభవంగా నిర్వహించారు. ఆఖరిరోజు, 10వ తేదీ, సొమవారం నాడు మహా పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు.తొలుత విశేషహోమం, చండీహోమం, గోపూజ, హోమరక్షధారణ, వేద ఆశీర్వచనం, మంగళహారతి నిర్వహించారు. [2]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, చెరుకు, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

ప్రముఖులు[మార్చు]

శ్రీ మేకా నరసయ్య[మార్చు]

ఈ గ్రామంలో శ్రీ మేకా నరసయ్య (97) అను ఒక స్వాతంత్ర్య సమరయోధులు ఉన్నారు. వీరి భార్య శాయమ్మ (92). శ్రీ నరసయ్య గారు, సెప్టెంబరు,1917 లో ఈ గ్రామంలో ఒక రాజకీయ కుటుంబంలో జన్మించారు. 1929 లో మహాత్మా గాంధీ ఖద్దరు ఉద్యమంలో భాగంగా, మొవ్వ మండలంలోని నిడుమోలు, అవురుపూడి, చినముత్తేవి, కూచిపూడి, పెదపూడి, మొవ్వ, కొడాలి గ్రామాల మీదుగా ఘంటసాల గ్రామానికి వచ్చినపుడు, వీరు తొలిసారిగా గాంధీజీని ఘంటసాలలో కలుసుకున్నారు. మచిలీపట్నంలోని కోనేరు సెంటరులో, 1930 లో, శ్రీ తోట నరసింహనాయుడు గారు కాంగ్రెస్ జండా ఎగురవేసిన సమయంలో వీరు అక్కడ ఉన్నారు. 1934లో అస్పృస్యతా నివారణలో భాగంగా నిర్వహించిన ఉద్యమంలో వీరు, మహాత్మా గాంధీజీని మచిలీపట్నంలో రెండవసారి కలుసుకున్నారు. బందరు సమీపంలోని చిన్నాపురంలో నిర్వహించిన ఉప్పు సత్యాగ్రహంలో ఆయన శ్రీ చింతల వెంకటరామయ్యతో కలిసి పాల్గొన్నారు. శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య శాసనసభ్యునిగా చల్లపల్లి రాజాపై పోటీ చేయగా, ఆ ప్రచారంలో భాగంగా శ్రీమతి సరోజినీ నాయుడు మొవ్వ గ్రామానికి విచ్చేసినప్పుడు, వీరు గూడా ఆ ప్రచారంలో పాల్గొన్నారు. వీరి భార్య శ్రీమతి శాయమ్మ, 12 సంవత్సరాల వయసు నుండియే రాట్నంపై నూలు వడికేవారు. 1942 లో క్విట్ ఇండియా ఉద్యమంలో వీరు పాల్గొన్నారు. ఈ దంపతులిరువురూ, ఇప్పటివరకు ప్రతి ఎన్నికలలోనూ తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. వీరిద్దరూ ఇప్పుడు గూడా ఆరోగ్యంగా ఉంటూ తమ పనులు తాము చేసికొనుచున్నారు. ప్రస్తుతం 99వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వీరిని 69వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, 15-8-2015న కృష్ణా జిల్లా కలెక్టరు శ్రీ ఏ. బాబు చేతులమీదుగా సన్మానించారు. [3]&[5]

వీరు 99 సంవత్సరాల వయసులో, 2016, జనవరి-24న అనారోగ్యంతో కన్నుమూసినారు. [8]

శ్రీకుక్కల నాగేశ్వరరావు[మార్చు]

గామ విశేషాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5625.[2] ఇందులో పురుషుల సంఖ్య 2809, స్త్రీల సంఖ్య 2816, గ్రామంలో నివాసగృహాలు 1579 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1281 హెక్టారులు.

జనాభా (2011) - మొత్తం - పురుషుల సంఖ్య - స్త్రీల సంఖ్య - గృహాల సంఖ్య

మూలాలు[మార్చు]

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Movva/Kosuru". Retrieved 24 June 2016. External link in |title= (help)
  2. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-08.

వెలుపలి లింకులు[మార్చు]

[2] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014, మార్చ్-11; 3వపేజీ. [3] ఈనాడు కృష్ణా; 2014, ఆగస్టు-14; 16వపేజీ. [4] ఈనాడు కృష్ణా; 2015, మే-6; 38వపేజీ. [5] ఈనాడు అమరావతి; 2015, ఆగస్టు-15; 29వపేజీ. [6] ఈనాడు అమరావతి; 2015, సెప్టెంబరు-16; 27వపేజీ. [7] ఈనాడు అమరావతి; 2015, అక్టోబరు-3; 24వపేజీ. [8] ఈనాడు అమరావతి; 2016, జనవరి-27; 41వపేజీ. [9] ఈనాడు అమరావతి/పామర్రు; 2016, మార్చ్-5; 1వపేజీ. [10] ఈనాడు అమరావతి/పామర్రు; 2017, జులై-3; 1వపేజీ. [11] ఈనాడు అమరావతి/పామర్రు; 2017, ఆగస్టు-13; 2వపేజీ.

"https://te.wikipedia.org/w/index.php?title=కోసూరు&oldid=3230276" నుండి వెలికితీశారు