అయ్యంకి
అయ్యంకి | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
---|---|
జిల్లా | కృష్ణా |
మండలం | మొవ్వ |
ప్రభుత్వము | |
- సర్పంచి | శ్రీమతి రాజులపాటి అంకమ్మ |
జనాభా (2011) | |
- మొత్తం | 2,869 |
- పురుషులు | 1,443 |
- స్త్రీలు | 1,426 |
- గృహాల సంఖ్య | 840 |
పిన్ కోడ్ | 521138 |
ఎస్.టి.డి కోడ్ | 08671 |
అయ్యంకి, కృష్ణా జిల్లా, మొవ్వ మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 521 138., ఎస్.టీ.డీ.కోడ్ = 08671.
విషయ సూచిక
- 1 గ్రామ చరిత్ర
- 2 గ్రామం పేరు వెనుక చరిత్ర
- 3 గ్రామ భౌగోళికం
- 4 గ్రామానికి రవాణా సౌకర్యాలు
- 5 గ్రామంలో విద్యా సౌకర్యాలు
- 6 గ్రామంలో మౌలిక వసతులు
- 7 గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం
- 8 గ్రామ పంచాయతీ
- 9 గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు
- 10 గ్రామంలో ప్రధాన పంటలు
- 11 గ్రామంలో ప్రధాన వృత్తులు
- 12 ప్రముఖులు
- 13 గ్రామ విశేషాలు
- 14 గణాంకాలు
- 15 మూలాలు
గ్రామ చరిత్ర[మార్చు]
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.[1]
కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలు[మార్చు]
విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరుళ్లపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంతభాగంతో పాటు శనగపాడు గ్రామం ఉన్నాయి.
మొవ్వ మండలం[మార్చు]
మొవ్వ మండలంలోని అయ్యంకి, కూచిపూడి, గుడపాడు, పెదపూడి, పెదశనగలూరు, బార్లపూడి, భట్లపెనుమర్రు, మొవ్వ, యద్దనపూడి మరియు వేములమాడ గ్రామాలు ఉన్నాయి.
గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]
గ్రామ భౌగోళికం[మార్చు]
[2] సముద్రమట్టానికి 7 మీ.ఎత్తు
సమీప గ్రామాలు[మార్చు]
ఈ గ్రామానికి సమీపంలో కూచిపూడి, ఉండ్రపూడి, పెదపూడి, మొవ్వ, ఉరుటూరు గ్రామాలు ఉన్నాయి.
సమీప మండలాలు[మార్చు]
పమిడిముక్కల, ఘంటసాల, మొవ్వ, వుయ్యూరు
గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]
కూచిపూడి, పామర్రు నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్ట్ఘేషన్: విజయ్వాడ 47 కి.మీ
గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]
ఈ గ్రామములో గ్రంథాలయ నిర్మాణానికి 5 సెంట్ల స్థలం మంజూరైనది. త్వరలో నిర్మాణం ప్రారంభించెదరు. [4]
మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, అయ్యంకి
గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]
గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం[మార్చు]
గ్రామ పంచాయతీ[మార్చు]
2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో సర్పంచిగా శ్రీమతి రాజులపాటి అంకమ్మ ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ పామర్తి వెంకట నాగేశ్వరరావు ఎన్నికైనారు. [2]
గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]
- శ్రీ గంగా పర్వతవర్ధనీ సమేత శ్రీ రామలింగేశ్వరస్వామివారి దేవాలయం.
- రాజులపాటివారి అంకమ్మ తల్లి దేవర ఆలయం:- ఈ ఆలయంలో అమ్మవారి వార్షిక సంబరాలు, 2015,మే నెల ఆరవతేదీ బుధవారంనుండి, 10వ తేదీ ఆదివారం వరకు, వైభవంగా నిర్వహించారు. ఈ మహోత్సవాలలో, జిల్లా నలుమూలలనుండి రాజులపాటి వంశీయులు డప్పువాయిద్యాలతో, ప్రభలతో తరలివచ్చి, మొక్కుబడులు తీర్చుకొని తమ భక్తిని చాటుకున్నారు. పొంగళ్ళు, కుంభనైవేద్యాలు సమర్పించారు. అంకమ్మ తల్లి సంబరాలతో గ్రామం కళకళలాడినది. [6]
- పామర్తివారి శ్రీ రేణుకమ్మ తల్లి దేవర ఆలయం:- ఈ ఆలయంలోని అమ్మవారి వార్షిక సంబరాలు, 2015,జూన్-3వ తేదీ బుధవారం ఉదయం ఉట్టిదించడం, నైవేద్యం, చుడికప్పెర వంటి పూజాకార్యక్రమాలతో ప్రారంభమైనవి. రెండవరోజు గురువారంనాడు, విశేషపూజలు నిర్వహించారు. పామర్తివారి సోదరులు, ఆడబడుచులు తరలివచ్చి ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఆలయాన్ని నిర్మించిన ఆడబడుచు, మచిలీపట్నానికి చెందిన శ్రీ వంకా బాపూజీ భార్య శ్రీమతి వెంకటేశ్వరమ్మ, కుటుంబసభ్యులతో విచ్చేసి, పూజలు నిర్వహించారు. వారసులందరూ కప్పెరకుండలో అన్నం వేసినారు. రెడకప్పెర, పూలకప్పెర ఊరేగింపును వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలు 7వ తేదీ ఆదివారం వరకు కొనసాగుతవి. [7]
గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]
గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]
పరిశ్రమలు[మార్చు]
అయ్యంకి గ్రామ శివారులోని రోష్నీ పవర్ టెక్ లిమిటెడ్.
ప్రముఖులు[మార్చు]
- మాదయగారి మల్లన - శ్రీకృష్ణదేవరాయల ఆస్థాన కవి.
- అయ్యంకి వెంకట రమణయ్య - స్వాతంత్ర్య సమరయోధులు, గ్రంథాలయోద్యమ నేత.
- కె.పీ.రెడ్డెయ్య - మాజీ ఎం.పీ
- కొలుసు పార్ధసారధి - మాధ్యమిక విద్యామంత్రి. వీరి స్వగ్రామం, అయ్యంకి గ్రామశివారు గ్రామమయిన కారకంపాడు.
గ్రామ విశేషాలు[మార్చు]
ఈ గ్రామానికి చెందిన గ్రంథాలయ పితామహుడైన శ్రీ అయ్యంకి వెంకటరమణయ్యగారి మనుమడు ప్రొఫెసర్ అయ్యంకి వెంకటమురళీకృష్ణ, గ్రామాభివృద్ధికి తోడ్పడుచున్నారు. వీరు గ్రామంలోని గంగానమ్మ, పోతురాజు చెట్టు దివ్యసన్నిధిని, ఒకటిన్నర లక్షల రూపాయలతో అభివృద్ధిచేసారు. వీరు తన తాతగారి స్ఫూర్తితో, గ్రామాన్ని, "సరస్వతీ సామ్రాజ్యం" పేరుతో, ఆకర్షణీయ గ్రామాలలో భాగంగా, దత్తత తీసికొని, అభివృద్ధిచేయడానికి పూనుకున్నారు. వీరు అయ్యంకి గ్రామములోని రహదారులన్నీ, ఒక సంవత్సరం లోపుగా సిమెంటు రహదారులుగా మార్చడానికి నిర్ణయించుకున్నారు. ఈ కార్యక్రమంలో తొలిగా, అయ్యంకి కమలకృష్ణ ఙాపకార్ధం, బి.సి.కాలనీలలోని రహదారులను మూడున్నర లక్షల రూపాయల వ్యయంతో సిమెంటు రహదారులుగా మార్చే పనులను 2015,ఆగష్టు-16వ తేదీనాడు ప్రారంభీంచారు. [5]&[8]
గణాంకాలు[మార్చు]
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3096.[3] ఇందులో పురుషుల సంఖ్య 1594, స్త్రీల సంఖ్య 1502, గ్రామంలో నివాసగృహాలు 852 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 937 హెక్టారులు.
- జనాభా (2011) - మొత్తం 2,869 - పురుషుల సంఖ్య 1,443 - స్త్రీల సంఖ్య 1,426 - గృహాల సంఖ్య 840
మూలాలు[మార్చు]
- ↑ http://crda.ap.gov.in/APCRDA/Userinterface/ADMIN/DynamicHorizantalGovTab.aspx
- ↑ "http://www.onefivenine.com/india/villages/Krishna/Movva/Ayyanki". Retrieved 24 June 2016. Cite web requires
|website=
(help); External link in|title=
(help) - ↑ భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
[2] ఈనాడు కృష్ణా; 2013,జులై-25; 8వపేజీ. [3] ఈనాడు కృష్ణా/పామర్రు; 2013,నవంబరు-2; 2వపేజీ. [4] ఈనాడు కృష్ణా; 2014,ఫిబ్రవరి-27; 3వపేజీ. [5] ఈనాడు కృష్ణా/అమరావతి; 2015,మే-6; 38వపేజీ. [6] ఈనాడు కృష్ణా/అమరావతి; 2015,మే-11; 38వపేజీ. [7] ఈనాడు కృష్ణా/అమరావతి; 2015,జూన్-2; 39వపేజీ. [8] ఈనాడు అమరావతి; 2015,ఆగష్టు-16; 23వపేజీ.