మొవ్వపాలెం
ఈ వ్యాసాన్ని తాజాకరించాలి. |
ఈ గ్రామం - "మొవ్వపాలెం" - పేరు సంబంధిత మండలం పేజీలో లేదు. ఈ పేజీలో ఉన్న సమాచారం సరైనదో కాదో నిర్ధారించుకోవాలి. లేదా మండలం పేజీలో ఈ గ్రామం వేరే పేరుతో ఉందేమో చూసి, ఉంటే... ఈ రెండు పేజీలను విలీనం చెయ్యాలి |
మొవ్వపాలెం | |
— రెవిన్యూ గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 16°13′16″N 80°55′55″E / 16.221197°N 80.931890°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కృష్ణా |
మండలం | మొవ్వ |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 521138 |
ఎస్.టి.డి కోడ్ | 08676 |
మొవ్వపాలెం , కృష్ణా జిల్లా, మొవ్వ మండలానికి చెందిన గ్రామమ
గ్రామ చరిత్ర
[మార్చు]గ్రామం పేరు వెనుక చరిత్ర
[మార్చు]గ్రామ భౌగోళికం
[మార్చు][1] సముద్రమట్టానికి 7 మీ.ఎత్తు
సమీప గ్రామాలు
[మార్చు]మచిలీపట్నం, రేపల్లె, పెడన, గుడివాడ
సమీప మండలాలు
[మార్చు]పమిడిముక్కల, ఘంటసాల, చల్లపల్లి, పామర్రు
గ్రామానికి రవాణా సౌకర్యాలు
[మార్చు]కూచిపూడి, మొవ్వ నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్ట్ఘేషన్: విజయూవాడ 50 కి.మీ
గ్రామములోని విద్యాసౌకర్యాలు
[మార్చు]జిల్లా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, కోసూరు.
హోలి స్పిరిట్ ఇంగ్లెషు మీడియం హైస్కూల్, మొవ్వ.
గ్రామములోని మౌలిక సదుపాయాలు
[మార్చు]గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం
[మార్చు]ఊర చెరువు.
గ్రామ పంచాయతీ
[మార్చు]ప్రెసిడెంట్:- శ్రీ చలమలశెట్టి సత్యనారాయణ.
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
[మార్చు]శ్రీ సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీ రామాలయం
[మార్చు]పురాతనమైన ఈ ఆలయం శిథిలావస్థకు చేరడంతో, ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. ఈ ఆలయ పునర్నిర్మాణానికి దాతలు మూడున్నర లక్షల రూపాయలు అందజేయగా, దేవాదాయశాఖవారు మరియొక ఐదున్నర లక్షల రూపాయలను అందజేసినారు. ధ్వజస్తంభ ప్రతిష్ఠకు, దాతలు ఇంకొక నాలుగు లక్షల రూపాయలను అందజేసెదరు.
నూతనంగా పునర్నిర్మించిన ఈ ఆలయంలో విగ్రహ పునఃప్రతిష్ఠా మహోత్సవాలు, 2016, మార్చ్-9,10 తేదీలలో నిర్వహించెదరు. 9వ తేదీ బుధవారం ఉదయం 9 గంటలకు స్వామివారి ఊరేగింపు, పలు పూజా కార్యక్రమాలు నిర్వహించెదరు. 10వ తేదీ గురువారం ఉదయం యంత్ర ప్రతిష్ఠ, మూల విగ్రహ అభిషేకం, తత్తోపాస హోమం అనంతరం 10-52 కి విగ్రహ ప్రతిష్ఠ, ద్వారతోరణ బలి, పంచసూక్త హోమం, మాహా పూర్ణాహుతి, శాంతికళ్యాణం, సామూహిక కుంకుమపూజ, పవళింపుసేవ నిర్వహించెదరు. [2]
శ్రీ దాసాంజనేయస్వామివారి ఆలయం
[మార్చు]ఈ ఆలయంలో 2017,ఆగస్టు-13వతేదీ ఆదివారంనాడు, తిరుమల తిరుపతి దేవస్థానం, ధర్మప్రచార పరిషత్తు సంయుక్త ఆధ్వర్యంలో, మనగుడి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామములోని సాయిదుర్గా భక్తసమాజం సభ్యులు, ఆలయాన్ని శుద్ధిచేసి, ముగ్గులు వేసి, మామిడి తోరణాలతో అలంకరించారు. అనంతరం నగర సంకీర్తనం కార్యక్రమం నిర్వహించారు. [4]
గ్రామములోని ప్రధాన పంటలు
[మార్చు]గ్రామములోని ప్రధాన వృత్తులు
[మార్చు]గ్రామ ప్రముఖులు
[మార్చు]గ్రామ విశేషాలు
[మార్చు]- ఇక్కడ చలమలశెట్టి - బాదర్ల ఇంటిపేరు వారు ఎక్కువగా ఉన్నారు
- ఈ గ్రామానికి చెందిన శ్రీ చెలాది శివరామప్రసాదు కుమారుడు మోహనవంశీ అను విద్యార్థి, పాలీసెట్-2013లో స్టేట్ లో 73వ ర్యాంక్, కృష్ణాజిల్లాలో 3వ రాంక్ సంపాదించాడు. ఇంటరులో 986 మార్కులు సంపాదించాడు. తాజాగా ఇతడు 2015, జే.ఈ.ఈ. మెయిన్స్ లో 256వ ర్యాంక్ మరియూ ఐ.ఐ.టి.లో 1946వ ర్యాంక్ సంపాదించాడు. [1]
- ఈ గ్రామానికి చెందిన శ్రీ సాయిదుర్గా భక్తసమాజం వారు, తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో, 2017,జూన్-13న, తిరుమలలో 14 మంది సభ్యులతో, గోవిందునిపై పాటలు పాడినారు. అనంతరం అన్నమయ్య భవనంలో శ్రీ లలిత, విష్ణు, మణిదీపం పారాయణలతోపాటు, హనుమాన్‌చాలీసా పారాయణం చేసారు. ఈ సందర్భంగా ఈ సమాజం వారికి, దేవస్థానం వారు, మూడువేల రూపాయల నగదు పారితోషికం, ధ్రువీకరణ పత్రం అందజేసినారు. [3]
మూలాలు
[మార్చు]- ↑ "onefivenine.com/india/villages/Krishna/Movva/Movvapalem". Retrieved 24 June 2016.[permanent dead link]
వెలుపలి లింకులు
[మార్చు][1] ఈనాడు అమరావతి; 2015,జూలై-3; 38వపేజీ. [2] ఈనాడు అమరావతి/పామర్రు; 2016,మార్చ్-4; 1వపేజీ. [3] ఈనాడు అమరావతి/పామర్రు; 2017,జూన్-17; 2వపేజీ. [4] ఈనాడు అమరావతి/పామర్రు; 2017,ఆగస్టు-14; 1వపేజీ.