పెడసనగల్లు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పెడసనగల్లు పేరు పెదసాని అనే ఆమె పేరుతో వచ్చినట్లు కొందరు స్థానికులు చెబుతారు  


పెడసనగల్లు
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం మొవ్వ
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 3,290
 - పురుషులు 1,650
 - స్త్రీలు 1,640
 - గృహాల సంఖ్య 1,002
పిన్ కోడ్ 521138
ఎస్.టి.డి కోడ్ 08671

పెడసనగల్లు, కృష్ణా జిల్లా, మొవ్వ మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 138., యస్.టీ.డీ, కోడ్ = 08671.

గ్రామ చరిత్ర[మార్చు]

 • గ్రామం పేరు వెనుక చరిత్ర

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్రమట్టానికి 7 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

ఈ గ్రామానికి సమీపంలో కూచిపూడి, పెదపూడి, ఐనంపూడి, ఉండ్రపూడి, ఉరుటూరు గ్రామాలు ఉన్నాయి.

సమీప మండలాలు[మార్చు]

పమిడిముక్కల, ఘంటసాల, మొవ్వ, వుయ్యూరు

గ్రామానికి రవాణా సౌకర్యం[మార్చు]

కూచిపూడి, పామర్రు నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్ట్ఘేషన్: విజయవాడ 45 కి.మీ

గ్రామంలోని విద్యా సౌకర్యాలు[మార్చు]

 1. జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల, పెడసనగల్లు:-ఈ పాఠశాల 78వ వార్షికోత్సవాన్ని, 2017, ఏప్రిల్-23న ఘనంగా నిర్వహించారు. [14]
 2. మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల, పెడసనగంటిపాలెం.

గ్రామంలోని మౌలిక సదుపాయాలు[మార్చు]

లింగం పూర్ణచంద్రరావు స్మారక పశుగణాభివృద్ధి కేంద్రం[మార్చు]

శ్రీ లింగం వీరభద్రరావు, శ్రెమతి అన్నపూర్ణమ్మ దంపతుల ఆర్థిక సహకారంతో, అప్పటి దివి తాలూకాలోని ఈ గ్రామంలో, ఈ కేంద్రాన్ని, 1966లో ప్రారంభించారు. ఈ కేంద్రం ఆవరణలోనే 1978 లో, పాల ఉత్పత్తిదారులు అందించిన ఆర్థిక సహకారంతో, డ్రెస్సింగ్ షెడ్‌ను నిర్మించారు. ఈ కేంద్రం అయ్యంకి, పెడసనగల్లు, కారకంపాడు గ్రామాల రైతుల పశువుల వైద్య అవసరాలను తీర్చుచున్నది. ప్రస్తుతం ఈ కేంద్రం భవనాలు శిథిలావస్థకు చేరుకున్నవి. తక్షణ పునర్నిర్మాణం అవసరం. [13]

రక్షిత మంచినీటి పథకం[మార్చు]

ఈ గ్రామంలోని పంచాయతీ భవన ప్రాంగణంలో, ఎన్.టి.ఆర్.సుజలస్రవంతి పథకం ద్వారా సురక్షితమైన త్రాగునీరు అందించుటకై ఏర్పాట్లు జరుగుచున్నవి. గ్రామ పంచాయతీ స్థలంలో ఈ పథకం ఏర్పాటుచేసి, పంచాయతీ తరపున విద్యుత్తు సరఫరా కొరకై ఏర్పాటు చేస్తున్నారు. ఈ గ్రామానికి చెందిన శ్రీ పరుచూరి మెహర్ కృష్ణ, కీ.శే. పరుచూరి ప్రసాదరావు పేరిట, 2,000 లీటర్ల సామర్ధ్యం గల ఆర్.వో.ప్లాంటును, మూడు లక్షల రూపాయల వ్యయంతో అందించనున్నారు. దీనికి అవసరమైన షెడ్డు నిర్మాణం కొరకు, శ్రీ కొడాలి జగన్మోహనరావు, తన తండ్రి కీ.శే. భూషయ్య పేరిట ఒక లక్ష రూపాయాలను అందించనున్నారు. [8]

==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం== మూలపాఠ్యాన్ని సవరించు[permanent dead link]

గ్రామ పంచాయతీ[మార్చు]

 1. 2013 జూలైలో పెడసనగల్లు గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి నన్నపనేని స్వర్ణలత, సర్పంచిగా ఎన్నికైనారు. [5]
 2. పెడసనగల్లు గ్రామ పంచాయతీ, 2015-16 ఆర్థిక సంవత్సరానికి 100% పన్ను వసూలుచేసి మొవ్వ మండలంలో ప్రథమస్థానంలో నిలిచింది. ఇంటి పన్ను రు.3,37,789-00, నీటి కుళాయిల పన్ను 1,03,800-00, మొత్తం రు. 4,41,589-00 వసూలుచేసారు. [10]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు[మార్చు]

 1. శ్రీ లక్ష్మీ పద్మావతీ సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం:- ఈ ఆలయ అష్టమ వార్షిక బ్రహ్మోత్సవాలు 2014, మే-19 నుండి 22 వరకు నిర్వహించెదరు. ఈ ఉత్సవాలలో భాగంగా 20వ తేదీన స్వామివారి తిరు కళ్యాణం నిర్వహించెదరు. [4]
 2. గ్రామదేవత శ్రీ గంగానమ్మ తల్లి ఆలయం.
 3. పామర్తివారి ఇలవేలుపు శ్రీ అంకమ్మ తల్లి అలయం.

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

గ్రామ ప్రముఖులు[మార్చు]

సూరపనేని డింపుల్[మార్చు]

 1. ఈ గ్రామానికి చెందిన, శ్రీ సూరపనేని రామోజీ కుమార్తె అయిన 13 ఏళ్ళ సూరపనేని డింపుల్ అనే అమ్మాయి, గత యేడాది ఆగస్టులో మలేషియాలో జరిగిన కరాటే పోటీలలో 13 ఏళ్ళ లోపు బాలికలలో ఒక స్వర్ణ పతకాన్నీ, ఒక కాంస్య పతకాన్నీ గెలుచుకున్నది. ఈమె 2014, ఏప్రిల్-15 నుండి 25 వరకూ, అమెరికాలోని లాస్ ఏంజల్స్ నగరంలో జరుగనున్న యు.ఎస్.ఓపెన్ కరాటే పోటీలలో పాల్గొనుటకు ఎంపికైనది. [2]&[3]
 2. ప్రస్తుతం విజయవాడలో 9వ తరగతి చదువుచున్న ఈమె, 8 సంవత్సరాలుగా కరాటే సాధనచేయుచూ, అనేకపోటీలలో పాల్గొని, 60 పతకాలు, 100కుపైగా ప్రశంసాపత్రాలు కైవసంచేసుకున్నది. ఆలిండియా కరాటే ఫెడరేషని నిర్వహించే ఛాంపియన్ షిప్ ను సాధించడమే లక్ష్యంగ ఈమె, సాధన చేస్తోంది. [6]
 3. ప్రస్తుతం విజయవాడలో ఇంటరు మొదటి సంవత్సరం (ఎం.పి.సి) చదువుచున్న ఈమె, 2015, సెప్టెంబరు-18 నుండి నిర్వహించనున్న 8వ కామన్ వెల్త్ కరాటే ఛాంపియన్ షిప్ పోటీలలో పాల్గొనుటకు ఎంపికైనది. ఈ పోటీలకు రాష్ట్రం నుండి ఎంపికైన నలుగురిలో ఈమె ఒకరు. ఈమె 2011 లో బ్లాక్ బెల్ట్ సాధించి, పలు జాతీయ అంతర్జాతీయ పోటీలలో పాల్గొంటూ, ఇప్పటి వరకు 60 పతకాలు సాధించగా, వాటిలో 23 స్వర్ణపతకాలే. [9]
 4. ప్రస్తుతం విజయవాడలోని మొగల్రాజపురంలోని శారదా విద్యాసంస్థలలో సీనియర్ ఇంటర్ విద్యనభ్యసించుచున్నఈమె, ఇటీవల మలేషియాలో నిర్వహించిన సైలెంట్ నైట్ ఇంటర్నేషనల్ ఛాంపియన్‌షిప్ పోటీలలో రెండు స్వర్ణ పతకాలు, ఐరోపా‌లో వరల్డ్ కరాటే సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన కరాటే పోటీలలో రజత పతకాన్ని, జాతీయ పాఠశాలల క్రీడలలో కాంస్య పతకాన్ని సాధించింది. ఈమె సాధించిన విజయాలను పురస్కరించుకొని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కల్చరల్ అవేర్‌నెస్ సొసైటీ, అఖిలభారత తెలుగు సాంస్కృతిక సమాఖ్యల ఆధ్వర్యంలో, ఈమెకు స్టేట్ బెస్ట్ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పురస్కారానికి ఎంపికచేసారు. విశాఖపట్నంలోని మద్దిలపాలెం కళాభారతి ఆడిటోరియం తరపున ఈ పురస్కారాన్ని ఇంటర్ పరీక్షల కారణంగా, ఆమె తండ్రి శ్రీ రామోజీకి, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ యతిరాజులు తదితరులు, 2017, మార్చి-13న అందజేసినారు. [11]&[12]

సూరపనేని ప్రణవ్ కృష్ణ[మార్చు]

పెడసనగల్లు గ్రామానికి వెందిన శ్రీ సూరపనేని వెంకటకృష్ణారావు, ఒక విశ్రాంత ఉపాధ్యాయులు. వీరి కుమారుడు శ్రీ సూరపనేని పద్మకిరణ్, కోడలు శ్రీమతి దీప్తి, అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రంలోని సియాటిల్ నగరంలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. ఈ దంపతుల కుమారుడు, 9 సంవత్సరాల వయస్సుగల చి. ప్రణవ్ కృష్ణ, సియాటిల్ నగరంలోని, "సియాటిల్ రాక్ వెల్" అను ప్రాథమిక పాఠశాలలో 3వ తరగతి చదువుచున్నాడు. ఇటీవల వాషింగ్టన్ రాష్ట్రంలోని, "స్పోకెన్" నగరంలో, వాషింగ్టన్ రాష్ట్రస్థాయి-2015 ప్రాథమిక పాఠశాలల చదరంగం పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో ఆ రాష్ట్రంలోని 118 పాఠశాలలనుండి 900 మంది విద్యర్ధులు పాల్గొనగా, 157 మంది 3వ తరగతి విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీలలో పాల్గొన్న చి. ప్రణవ్ కృష్ణ, 10వ స్థానంలో నిలిచాడు. ఈ బాలుడు గత సంవత్సరం తన తాతగారితో కలిసి, "మాతృభూమి శ్రేయో సంఘం" ఆధ్వర్యంలో పెడసనగల్లు గ్రామ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల విద్యార్థులకు బ్యాగులు, పుస్తకాల వితరణ కార్యక్రమంలో పాల్గొన్నాడు. [7]

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3512.[2] ఇందులో పురుషుల సంఖ్య 1796, స్త్రీల సంఖ్య 1716, గ్రామంలో నివాస గృహాలు 1019 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 694 హెక్టారులు.

జనాభా (2011) - మొత్తం 3,290 - పురుషుల సంఖ్య 1,650 - స్త్రీల సంఖ్య 1,640- గృహాల సంఖ్య 1,002

మూలాలు[మార్చు]

 1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Movva/Pedasanagallu". Retrieved 24 June 2016. External link in |title= (help)[permanent dead link]
 2. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-08.

మూస:Http://pedasanagallu.wordpress.com/

వెలుపలి లింకులు[మార్చు]

[2] ఈనాడు కృష్ణా; 2013, ఫిబ్రవరి-28; 14వపేజీ [3] ఈనాడు విజయవాడ; 2014, ఫిబ్రవరి-19; 11వపేజీ. [4] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014, మే-19; 3వపేజీ. [5] ఈనాడు కృష్ణా/మైలవరం; 2014, జూన్-9; 4వపేజీ. [6] ఈనాడు అమరావతి; 2015, మే-18; 37వపేజీ. [7] ఈనాడు అమరావతి; 2015, మే-18; 7వపేజీ. [8] ఈనాడు అమరావతి; 2015, ఆగస్టు-10; 23వపేజీ. [9] ఈనాడు అమరావతి; 2015, సెప్టెంబరు-8; 7వపేజీ. [10] ఈనాడు అమరావతి/పామర్రు; 2016, ఫిబ్రవరి-10; 1వపేజీ. [11] ఈనాడు అమరావతి/పామర్రు; 2017, మార్చి-16; 2వపేజీ. [12] ఈనాడు విజయవాడ, తూర్పు; 2017, మార్చి-18; 1వపేజీ. [13] ఈనాడు అమరావతి/పామర్రు; 2017, మార్చి-20; 2వపేజీ. [14] ఈనాడు అమరావతి/పామర్రు; 2017, ఏప్రిల్-24; 1వపేజీ.