Jump to content

పాలపర్తి శ్యామలానందప్రసాద్

వికీపీడియా నుండి

అవధాని శేఖర పాలపర్తి శ్వామలానంద ప్రసాద్‌ శతావధాని.

జీవిత విశేషాలు

ఆయన గుంటూరు జిల్లా పొన్నూరులో పూర్ణాంబ, వెంకట సుబ్బారావు దంపతులకు అక్టోబరు 3 1957 న జన్మించారు. ఆయన కృష్ణాజిల్లా అవనిగడ్డలో ప్రాథమిక మాధ్యమిక విద్య పూర్తిచేసారు. మండలి బుద్ధప్రసాద్ గారు ఈయన సహాధ్యాయ. ఆయన పొన్నూరు శ్రీ భావనారాయణ స్వామి సంస్కృత కళాశాలలో చదివారు. శ్రీమతి భానుమతిని అర్ధాంగిని చేసుకున్నారు . తెలుగులోనూ, సంస్కృతం లోను ఎం.ఎ పూర్తిచేసి రెంటిలోనూ పి.హెచ్ .డి. సాధించారు. సంస్కృతంలో విశ్వనాధ రాసిన రూపకాలపై పరిశోధన చేసి డాక్టరేట్ పొందారు. విజయవాడ సయ్యద్ అప్పలస్వామి సంస్కృత కళాశాలలో సంస్కృత శాఖాధ్యక్షులుగా పనిచేస్తున్నారు.[1]

రచనలు

తెలుగు రచనలు

  • మనస్సాక్షి మహాభారతం [2]
  • పద్మవంశీ
  • తల్లా పిచ్చయ్య ప్రకాశం
  • ధర్మభిక్ష పద్యకావ్యం
  • జైనధర్మ శతకం
  • వెంకయ్యస్వామి జీవితచరిత్ర
  • కాశీసారం

సంస్కృత రచనలు

  • పంచారామ పంచభూత శివ సుప్రభాతం[3]
  • శ్రీ షిర్డీసాయి సహస్రనామస్తోత్రం[4]
  • శాంతిసూక్తం
  • కాశీలోని శ్రీ విశ్వేశ్వరస్వామిపై సుప్రభాతం

అవధాన ప్రక్రియ

శ్యామలానందప్రసాద్ 1995లో విజయవాడలో "ఏకదిన సంపూర్ణ సంస్కృతాంధ్ర శతావధానం" చేశాడు. తాడికొండ గోగినేని కనకయ్య సంస్కృత కళాశాలలో సంస్కృతావధానం చేశారు. 2013 డల్లాస్ లో జరిగిన 19వతానా సభల్లో’’అవధాన ప్రక్రియ ‘’పై వివరించారు.[5][6] మొత్తం మీద 500 అష్టావధానాలు, మూడు శతావధానాలు చేసాడు. అచ్చ తెలుగులో అవధానం చేయడం ఇతని ప్రత్యేకత.[7]

పురస్కారాలు, బిరుదులు

  • అవధాన కళా సరస్వతి
  • అవధాన శారద
  • శతావధాని శేఖర
  • అవధాన చతురానన
  • తెలుగు విశ్వ విద్యాలయ పురస్కారం
  • 2015 మన్మధ నామ సంవత్సర కళారత్న ఉగాది పురస్కారం - ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే [8]

మూలాలు

  1. "గీర్వణకవుల కవితా గీర్వాణం -3 411-శతావధాని శేఖర శ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్". Archived from the original on 2016-03-05. Retrieved 2016-01-10.
  2. "Books from Author: Palaparthi Syamalananda Prasadsubscribe". Archived from the original on 2016-03-04. Retrieved 2016-01-10.
  3. యూట్యూబ్ లో Panchaarama Pancha Bhootha Siva Suprabhatham written by Palaparthi Syamalananda Prasad, composed by N Suryaprakash, narrated by N Parthasarathy & rendered by Sasikala Swamy, D Surekhamurthi.
  4. యూట్యూబ్ లో షిర్డీసాయి సహస్రనామస్త్రోత్రం - శతావధానిశేఖర పాలపర్తి శ్యామలానందప్రసాద్
  5. "లండన్ లో చరిత్ర సృష్టించిన ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు ఈ వారం కబురు సారంగ లో, OCTOBER 8, 2014". Archived from the original on 2016-08-10. Retrieved 2016-01-10.
  6. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ తానా సభలో సందేశం
  7. Madhusudan, Pamidikalva (2024-06-05). "తొలి అచ్చ తెలుగు అవధానితో ఒక సాయంత్రం". idhatri (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-10-01.
  8. "ఉగాది పురస్కార విజేతలను ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం". Archived from the original on 2016-03-04. Retrieved 2016-01-10.

ఇతర లింకులు