Jump to content

పాలపిట్ట సైక్లింగ్ పార్కు

వికీపీడియా నుండి
పాలపిట్ట సైక్లింగ్ పార్కు
పార్కు ప్రవేశ ద్వారం
రకంపట్టణ పార్కు
స్థానంమాదాపూర్, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ
సమీప పట్టణంహైదరాబాదు
విస్తీర్ణం40 ఎకరాలు
నవీకరణ2017
నిర్వహిస్తుందితెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ
స్థితివాడులో ఉంది

పాలపిట్ట సైక్లింగ్ పార్కు అనేది తెలంగాణ రాష్ట్రం హైదరాబాదులోని బొటానికల్ గార్డెన్స్ సమీపంలో ఉన్న సైక్లింగ్ పార్కు. నగరవాసులకు చిట్టడవిలో తిరుగుతున్న అనుభూతి కలిగించేలా పచ్చని చెట్లతోపాటు ఆహ్లాదకర వాతావరణాన్ని అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలోని తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఈ పాలపిట్ట పార్కును ఏర్పాటుచేసింది.[1] ఇది భారతదేశంలోనే మొట్టమొదటి సైక్లింగ్ పార్కు.

ప్రారంభం

[మార్చు]

2017 నవంబరు 20న రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించాడు.[2] ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ హరిచందన, అటవీ అధికారులు పాల్గొన్నారు.[3]

సదుపాయాలు

[మార్చు]

40 ఎకరాల్లో విస్తీర్నంలో ఉన్న ఈ పార్కులో 3 కిలోమీటర్ల పొడువు సైక్లింగ్ ట్రాక్ తోపాటు 500 సైకిళ్ళు (80 చిన్న పిల్లల సైకిళ్ళు) అందుబాటులో ఉంచారు. చెట్లకు హాని కలుగకుండా సైక్లింగ్ చేసేలా ఈ పార్కును తీర్చిదిద్దారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 6 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 4  నుంచి 7 గంటల వరకు... వారాంతంలో ఉదయం 6 నుంచి 11.30 గంటల వరకు, సాయంత్రం 3 నుంచి 7 గంటల వరకు ఈ పార్కు అందుబాటులో ఉంటుంది. సైక్లింగ్ రుసుము గంటకు పెద్దలకు రూ. 50, చిన్న పిల్లలకు రూ. 25 ఉండగా, నెలవారీ పాస్ కు రూ. 800 ఉంది.[4]

ఇతర వివరాలు

[మార్చు]
  • 2023 జనవరి 30న మూడేళ్ళపాటు ఈ పార్కు నిర్వహణ బాధ్యతలను హైదరాబాద్‌ సైక్లింగ్‌ క్లబ్‌ తీసుకుంది.[5]

మూలాలు

[మార్చు]
  1. Bhavani, Divya Kala (2017-12-14). "Pala Pitta Cycling Park, Kondapur: between sun and earthy trails". The Hindu. ISSN 0971-751X. Archived from the original on 2020-11-09. Retrieved 2023-04-23.
  2. "పాలపిట్ట సైక్లింగ్ పార్క్‌ ప్రారంభించిన కేటీఆర్". Samayam Telugu. 2017-11-20. Archived from the original on 2023-04-23. Retrieved 2023-04-23.
  3. "'పాలపిట్ట పార్క్ దేశానికే ఆదర‍్శం'". Sakshi. 2017-11-20. Archived from the original on 2023-04-23. Retrieved 2023-04-23.
  4. "Pala Pitta Cycling Park". cykul.com. Archived from the original on 2023-04-23. Retrieved 2023-04-23.
  5. "Hyderabad Bicycling Club to maintain Kothaguda's Pala Pitta Cycling Park". The Siasat Daily. 2023-01-30. Archived from the original on 2023-01-30. Retrieved 2023-04-23.