పాలవలస (చీపురుపల్లి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పాలవలస
పత్తికాయ పాలవలస
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా విజయనగరం
మండలం చీపురుపల్లి
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 2,152
 - పురుషులు 1,075
 - స్త్రీలు 1,077
 - గృహాల సంఖ్య 544
పిన్ కోడ్ 535 128
ఎస్.టి.డి కోడ్

పాలవలస, విజయనగరం జిల్లా, చీపురుపల్లి మండలానికి చెందిన గ్రామం.[1] నిజానికి ఈ గ్రామం పూర్తి పేరు పత్తికాయ పాలవలస. ప్రస్తుతం దీన్ని పి. కె. పాలవలస అని పిలుస్తున్నారు.

ఇప్పుడు ఈ గ్రామం చుట్టూ బైరెడ్డిపేట, చిలకరాళ్లబడి, మెట్టబడి, కలిశెట్టిబడి అని చిన్నిచిన్న పేటలు ఏర్పడ్డాయి. ఈ సముదాయాన్నంతటినీ ఒకప్పుడు పాలవలసగానే వ్యవహరిస్తారు.

ఈ గ్రామంలో మెట్టభూములు ఎక్కువ. అంతా వర్షాధారమే. వరి, వేరుశనగ, జనపనార, మిరప ఎక్కువగా పండుతాయి. ఈ మధ్య మొక్కజొన్న సాగు బాగా పెరిగింది.

ఈ గ్రామానికి చేరుకోవాలంటే మండల కేంద్రం చీపురుపల్లి నుంచి రోడ్డు ఉంది. ఆర్టీసీ బస్సులు ఈ గ్రామానికి వచ్చిన దాఖలాలు ఎప్పుడూ లేవు. ప్రజలంతా ప్రవేటు వాహనాలపైనే ఆధారపడుతూ వస్తున్నారు.

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 2,152 - పురుషుల సంఖ్య 1,075 - స్త్రీల సంఖ్య 1,077 - గృహాల సంఖ్య 544

మూలాలు[మార్చు]

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". మూలం నుండి 2016-03-10 న ఆర్కైవు చేసారు. Retrieved 2015-07-27. Cite web requires |website= (help)