పింగళి వెంకట రమణ రావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పింగళి వెంకట రమణా రావు తూర్పుగోదావరిజిల్లా కి చెందిన ప్రసిద్ధ కదా రచయిత ఎలక్ట్రాన్ పేరుతో సుపరిచితులు ఇతని పూర్తి  పేరు పింగళి వెంకట రమణరావు.[1] 1937 డిసెంబరు 15వ తేదీన పెద్దాపురంలో డాక్టర్‌ పింగళి లక్షీనారాయణప్ప, సుబ్బలక్షి దంపతులకు జన్మించారు. ప్రాథమిక, ఉన్నత విద్యాబ్యాసాలు పెద్దాపురంలోనే సాగాయి కళాశాల జీవితం రాజమండ్రిలో సాగింది ఉద్యోగం నిమిత్తం కలకత్తా, జమ్మూ కాశ్మీరు, అహ్మదాబాద్, ముంబయ్ వంటి ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లారు .


రచనలు[మార్చు]

ఇతని కథలు అనామిక, ఆంధ్రప్రదేశ్, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, కథాకేళి, చిత్ర, జ్యోతి, తెలుగు వెలుగు, నవ్య, పత్రిక, పుస్తకం, ప్రియదత్త, యువ, రచన, విపుల, శ్రీలక్ష్మి, స్వాతి మొదలైన వివిధ దిన, వార, మాసపత్రికలలో ప్రచురింపబడ్డాయి.

పుస్తకాలు[మార్చు]

  • జనారణ్యం (జనాభా సమస్యమీద సాధికారిక కథావ్యాసావళి) -2002
  • నేలమీది నక్షత్రాలు (కథా సంపుటి) - 1998
  • ముళ్ల కుర్చీలు (కథా సంపుటి) - 2007
  • విలువల వెల ఎంత? (కథా సంపుటి) - 2006

కథలు[మార్చు]

అంతా దైవేచ్ఛ, అఘాత హృదయుడు, అడ్డురాళ్లు ,అత్యవసర సమావేశం, అమ్మకాని అమ్మ, అర్హత, ఆ రోజు, ఆంత్ర బంధం, ఆర్జకుడి ఆరోగ్యం, ఆవూ సింహమూ, ఇంటికి దీపం, ఇంటికి వెలుగులు, ఈ సూర్యుడు పనికిరాడు, ఊరు కాటేసింది, ఊరుమ్మడి తల్లి, ఏదీ ఊరికే రాదు, ఏరు దాటి , ఒక మొగ్గరాలింది, ఓ గృహిణి కథ, కల, కాష్యకారం, కుర్చీ, కెబిసిద్వితీయ్, కొనుక్కున్న దరిద్రాలు, కౌంక్షిభర్యం, కౌమార జ్వాల, క్రీనీడ క్రీడలు, క్షంతరోషం, క్షౌద్ర మేహం, ఖండిత కనిష్ఠిక, గాలిలో కలం, గుట్టువిప్పిన గడియారం, గొలుసు కంచెలు, గ్రామదేవత, చంద్రలోక యాత్ర, చార్మినార్, చిటికెడు మట్ట, చెంచాలు, చెక్క బొమ్మలు, చెరువు నిండింది, చేతికిచిక్కని నీడలు, చేబదులు     పుస్తకం, జన సాగరం, జిరాక్స్ కాపీలు, తల్లి మనసు, తెరచాటు మనుషులు, తెలుపు నలుపులు, త్రికన్య, దా ఋణం, ది మెర్సీ కిల్లింగ్, దెత్తిపుంత, నడుస్తున్న చరిత్ర, నమ్మకాలు, నీళ్లు-నీళ్లు, నేటి మనసులు, నేను, నేను నీకు మనచ్చానా, నేనెవర్నో తెలిసింది, నేలమీది నక్షత్రాలు, నోరులేని దేవుళ్లు, పరీక్ష, పల్లెనిద్ర, పిల్లలు కొల్లలు, ప్రమాదం, ప్రేమ లేఖ ప్రహసనం, బ్రేక్ కే బాద్, భయం, మంచిచెంచాలు, మంచుశిఖరం, మనసు మర్కటం, మనిషి పగ, మబ్బుచాటు జీవితం, మసక వెన్నెల, ముఖపరీక్ష, ముఖ్యమంత్రి ప్రశ్న, ముళ్లకుర్చీలు, ముష్టిపిల్ల, మూడుముళ్లు, మెలిక  , మెలికస్వామి, మేనమామ, మొక్కు, మోక్షం, యుగధర్మం, రక్తదానం, రైళ్లు-రైళ్లు, లగ్నబలం, లాంఛనాలు, వంశవృక్షం, వయసు చూసి, వరసిద్దులు, వర్షంకురిసినరోజు   , వల, వసుదేవుడు చెరసాల, వాన చినుకులు, విద్యాఘాతము, వృత్తి దాంపత్యాలు, వ్యతిక్రమం, సంచార దీపాలు, సర్వం రవళి, సృష్టి పుస్తకం, స్తువాస్తువా, స్వదేశాగమనం, హస్తాక్షరం

మూలాలు[మార్చు]

  1. Rao, Gollapudi Srinivasa (2010-09-01). "Age no bar". The Hindu. ISSN 0971-751X. Retrieved 2018-08-05.

బయటి లంకెలు[మార్చు]