పిల్లి అనంత లక్ష్మి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పిల్లి అనంత లక్ష్మి

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2014 - 2019
నియోజకవర్గం కాకినాడ గ్రామీణ నియోజకవర్గం

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1999 - 2004
నియోజకవర్గం సంపర

వ్యక్తిగత వివరాలు

జననం 1971
మాధవపట్నం, సామర్లకోట మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు వెంకటస్వామి
జీవిత భాగస్వామి పిల్లి వీర వెంకట సత్యనారాయణమూర్తి (సత్తిబాబు)
సంతానం రాధాకృష్ణ
నివాసం వాకలపూడి

పిల్లి అనంత లక్ష్మి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె కాకినాడ గ్రామీణ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించింది.

రాజకీయ జీవితం

[మార్చు]

పిల్లి అనంతలక్ష్మి తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1999లో అప్పటి సంపర నియోజకవర్గం ఇప్పుడు కాకినాడ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి తిరుమాని సత్యలింగ నాయకర్ పై 17079 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికైంది. ఆమె 2014లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభనలో భాగంగా నూతనగా ఏర్పడ్డా కాకినాడ గ్రామీణ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ పై 9048 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[1]

పిల్లి అనంతలక్ష్మి 2015లో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి సభ్యురాలిగా నియమితురాలైంది.[2]ఆమె 2019లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి కురసాల కన్నబాబు పై 8789 ఓట్ల తేడాతో ఓడిపోయింది. పిల్లి అనంతలక్ష్మి 06 ఫిబ్రవరి 2021న తెలుగుదేశం పార్టీ కాకినాడ గ్రామీణ నియోజకవర్గ ఇంఛార్జ్​గా రాజీనామా చేసింది.[3][4]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (16 May 2014). "ఆంధ్రప్రదేశ్ విజేతలు". Archived from the original on 6 November 2021. Retrieved 6 November 2021.
  2. Sakshi (28 April 2015). "ఫలించిన కల". Archived from the original on 9 January 2022. Retrieved 9 January 2022.
  3. Sakshi (6 February 2021). "టీడీపీ పదవులకు మాజీ ఎమ్మెల్యే దంపతుల రాజీనామా". Archived from the original on 9 January 2022. Retrieved 9 January 2022.
  4. ETV Bharat News (6 February 2021). "మా పదవుల్లో కొనసాగుతాం: పిల్లి అనంత లక్ష్మి". Archived from the original on 9 January 2022. Retrieved 9 January 2022.