పి.నవీన్ రావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పి.నవీన్ రావు

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2 జనవరి 2019 - ప్రస్తుతం
నియమించిన వారు రామ్‌నాథ్‌ కోవింద్‌

వ్యక్తిగత వివరాలు

జననం 1965
నంది మైడారం గ్రామం, ధర్మారం మండలం , పెద్దపల్లి జిల్లా , తెలంగాణ రాష్ట్రం
తల్లిదండ్రులు పి. మురళీధర్‌రావు, విమల
పూర్వ విద్యార్థి ఢిల్లీ యూనివర్సిటీ

పొనుగోటి నవీన్ రావు భారతదేశానికి చెందిన న్యాయమూర్తి. ఆయన 1986 నుంచి న్యాయవాదిగా సొంతంగా ప్రాక్టీసు ప్రారంభించి 2019 జనవరి 2న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించాడు.

జననం, విద్యాభాస్యం[మార్చు]

పి.నవీన్ రావు తెలంగాణ రాష్ట్రం, పెద్దపల్లి జిల్లా, ధర్మారం మండలం,నంది మైడారం గ్రామంలో 1965లో మురళీధర్‌రావు, విమల దంపతులకు జన్మించాడు. ఆయన హైదరాబాద్ నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేసి, 1986లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పూర్తి చేసి అదే సంవత్సరంలో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నాడు.[1]

వృత్తి జీవితం[మార్చు]

పి. నవీన్ రావు న్యాయవాదిగా వివిధ కోర్టుల్లో పనిచేసి 2013 ఏప్రిల్ 12లో అడిషనల్ జడ్జిగా పదోన్నతి అందుకొని, 2014 సెప్టెంబరు 8న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యాడు. ఆయన 2014 జూన్ 2న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తరువాత ఉమ్మడి హైకోర్టులో జడ్జిగా, 2019 జనవరి 2న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణం స్వీకారం చేశాడు.[2][3]

జస్టిస్ పొనుగోటి నవీన్‌ రావును తెలంగాణ హైకోర్టు తాత్కలిక సీజేగా నియమిస్తూ కేంద్ర న్యాయశాఖ  2023 జులై 13న ఉత్తర్వులు జారీ చేశారు.  హైకోర్టు న్యాయమూర్తుల్లో సీనియర్‌గా ఉన్న నవీన్‌రావు కేవలం ఒక్కరోజే ఆ పదవిలో ఉంటారు. ఆయన పదవీ కాలం 2023 జులై 14న పూర్తి కానుండటంతో పదవీ విరమణ చేయనున్నాడు.[4][5][6]

మూలాలు[మార్చు]

  1. Telangana High Court (2019). "HONOURABLE SRI JUSTICE P.NAVEEN RAO". Archived from the original on 19 October 2021. Retrieved 19 October 2021.
  2. Sakshi (2 January 2019). "కొలువుదీరిన కొత్త హైకోర్టు". Archived from the original on 19 October 2021. Retrieved 19 October 2021.
  3. The Times of India (2 January 2021). "13-judge strong Telangana HC will sit from Wednesday" (in ఇంగ్లీష్). Archived from the original on 19 October 2021. Retrieved 19 October 2021.
  4. Eenadu (14 July 2023). "తెలంగాణ హైకోర్టు తాత్కాలిక సీజేగా జస్టిస్‌ పి.నవీన్‌రావు". Archived from the original on 14 July 2023. Retrieved 14 July 2023.
  5. ETV Bharat News (14 July 2023). "Telangana HC Incharge CJ : హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ నవీన్‌రావు". ETV Bharat News. Archived from the original on 14 July 2023. Retrieved 14 July 2023.
  6. Namasthe Telangana (14 July 2023). "హైకోర్టు తాతాలిక సీజేగా జస్టిస్‌ నవీన్‌రావు". Archived from the original on 14 July 2023. Retrieved 14 July 2023.