అక్షాంశ రేఖాంశాలు: 18°44′01″N 79°10′27″E / 18.7337075°N 79.1741302°E / 18.7337075; 79.1741302

మేడారం (ధర్మారం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మేడారం, తెలంగాణ రాష్ట్రం, పెద్దపల్లి జిల్లా, ధర్మారం మండలంలోని గ్రామం.[1]

మేడారం
—  రెవెన్యూ గ్రామం  —
మేడారం is located in తెలంగాణ
మేడారం
మేడారం
అక్షాంశరేఖాంశాలు: 18°44′01″N 79°10′27″E / 18.7337075°N 79.1741302°E / 18.7337075; 79.1741302
రాష్ట్రం తెలంగాణ
జిల్లా పెద్దపల్లి
మండలం ధర్మారం
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 7,625
 - పురుషుల సంఖ్య 3,765
 - స్త్రీల సంఖ్య 3,860
 - గృహాల సంఖ్య 2,111
పిన్ కోడ్ 505416
ఎస్.టి.డి కోడ్

ఇది మండల కేంద్రమైన ధర్మారం నుండి 5 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన కరీంనగర్ నుండి 45 కి. మీ. దూరంలోనూ ఉంది. 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత కరీంనగర్ జిల్లాలో, ఇదే మండలంలో ఉండేది.[2]

గణాంక వివరాలు

[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2111 ఇళ్లతో, 7625 జనాభాతో 1819 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 3765, ఆడవారి సంఖ్య 3860. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1904 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 66. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 572018[3].పిన్ కోడ్: 505416.

గ్రామ చరిత్ర

[మార్చు]

ఈ గ్రామాన్ని నంది మేడారం అనికూడా పిలుస్తారు. ఈ ఊరి దేవాలయంలో బహు ప్రసిద్ధి చెందిన అతిపెద్ద నందీశ్వరుని ఏకశిలా విగ్రహం ఉంది. ఈ నందీశ్వరుని కారణంగా గ్రామం పేరు నంది మేడారంగా ప్రాచుర్యం పొందింది.మేడారం అనగానే.. సమ్మక్క సారలమ్మల క్షేత్రమే గుర్తొస్తుంది. మేడారం చూసినప్పుడల్లా.. గుర్తొచ్చే మరో గ్రామం నందిమేడారం. కాకతీయ సామంతులైన మేడరాజుల పాలనకు సాక్ష్యంగా ఈ ఊరు నిలిచి ఉంది. పొలవాస కేంద్రంగా సాగిన మేడరాజుల పాలనలో ఇది ఓ వెలుగు వెలిగిందంటారు. చరిత్రకు నిలువుటద్దంగా.. అందులకు కేంద్రంగా నిలుస్తున్న నందిమేడారం.. ఎన్నో విశేషాలను తలపించే పల్లెటూరు!

గ్రామ ప్రత్యేకత

[మార్చు]

కాకతీయుల కాలం నాటి 360 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువు. ఊరు మధ్యన బృహత్‌నంది విగ్రహం.. బురుజు.. చెరువు అంచున త్రికూటాలయం..అమరేశ్వరస్వామి దేవాలయం.. ఏళ్లనాటి నాగకన్య విగ్రహం నందిమేడారం చారిత్రిక నేపథ్యాన్ని కళ్లకు కడుతూ.. ఆనవాళ్లుగా నిలిచున్నాయి. కాకతీయులకు సామంతులుగా మేడరాజులు పొలాస (జగిత్యాల) నుంచి నంది మేడారం మీదుగా నర్సంపేట తాలూకా దాక పాలించినట్లు గ్రామస్థులు చెబుతుంటారు.

శ్రమైక జీవుల చెరువు

[మార్చు]

గ్రామంలోని రెండు గుట్టలను కలుపుతూ సుమారు రెండు కిలో మీటర్ల పొడువు కట్టతో 360 ఎకరాల విస్తీర్ణంలో కాకతీయుల కాలం నాడు నిర్మించిన చెరువు, నేటికీ చెక్కుచెదరకుండా ఉంది. ఇది సుమారు 500 ఎకరాల భూములకు పైగా రెండు పంటలకు సాగు నీరు అందించడంతో పాటు చుట్టూ పది గ్రామాల ప్రజల తాగునీటికి ప్రధాన వనరుగా ఉంది. ఈ చెరువు ఆధారంగా 350 మంది మత్స్యకారులు బతుకుతున్నారు. ఇలా వందలాది ఏళ్ల చరిత్ర గల నంది మేడారం పెద్ద చెరువు ఎల్లంపల్లి ఎత్తిపోతల పథకంలో కీలకంగా మారింది. ప్రస్తుతం దీనిని రిజర్వాయర్‌గా మార్చి మొదట ఎల్లంపల్లి నీటిని ఇక్కడికి.. ఇక్కడి నుంచి పైకి ఎత్తిపోస్తున్నారు.

కాకతీయుల కళావైభవం గ్రామంలోని చెరువు కట్టపై తూర్పు చివరిభాగంలో నాటి త్రికూటాలయం కాకతీయుల కళావైభవానికి తార్కాణం. పర్యవేక్షణ కరువై తూర్పు.. దక్షిణ గర్భగృహాలు.. ఉత్తరాన ఉన్న ప్రవేశ మండపం, కూలిపోయిన పడమటి గర్భగృహం.. ప్రధాన మండపం నేటికీ చరిత్రకు ఆనవాళ్లుగా నిలిచి ప్రధాన ఆకర్షణగా కనిపిస్తున్నాయి. 16 స్తంభాలతో కూడిన విశాల మండపం చుట్టూ పిట్టగోడ ఇక్కడ ప్రత్యేకం. ఈ త్రికూటాలయం కళారీతిలో వేయి స్తంభాల గుడిని తలపింపజేస్తున్నది.

వేయిస్తంభాల గుడి పోలిక

[మార్చు]

కాకతీయుల పరిపాలనా చిహ్నంగా శతాబ్దాల క్రితం చెక్కించిన భారీ రాతి నంది విగ్రహం గ్రామంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది. దీని ముందు కాకతీయుల కాలం నాటి శిథిల ఆలయాన్నీ చూడవచ్చు. ఇక్కడే ఉన్న శిలాస్తంభం, నాగినిప్రతిమ, గణపతి, సప్తమాతృకలు విశేషంగా ఆకట్టుకుంటాయి. ఇక నందివిగ్రహమైతే అచ్చంగా హన్మకొండ వేయిస్తంభాల గుడి ముందరి నంది విగ్రహాన్ని పోలి ఉంటుంది. పరిమాణంలోనూ దాదాపు సమానంగా ఉంటుంది. హన్మకొండంలోని విగ్రహం 8 అడుగుల పొడవు, 5 అడుగుల ఎత్తు ఉండగా.. నంది మేడారంలోని విగ్రహం ఏడున్నర అడుగుల పొడవు, 5.8 అడుగుల ఎత్తు ఉందని పరిశీలకులు అంటారు.

కన్య రూపంలో నాగదేవత

[మార్చు]

చెరువు కట్ట అంచున అమరేశ్వర స్వామి ఆలయం వద్ద పురాతన నాగకన్య విగ్రహం ఉంది. ఈ నాగదేవత కన్య రూపంలో దర్శనమివ్వడం విశేషం. శిల్పం పైభాగంలో స్త్రీ రూపంలో.. నాభి నుంచి దిగువకు సర్ప రూపంలో ఉండి తలపై అనేక పడగలు కనిపిస్తాయి. సంతానం లేనివారు ఇక్కడ పూజలు చేస్తే పిల్లలు పుడతారని ప్రజలు విశ్వసిస్తారు. చెరువు కట్టపై అమరేశ్వర స్వామి ఆలయం.. నందిమేడారంతో పాటు వివిధ గ్రామాల భక్తులతో పూజకు నోచుకుంటున్నది.

పది ఊర్లు కనిపించే బురుజు

[మార్చు]

త్రికూటాలయం వెనుక భాగాన బురుజు నేటికీ చెక్కుచెదరకుండా నిలిచి ఉంది. ప్రత్యేక మెట్ల మీదుగా పైకెక్కి చూస్తే చుట్టూ పది గ్రామాలు కనిపిస్తాయి. కొన్ని మైళ్ల దూరం వరకూ రహదారిపై వచ్చే వాహనాలు కనిపిస్తాయి. మేడరాజుల కాలంలో శత్రువుల రాకను పసిగట్టేందుకు ఈ బురుజును నిర్మించినట్లు చరిత్రకారులు చెప్పారు. ఇలా నంది మేడారం చారిత్రికంగానేగాక.. పాడిపంటలతో తులతూగుతూ తనకంటూ ప్రత్యేకస్థానం సంపాదించింది.నంది మేడారంలోని నంది విగ్రహం ఏడున్నర అడుగుల పొడవు, 5.8 అడుగుల ఎత్తు ఉంటుంది.ఈ నందివిగ్రహం అచ్చంగా హన్మకొండ వేయిస్తంభాల గుడి ముందరి నంది విగ్రహాన్ని పోలి ఉంటుంది.

విద్యాసౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ఉంది. బాలుర కొరకు బాలికల కొరకు వేరువేరుగా రెసిడెన్సియల్ పాఠశాలలు ఉన్నాయి. మూడు మాధ్యమిక పాఠశాలలు ఉన్నాయి. పేద విద్యార్థుల కొరకు సాంఘిక సంక్షేమ వసతిగృహం ఉంది.గ్రామంలో రెండుప్రైవేటు బాలబడులు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఆరు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి.సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల పెద్దపల్లిలో ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్ కరీంనగర్లో ఉన్నాయి.సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం పెద్దపల్లిలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల కరీంనగర్ లోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం

[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం

[మార్చు]

మైఆధారంలో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు, ఐదుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. రెండు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.సంచార వైద్య శాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

[మార్చు]

గ్రామంలో4 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు నలుగురు ఉన్నారు. రెండు మందుల దుకాణాలు ఉన్నాయి.

దేవాలయాలు

[మార్చు]

ఊరిలో కల దేవాలయాలు

 • శ్రీ అమరేశ్వరస్వామి దేవాలయము. పెద్దచెరువు కట్టమీద కల ఇది ప్రసిద్ధి చెందిన గ్రామ ప్రధాన దేవాలయము. ఈ ఊరిలోని నంది చాలా పెద్దగా ఉండును.
 • త్రికూటాలయం. ఇది ఒకప్పుడు మంచి దేవాలయమైనా తరువాత పోషణ కరువై శిథిలావస్థలో ఉంది.
 • శ్రీ ఆంజనేయస్వామి దేవాలయము.
 • ఎల్లమ్మ దేవాలయము. (గ్రామదేవత గుడి).
 • పెద్దమ్మ దేవాలయము. (గ్రామదేవత గుడి)
 • గంగాదేవి దేవాలయము. (గ్రామదేవత గుడి).

తాగు నీరు

[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. కుళాయిల ద్వారా శుద్ధి చేయని నీరు కూడా సరఫరా అవుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. చెరువు ద్వారా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.

పారిశుధ్యం

[మార్చు]

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.గ్రామంలో ప్రధానంగా నీటి వనరుగా ఉన్నది పెద్దచెరువు. ఇది పెద్దగా గ్రామానికంటే కూడా ఎక్కువ విస్తీర్ణముతో చేపలు పట్టే వారికి, తాగునీటికి, వ్యవసాయ పనులకు ముఖ్య ఆధారముగా ఉంది.ఈ చెరువు కాక మరో రెండు పెద్ద బావులు మంచినీటి వనరులుగా ఉన్నాయి. శ్రీరాంసాగర్ కాలువ ద్వారా వ్యవసాయ భూములకు నీటి సరఫరా ఉంది.

సమాచార, రవాణా సౌకర్యాలు

[మార్చు]

మైఆధారంలో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. పబ్లిక్ ఫోన్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్ మొదలైనవి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.ఈ గ్రామం దగ్గరలో కల పెద్ద నగరాలైన ధర్మారం నుండి రెండు కిలోమీటర్లు, పెద్దపల్లి నుండి ఇరవై మూడు కిలోమీటర్లు దూరం ఉంది. మేడారం మీదుగా పోయే బస్సు సర్వీసులు.

 • ధర్మారం నుండి పెదపల్లి మీదుగా బస్సు సౌకర్యం ఉంది.
 • ధర్మారం నుండి గోదావరిఖని వైపుగా బస్సులు ఉన్నాయి.

ఇవి కాక ఆటోలు, జీపులు తిరుగుతుంటాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

[మార్చు]

గ్రామంలో వ్యవసాయ పరపతి సంఘం ఉంది. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. సహకార బ్యాంకు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. రోజువారీ మార్కెట్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. సినిమా హాలు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

విద్యుత్తు

[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 15 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

[మార్చు]

మైఆధారంలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

 • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 100 హెక్టార్లు
 • నికరంగా విత్తిన భూమి: 1719 హెక్టార్లు
 • నీటి సౌకర్యం లేని భూమి: 455 హెక్టార్లు
 • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 1264 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

[మార్చు]

మైఆధారంలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

 • కాలువలు: 360 హెక్టార్లు* బావులు/బోరు బావులు: 432 హెక్టార్లు* చెరువులు: 472 హెక్టార్లు

ఉత్పత్తి

[మార్చు]

మైఆధారంలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

[మార్చు]

వరి, మొక్కజొన్న, ప్రత్తి

ఇతర సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో కల ఇతర సౌకర్యాలు-

 • తంతి తపాలా కార్యాలయము.
 • ప్రభుత్వ వైద్యశాల.
 • వ్యవసాయదారుల కొరకు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘము.
 • బెస్తవారి ప్రయోజనాలకొరకు ఏర్పాటు చేయబడీన మత్య పారిశ్రామిక సంఘము.
 • గ్రామంలో నీటి సరఫరా కొరకు మూడు మంచినీటి ట్యాంకులు.

గ్రామంలో ప్రముఖులు

[మార్చు]

గ్రామ అభివృద్ధికి పాటుపడిన,పాటుపడే గ్రామ ప్రముఖులు.

 • మాజి సర్పంచులు
 1. పొనుగోటి గోవింద రావు (మొదటి సర్పంచ్)
 2. పొనుగోటి మురళీధరరావు
 3. పొనుగోటి కమలాకరరావు (దీర్ఘకాలం సర్పంచుగా మరియూ డీసిఎంఏస్ ప్రెసిడెంట్ గా పనిచేసారు)
 4. హరిశంకర్
 5. సింగిరి రవికుమార్ (అతి తక్కువ కాలము సర్పంచుగా పనిచేసారు)
 6. సాన రాయలింగు
 • మాజి జడ్పిటిసి
 1. సింగిరి సాహితి కుమారి
 • మాజి ఎంపిపి
 1. సురకొంటి పారిజాతం
 • ఇతర నాయకులు
 1. లింగాల వెంకట నరసింగరావు (సింగిల్ విండో చైర్మెన్,మండలం కాంగ్రెస్ ప్రెసిడెంట్)
 2. గడ్డం తిరుపతి రెడ్డి
 3. గడ్డం నరసింహ రెడ్డి
 4. సురకొంటి సంతోష్ రెడ్డి
 5. పొనుగోటి నరసింహారావు.
 6. ఫీర్ మహమద్.

గ్రామ విశేషాలు

[మార్చు]
 • ఈ గ్రామంలోని దేవాలయంలో కల నందీశ్వరుని విగ్రహం అతి పెద్దగా ఉండి భక్తి భావం కలిగిస్తుంటుంది.
 • గ్రామ ప్రధాన చెరువైన పెద చెరువు జిల్లాలో పెద్దపరిమాణం గల చెరువుల్లో మూడవది.ఈ చెరువు ద్వారా ఎనిమిది గ్రామాలకు మంచినీటి సరఫరా జరుగుతుంది.

మూలాలు

[మార్చు]
 1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 227  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016   
 2. "పెద్దపల్లి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2022-01-06 suggested (help)
 3. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".

వెలుపలి లింకులు

[మార్చు]