పి.రాజేశ్వర రావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పి.రాజేశ్వర రావు గారు విశాలాంధ్ర దినపత్రిక విజయవాడ హెడ్ ఆఫీసులో మేనేజరుగా పనిచేశారు.పుస్తకాలను జనబాహుళ్యంలోనికి తీసుకుని వెళ్ళడంలో విశేషమైన కృషి చేశారు.

బాల్యం-విద్యాభ్యాసం[మార్చు]

పి.రాజేశ్వర రావు గారు అనంతపురం జిల్లా లోని చీమవాగుల పల్లిలో "పి.వెంగమనాయుడు" "నారాయణమ్మ" లకు జన్మించాడరు. ఈయన తండ్రి పి. వెంగమనాయుడు అనంత పురం జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ కార్య దర్శిగా పని చేసేవారు. వీరు కడు బీదవారు. కమ్యూనిష్ట్ పార్టీ తరపున నెలకు యాబై రూపాయల బత్యం లభించేది . అది కూడా ప్రతినెలా వచ్చేది కాదు. పార్టీకి ఎవరైనా విరాళలిస్తే వీరికి బత్యం వచ్చేది. రాజేశ్వరావు తర్వాత ఇద్దరు తమ్ముళ్ళు ఒక చెల్లి. ఇంత మందికి యాబై రూపాయలు ఏమూలకు సరిపోతుంది? ఆ పరిస్థితుల్లోనే రాజేశ్వరావు గారు నెలకు అర్థరూపాయి పీజుతో వీధి బడిలో విద్యాభ్యాసం చేశారు. అంతటి కష్టాలలోనూ వెంగమనాయుడు తన కొడుకుని పి.యు.సి వరకు చదివించ గలిగారు. ఆతర్వాత వీలు పడలేదు. అందు చేత రాజేశ్వర రావు గారు ఏదైనా పనిచేస్తూ చదువుకోవాలని స్థిరంగా నిశ్చయించుకున్నారు.

ఉద్యోగం[మార్చు]

ఆ సమయంలో కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్య దర్శిగా పనిచేసిన నీలం రాజశేఖర్ రెడ్డి ..... రాజేశ్వర రావు గారి పరిస్థితి గమనించి విజయవాడలోని విశాలాంద్ర ప్రెస్సు స్టోర్ లో పనిలో పెట్టారు. ఇక చదువు కోవచ్చన్న బరోసా దొరికింది. తనకు బి.కాం చదివి ఆ తర్వాత ఎం.బి.ఏ చేయాలని మహా కోరికగా వుండేది. కానీ బి.కాం ఫీజు వంద రూపాయలు, బి.ఏ. కైతే యాబై రూపాయలే. ఆ కారణంగా బి.ఏ.లోనె విజయవాడ సి.వి.ఆర్ సాయంకళాశాలలో చేరి పోయారు రాజేశ్వర రావుగారు. ఉదయం ఏడున్నర నుండి సాయంకాలం ఐదున్నర వరకు ప్రెస్ లో పని. సాయంతం ఆరుగంటలకు కాలేజీలో పాటాలు ఇది అతని దినచర్య. స్వంతంగా గది తీసుకుంటే ఖర్చులు పెరుగు తాయని ప్రెస్సు లోనే అచ్చు యంత్రాల మద్య, కాగితం దొంతర్ల మద్యే నిద్ర. డిగ్రీ చేతి కొచ్చేసరికి ప్రూప్ రీడింగు నేర్చుకుని, టైప్ రైటింగు హైయర్ కూడా పాస్ కాగలిగారు.

ప్రభుత్వ ఉద్యోగము[మార్చు]

అదే సమయంలో అనంత పురంలో కో...ఆపరేటివ్ సూపర్ బజార్ ప్రారంబించారు. అందులో మేనేజర్ గా చేరిపొయారు. కానీ ఆ వుద్యోగం తన తత్వానికి సరిపడలేదు. వ్యాపారస్తులకు తక్కువ ధరలకు వస్తువులు కొని ఎక్కువ వ్రాయవలసి రావడం, దానికి వారు లంచం ఇవ్వ జూపడం, పైవారిని ఏమి చేయలేని స్థితిలో అందులో ఇమడలేక ... ఆ అవినీతి కూపంలోనుండి బయట పడటానికి ఉద్యోగం వదిలేశారు.

తిరిగి విశాలాంద్ర లోకి[మార్చు]

స్వంతంగా ఏదైనా చేయాలని తలచి.... విజయ వాడ ప్రెస్ లో .... తనకున్న పుస్తకాలతో అనుబందం గుర్తుకొచ్చి అనంత పురంలో ఒక పుస్తకాల దుకాణం పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఒక మల్గీని అద్దెకు తీసుకుని విశాలాంద్ర వారితో తనకున్న అనుబంధాన్ని పురస్కరించుకొని పదివేల రూపాయల పుస్తకాలను అప్పుగా ఇవ్వమని లేఖ వ్రాశారు రాజేశ్వర రావుగారు. వ్వక్తిగా ఎలాంటి వాడో విశాలాంద్ర వారికి రాజేశ్వరావు గురించి తెలుసు గనుక, అతని లేఖకు బదులుగా తిరుగు టపాలో ..... తాము అనంత పురంలో తమ శాఖను ఏర్పాటు చేయాలనుకుంటున్నామనీ,.... ఇష్టమైతే అందులోనే మేనేజరుగా చేరమనీ జాబు వ్రాశారు. ఆ విధంగా తాను తీసుకున్న మలిగీలోనే విశాలాంద్ర కార్యాలయం ప్రారంబమైంది.

పుస్తకాల షాపు మేనేజరు అంటే షాపులో కూర్చొని పుస్తకాలు అమ్మడం కాదు.... పుస్తాకాలను జన బాహుళ్యంలోకి తీసుకెళ్ళాలి.... అమ్మకాలను పెంచాలి. కానీ ఎలా?.... ఆలోచిస్తుంటే రాజేశ్వరావు గారికి ఒక రష్యా డాక్టర్ మాటలు గుర్తుకు వచ్చాయి. డాక్టర్ వద్దకు రోగులు రావడం కాదు డాక్టరే రోగుల వద్దకు వెళ్ళాలి అదీ సేవ అంటే. అనీ. అప్పుడు తాను ఏమి చేయాలో బోధ పడింది రాజేశ్వరావుగారికి. పుస్తకం దగ్గరికి పాటకుడు రావడం కాదు....... పుస్తకమే పాటకుని వద్దకు వెళ్ళాలి.... అని. ఆ ప్రయత్నంలో మండల కేంద్రాలలో పెద్ద పంచాయితీలలో పుస్తక ప్రదర్శనాలను ఏర్పాటు చేశారు. దాంతో పుస్తకాల అమ్మకాలు అనూహ్యంగా పెరిగి పోయాయి. ఏడాదికి డెబ్బైఅయిదు వేలు పుస్తకాలు లక్ష్యంగా నిర్దేశించు కుంటే లక్షన్నర పుస్తకాలు అమ్ముడయ్యాయి. ఈ విధంగా తన ప్రతిభకు మెచ్చి విజయవాడ హెడ్ ఆపీసులో అసిస్టెంటు మానేజరుగా పదవి లబించింది. ఆతర్వాతి ఏడాదే మేనేజర్ హోదా కూడా దక్కింది.

పుస్తకాలకు పేరెలా పెట్టాలి?[మార్చు]

పుస్తకంలో విషయం ఎంత బాగున్నా ..... అది చదివితే గాని తెలియదు. అందుచేత పుస్తకానికి అందమైన ముఖ చిత్రం, అవగాహన పెంచే పేరు వుండాలని గ్రహించారు రాజేశ్వరావు గారు. పరుచూరి రాజారాం అనే ఒక రచయిత చాలా కాలం క్రితం ఒక పుస్తకాన్ని అచ్చు వేయించారు. అందులోని విషయం మన శరీరంలోవి అవయవాలు తమ కథను చెప్తున్నట్టుగా సాగు తుంది కథ. ఆ పుస్తకానికి రచయిత పెట్టిన పేరు వైద్య విజ్ఞాన వ్వాసావళీ అని. కానీ ఆ పుస్తకానికి పాటకులనుండి పెద్ద స్పంధన రాలేదు. ఏదో ఒక సందర్బంలో రాజేశ్వరావు గారు పరుచూరి రాజారాం వారింటికి వేళ్ళారు . ఆ పుస్తకం తన కంట బడింది. ఆ పుస్తకం ఎంతవరకు ప్రజల్లోకి వెళ్ళింది కూడ అతనే చెప్పాడు. పుస్తకంలోని విషయం బాగానే వున్నా దాని పేరే బాగోలేదని చెప్పి తాము ఆ పుస్తకాన్ని మళ్ళీ ప్రచురిస్తామని అతన్ని ఒప్పించి దాన్ని తీసుక వచ్చి దాని పేరును అవయవాల ఆత్మ కథలు గా చేర్చి ప్రచురించగా పదిహేను వేల కాపీలు అమ్ముడయ్యాయి. అదీ రాజేశ్వరావు గారి టెక్నిక్.

విశాలాంద్ర వారి కమ్యూనిస్ట్ భావ జాలం[మార్చు]

మొదటి నుండి కమ్యూనిస్ట్ భావజాలము, వామపక్ష పుస్తకాలనే అచ్చువేశేవారు విశాలాంద్ర వారు. కమ్యూనిస్ట్ దేశమైన రష్యా దేశ సాహిత్యాన్ని అనువదించడమే ఈ సస్థకు ప్రధాన ఆదాయ వనరు. కాని సోవియట్ విచ్చిన్నం కావడం, అభ్యుదయవాదం కొంత సన్నగిల్లడం వంటి విషయాలు విశాలాంద్ర భవిషత్తును ప్రశ్నార్థకం చేశాయి. అప్పుడే రాజేశ్వరావు గారు ఒక ముఖ్య నిర్ణయం తీసుకున్నారు. అదేమంటే...... కమ్యూనిస్ట్ సాహిత్యాన్నే కాదు ఇతరుల మంచి సాహిత్యాన్ని స్వీకరించాలి అన్నివర్గాల వారితోనూ మమేకం కావాలి అని తన ప్రతిపాధనను సంస్థల పెద్దల ముందు పెట్టారు. మొదట్లో కొంత వ్వతిరేకించినా తర్వాత ఆమోద ముద్ర పడింది. మరో ప్రతి పాదన..... తమ ముఖ్య కేంద్రాన్ని అన్ని ప్రాంతాలకు అనువైన స్థలం హైదరాబాదుకు తరలించడం.

విస్తరించిన విశాలాంద్ర[మార్చు]

రాజేశ్వరావు గారి ఆలోచనలు అమలయ్యాయి. 1995 లో ఏడాదికి పాతిక పుస్తకాలను మాత్రమే అచ్చు వేయగలిగిన విశాలాంద్ర 1990 నాటికి ఆ సంఖ్య 50కి 2000 కల్లా వందకి పెరిగి ఇంకా పెరుగుతూ ప్రతి మూడు రోజులకొక పుస్తకాన్ని మార్కెట్ లోకి తేగలిగే స్థాయికి చేరింది విశాలాంద్ర. ఏటా 19 లక్షల రూపాయల టర్న్ వోవర్ రెండు దశాబ్దాల్లో నాలుగు కోట్లకు పెరిగింది. కేంద్రాల సంఖ్య 16 పెరిగింది. పుస్తక ప్రచురణ సంస్థ అయిన విశాలాంధ్ర పుస్తకాల ఎంపిక ప్రధాన లక్ష్యమే అయినా సంస్థ పేరుకు మచ్చతెచ్చే వాటి జోలికి పోలేదు. పఠకుల వికాశానికి తోడ్పడే మహా రచయితల ముద్రించడంలో ఎప్పుడు ముందే ఉన్నారు. అందులో భాగంగానే మహా రచయితలైన, శ్రీశ్రీ, జాషువా, కందుకూరి వీరేశలింగం, కుటుంబ రావు మొదలగు వారి రచనలను ప్రచురించారు. ఇంత అభివృద్ధి చెందినా ఆ ఘనత అంతా అంకిత భావంతో పనిచేసే సిబ్బందిదే నంటారు రాజేశ్వర రావుగారు.

పెళ్ళి పిల్లలు[మార్చు]

పెళ్ళి గురించి కచ్చితమైన భావాలున్న రాజేశ్వర రావు గారికి కట్నం ఇవ్వడం, తీసుకోవడం అనేవి రెండు పూర్తిగా గిట్తని వ్వవహారాలు. ఇటువంటి తన భావాలకు ప్రేరణ ప్రముఖ స్వాతంత్ర్య యోధుడు సదాశివన్ గారంటారు రాజేశ్వర రావు గారు. ఆ కాలంలోనే సదాశివన్ గారు కులాంతర వివాహం చేసుకున్నారు. అలాంటి వ్వక్తితో సంబంధ బాందవ్వం కలుపుకోవాలని అతని రెండవ కుమార్తె జ్యోతిర్మయి గారిని పెళ్ళి చేసుకున్నారు. వారికి శైలజ, గౌతమి అను ఇద్దరమ్మాయిలు కలిగారు. సాధారణంగా ఇంట్లోని పెద్ద వారు కుల గోత్రాల పట్టింపు ఎక్కువ. కాని రాజేశ్వర రావు గారి నాయనమ్మ వారి పెళ్ళిని మనస్ఫూర్తిగా ఒప్పుకుంది. ఇంట్లోని పెద్దలలో కూడా ఇలాంటి దృక్పదం వుండడం రాజేశ్వర రావుగారి తండ్రి గారి ప్రభావమె.

జీవితంలో విషాదం[మార్చు]

ఎంతో వున్నత భావాలున్న రాజేశ్వర రావు గారి తండ్రి వెంగమ నాయుడుని దుండగులు మిట్ట మధ్యాహ్నం, నడి రోడ్డుమీద కాల్చి చంపడం ఒక ధారుణం. మరో విషాద సంఘటన తనను అంగ వికలున్ని చేసింది. 1999 నవంబరు 1 న గుంటూరులో వైజాగ్ వెళ్ళాలని రైలు ఎక్కుతుంటే ఆ తోపులాటలో రైలు చక్రాల క్రింద పడిపోయాడు. చనిపోయాడనే అందరూ అనుకున్నారు. చివరిలో తాను బ్రతికే వున్నానని గట్టిగా కేకలు వేసి స్పృహ తప్పి పోయారు. తెలివి వచ్చేసరికి హాస్పిటల్ లో వున్నారు రాజేశ్వర రావుగారు. అప్పుడు తెలిసింది తనకు ఎడమ చేయి, కుడి కాలు పోయాయని. ఈ ప్రమాదం గురించి తెలిసిన శ్రేయోభిలాషులు, రచయితలు ఎందరో వచ్చి పరామర్శించారు. అప్పటి మానవ సంబంధాలలోని ఓ ఉన్నత కోణాన్ని అప్పుడేచూశారు రాజేశ్వర్ రావుగారు. అవయవ లోపమైన ఎప్పటిలాగే పని చేయాలని నిర్ణయించుకున్నారు. తాను హాస్పిటల్ లో వుండగానే ఉధ్వోగులులకు జీతాలిచ్చే రోజు వచ్చింది. తన వలన ఎవరూ బాధ పడకూడ దని పైలు ఆసుపత్రికే తెప్పించుకుని సంతకాలు చేసి సకాలంలో అందరికీ జీతాలు వచ్చేటట్లు చేశారు. కాలుకి కృత్రిమ కాలు అర్చారే కాని ఆ అవకాశం చేతికి వీలుపడలేదు. నలబై రోజులకే ఆసుపత్రినుండి వెళ్ళి పనిలో చేరి పోయారు. ఈ విషాదాన్ని మరిచి పోవాలంటే ఇంకొంత ఎక్కువ సమయం పని చేయాలని నిర్ణయించు కున్నారు రాజేశ్వర రావుగారు. ఆ విధంగా తీరిక లేకుండా పని చేయడం అలవాటు చేసుకున్నారు.

గౌరవాలు[మార్చు]

మూలాలు[మార్చు]

యితర లింకులు[మార్చు]