పి.వి.ఎస్.రావు
పి.వి.ఎస్.రావు | |
---|---|
జననం | బరంపురం, ఒడిశా, బ్రిటిషు భారతదేశం | 1936 జూలై 17
భార్య / భర్త | విజయలక్ష్మి |
తల్లిదండ్రులు | వెంకట సూర్యనారాయణ రామలక్ష్మమ్మ |
పురస్కారాలు | పద్మశ్రీ విక్రం సారాభాయ్ పురస్కారం ఓం ప్రకాష్ భసీన్ పురస్కారం VASVIK పారిశ్రామిక పరిశోధన పురస్కారం CSI వారి జీవన సాఫల్య పురస్కారం IEEE మిల్లెన్నియం పతకం |
పారనంది వెంకట సూర్యనారాయణరావు భారతీయ కంప్యూటర్ శాస్త్రవేత్త. స్పీచ్ రికగ్నిషన్, స్క్రిప్ట్ రికగ్నిషన్ రంగాలలో చేసిన పరిశోధనలకు గాను అతను ప్రసిద్ధి చెందాడు. భారతదేశంలో దేశీయంగా అభివృద్ధి చేసిన మొట్టమొదటి ఎలక్ట్రానిక్ కంప్యూటర్ అయిన TIFRAC అభివృద్ధికి కృషి చేసాడు.[1] IEEE థర్డ్ మిలీనియం మెడల్,[2] విక్రమ్ సారాభాయ్ అవార్డు, ఓం ప్రకాష్ భసీన్ అవార్డు, VASVIK ఇండస్ట్రియల్ రీసెర్చ్ అవార్డు వంటి అవార్డుల గ్రహీత అతను.[3] భారత ప్రభుత్వం 1987 లో ఆయనకునాల్గవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీని ప్రదానం చేసింది.[4]
జీవిత విశేషాలు
[మార్చు]పివిఎస్ రావు ఒడిశా రాష్ట్రంలోని బరంపురంలో పారనంది వెంకట సూర్యనారాయణ,[5] రామలక్ష్మమ్మ దంపతులకు 1936 జూలై 17 న జన్మించాడు..1953లో ఉత్కల్ విశ్వవిద్యాలయం నుండి సైన్స్‌లో పట్టభద్రుడయ్యాడు. 1955 లో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి భౌతికశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీని పొందాడు. రావు 1955లో టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (TIFR)లో కంప్యూటర్ల R&D విభాగంలో చేరాడు. అతను ముంబై విశ్వవిద్యాలయం నుండి కంప్యూటర్ స్క్రీన్‌లపై టెక్స్ట్, గ్రాఫిక్స్ ప్రదర్శనపై చేసిన కృషికి భౌతికశాస్త్రంలో డాక్టరల్ డిగ్రీని పొందాడు.[1]
అతను అక్కడ 43 సంవత్సరాలు పనిచేసాక, 1998 లో పదవీ విరమణ చేసే సమయానికి, అతను సీనియర్ ప్రొఫెసరుగా, కంప్యూటర్ సిస్టమ్స్ అండ్ కమ్యూనికేషన్స్ గ్రూప్ హెడ్‌గా పనిచేస్తున్నాడు.[6] TIFR లో ఉండగా అతను, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ (1972–84) ప్రాజెక్టుకు డైరెక్టరుగా పనిచేశాడు. యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్, భారత ప్రభుత్వంలు సంయుక్తంగా స్పాన్సర్ చేసిన నాలెడ్జ్-బేస్డ్ కంప్యూటర్ సిస్టమ్స్‌పై పరిశోధన ప్రాజెక్టులో కూడా పనిచేసాడు. 1978 నుండి 1982 వరకు అతను స్పీచ్ అండ్ డిజిటల్ సిస్టమ్స్ గ్రూప్‌కు ప్రొఫెసరుగా హెడ్‌గా (తరువాత దీనికి కంప్యూటర్ సిస్టమ్స్ అండ్ కమ్యూనికేషన్స్ గ్రూప్ అని పేరు మార్చారు) ఆ తరువాత సీనియర్ ప్రొఫెసరు, కంప్యూటర్ సిస్టమ్స్ అండ్ కమ్యూనికేషన్స్ గ్రూప్ హెడ్‌గా (1980-98) పనిచేసాడు.[1]
1955లో భారతదేశంలో అభివృద్ధి చేసిన మొట్టమొదటి ఎలక్ట్రానిక్ కంప్యూటర్ TIFRAC అభివృద్ధిలో రావు పనిచేసాడు.[6] 1959 లో దాన్ని ప్రారంభించిన తర్వాత, అతను ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ పరిశోధన కార్యకలాపాలలో పాల్గొన్నాడు. 1962 లో మెమరీ సిస్టమ్‌లకు సంబంధించిన రంగాలలో ప్రారంభించబడిన ILLIAC II అభివృద్ధిలో కృషిచేసాడు.[7] తరువాత, అతను మరొక TIFR కంప్యూటర్ ప్రాజెక్టైన OLDAP అభివృద్ధికి నాయకత్వం వహించాడు.[1] అతనికి టెక్నాలజీ డెవలప్‌మెంట్ కౌన్సిల్‌తో సహా అనేక ప్రభుత్వ సంస్థలతో అనుబంధం ఉంది. భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ కమిషన్ కంప్యూటర్‌లపై వర్కింగ్ గ్రూప్‌కు అధ్యక్షత వహించాడు. [1]
అతను ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్, CMC లిమిటెడ్ బోర్డు పాలక మండలిలో కూడా ఉన్నాడు. అతను కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియాకు అధ్యక్షుడుగా (1980–82), ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌కు చైర్మనుగా (1981–83) పనిచేసాడు. IEICE ట్రాన్సాక్షన్స్ ఆన్ ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ జర్నల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి పత్రికల సంపాదకీయ కమిటీలలో సభ్యునిగా కూడా పనిచేశాడు.[1] అతను ఏన్ ఇంట్రొడక్షన్ టు కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ఇన్ ఫోర్ట్రాన్ అండ్ అదర్ లాంగ్వేజెస్ (1980), బేసిక్ ఎలిమెంటరీ, స్టాండర్డ్ అండ్ ఎన్‌హాన్స్‌డ్ (1989), ట్రెండ్స్ ఇన్ కంప్యూటర్ ఆర్కిటెక్చర్: యాన్ ఇన్-డెప్త్ పెర్స్‌పెక్టివ్ (1991) అనే మూడు పుస్తకాలను రచించాడు. డేటా కన్వర్షన్ ప్రిన్సిపల్స్ అనే పుస్తకంలో ఒక అధ్యాయం రాసాడు.[1]
పురస్కారాలు, సత్కారాలు
[మార్చు]రావు ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, [8] ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ, నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (ఇండియా),[9] కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా, అకౌస్టికల్ సొసైటీ ఆఫ్ ఇండియాలకు ఫెలోగా ఎన్నికయ్యాడు. [1] ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్ లో విశిష్ట సహచరుడు. ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీర్స్ సంస్థలో సీనియర్ సభ్యుడు, విశిష్ట సందర్శకుడు. అతను 1976 లో గుజరాత్‌లోని హరి ఓం ఆశ్రమం నుండి విక్రమ్ సారాభాయ్ అవార్డును అందుకున్నాడు.1987 రావు, లో ఓం ప్రకాష్ భాసిన్ అవార్డు, వివిధ్‌లక్షి ఔద్యోగిక్ సంశోధన్ వికాస్ కేంద్రం నుండి VASVIK ఇండస్ట్రియల్ రీసెర్చ్ అవార్డు, భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ పౌర గౌరవం లను అందుకున్నాడు.[3][4] 2012 లో కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా అతనికి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ పురస్కారం ఇచ్చి సత్కరించింది.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 1.7 "INSA Profile". Indian National Science Academy. 2015. Retrieved 23 August 2015.[permanent dead link]
- ↑ "IEEE Third Millenium Medal Receipients". December 2012.
- ↑ 3.0 3.1 Perspectives in Computer Architecture. PHI Learning Pvt. Ltd. 2015. ISBN 9788120307124. Retrieved 23 August 2015.
- ↑ 4.0 4.1 "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on 17 November 2017. Retrieved 21 July 2015.
- ↑ "Parnandi Venkata Suryanarayana Rao". All Company Data. 2015. Retrieved 23 August 2015.
- ↑ 6.0 6.1 (2015). "TIFRAC, India's first computer - A retrospective".
- ↑ (June 1965). "ILLIAC II-A Short Description and Annotated Bibliography". Archived 2021-11-16 at the Wayback Machine
- ↑ "Indian Academy of Sciences fellow". Indian Academy of Sciences. 2015. Retrieved 23 August 2015.
- ↑ "National Academy of Sciences (India) fellow". National Academy of Sciences (India). 2015. Archived from the original on 15 March 2016. Retrieved 23 August 2015. Archived 15 మార్చి 2016 at the Wayback Machine