పి.సి. మోహన్
పి.సి. మోహన్ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2009 | |||
ముందు | స్థానం స్థాపించబడింది | ||
---|---|---|---|
నియోజకవర్గం | బెంగళూరు సెంట్రల్ | ||
కర్ణాటక శాసనసభ సభ్యుడు
| |||
పదవీ కాలం 1999 – 2008 | |||
ముందు | పి.ఎస్. ప్రకాష్ | ||
తరువాత | హేమచంద్ర సాగర్ | ||
నియోజకవర్గం | చిక్‌పేట్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | బెంగళూరు, మైసూర్ రాష్ట్రం, భారతదేశం | 1963 జూలై 24||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
తల్లిదండ్రులు | పి చిక్కముని స్వామప్ప, | ||
జీవిత భాగస్వామి | శైలా (m. 1991) | ||
సంతానం | రితికా మోహన్ (కుమార్తె), రితిన్ పిఎమ్ (కొడుకు) | ||
నివాసం | 1928, 30వ క్రాస్, 12వ మెయిన్, GK కళ్యాణ మంటప దగ్గర, బనశంకరి 2వ స్టేజ్, బెంగళూరు, కర్ణాటక | ||
వెబ్‌సైటు | [1] | ||
మూలం | [2] |
పి. చిక్కముని మోహన్ (జననం 24 జూలై 1963) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]
జననం, విద్యాభాస్యం
[మార్చు]పి.సి. మోహన్ 1963 జూలై 24న బెంగళూరులో పి.చిక్కముని స్వామప్ప, పి.సి.రామక్క దంపతులకు జన్మించాడు. ఆయన కర్ణాటకలోని బెంగుళూరులోని విజియా కళాశాల నుండి ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు.
రాజకీయ జీవితం
[మార్చు]పి.సి. మోహన్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకియలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1999 కారాన్తక శాసనసభ ఎన్నికల్లో చిక్‌పేట్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి డిపి శర్మపై 20636 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సత్యనారాయణ స్వామిపై 2237 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
పి.సి. మోహన్ 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి హెచ్.టి సాంగ్లియానాపై 35218 ఓట్ల మెజారిటీ తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై పార్లమెంట్‌లో పట్టణాభివృద్ధిపై స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా, కాయిర్ బోర్డు సభ్యుడిగా, ఇతర వెనుకబడిన తరగతుల (OBCలు) సంక్షేమ కమిటీ సభ్యుడిగా పని చేశాడు.
పి.సి. మోహన్ 2014లో కాంగ్రెస్ అభ్యర్థి రిజ్వాన్ అర్షద్‌ను 1,37,500 ఓట్ల తేడాతో ఓడించి రెండోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై పార్లమెంట్‌లో 1 సెప్టెంబర్ 2014 నుండి 25 మే 2019 వరకుహౌసింగ్ మరియు పట్టణ వ్యవహారాల స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా, 15 సెప్టెంబర్ 2014 - 25 మే 2019 వరకు పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్‌మెంట్ స్కీమ్ (MPLADS) సభ్యులపై కమిటీ సభ్యుడిగా, పర్యాటక & సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సలహా కమిటీ సభ్యుడిగా పని చేశాడు.
పి.సి. మోహన్ 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అభ్యర్థి రిజ్వాన్ అర్షద్‌పై 50,000 ఓట్ల మెజారిటీ గెలిచి వరుసగా మూడోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై పార్లమెంట్‌లో విదేశీ వ్యవహారాల స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా, హౌసింగ్ & పట్టణ వ్యవహారాల స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడిగా, ఇతర వెనుకబడిన తరగతుల సంక్షేమ కమిటీ సభ్యుడిగా పని చేశాడు.
పి.సి. మోహన్ 2024లో కాంగ్రెస్ అభ్యర్థి మన్సూర్ అలీ ఖాన్ పై 32707 ఓట్ల తేడాతో ఓడించి నాలుగవసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3]
మూలాలు
[మార్చు]- ↑ ThePrint (11 April 2024). "BJP MP from Bangalore Central PC Mohan eyes 4th straight win in Lok Sabha polls". Archived from the original on 30 July 2024. Retrieved 30 July 2024.
- ↑ TV9 Bharatvarsh. "P C Mohan BJP Candidate Election Result: कर्नाटक P C Mohan Bangalore Central लोकसभा चुनाव 2024 परिणाम". Archived from the original on 30 July 2024. Retrieved 30 July 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Bangalore central". Archived from the original on 30 July 2024. Retrieved 30 July 2024.