పీచుమిఠాయి
![]() | ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
పీచుమిఠాయి అనేది చిన్న పిల్లలు ఇష్టంగా తినే ఒక తీపి పదార్థం. దీనిని అమెరికాలో Cotton candy అని, బ్రిటన్ లో Candy floss అని, ఆస్ట్రేలియాలో Fairy floss అని పిలుస్తారు. దీనిని పంచదారతో తయారు చేస్తారు. ఒక పుల్లకు దీనిని చుట్టి అందిస్తారు. కొన్ని సార్లు పాలిథీన్ సంచులలో పెట్టి అమ్ముతారు. తాజాగా చేసినవే పిల్లలు ఇష్టపడడం వలన అమ్మేవారు వీధుల్లో తిరుగుతూ పిల్లల ఇంటిముందే తయారుచేసి ఇస్తారు. వీటి అమ్మకాలు సర్కస్, జాతర మొదలైన ప్రదేశాలలో ఎక్కువగా కనిపిస్తాయి.
దీనిని తయారు చేయుటకు ఒక చిన్న గుండ్రటి యంత్రమును వాడుతుంటారు. ఇవి తెల్లగా ఉంటాయి. దీని తయారీలో రంగులు వాడనవసరం లేదు. అయితే ఆకర్షణీయంగా కనిపించడం కోసం ఈమధ్య కృత్రిమ రంగులను వాడుతున్నారు కాబట్టి ఇది ఆరోగ్యానికి హానికరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
చరిత్ర[మార్చు]
యంత్రాల ద్వారా పీచు మిఠాయిని తయారుచేయడాన్ని 1897 సంవత్సరంలో విలియమ్ మోరిసన్ (William Morrison), జాన్ సి. వార్టన్ (John C. Wharton) మొదటిసారిగా కనిపెట్టి 1904 ప్రపంచ సంత (World's Fair) లో "Fairy Floss" పేరుతో ప్రవేశపెట్టారు.[1] అప్పుడే అది 68,655 పెట్టెలు అమ్ముడై రికార్డు సృష్టించింది. ఆ కాలంలోనే ఒక్కొక్కటి 25¢ చొప్పున అత్యధిక రేటు పలికింది. Fairy floss పేరు 1920 ప్రాంతంలో "cotton candy"గా మార్చబడింది.[2]
అమెరికా సంయుక్త రాష్ట్రాలలో జాతీయ పీచు మిఠాయి దినోత్సవం (National Cotton Candy Day) డిసెంబరు 7 తేదీన జరుపుకుంటారు.[2]
తయారీ విధానం[మార్చు]
పీచు మిఠాయి తయారీ చూసేందుకు తమాషాగా కనిపిస్తుంది. పొరలు పొరలుగా దాదాపు సాలీడు గూడులానే సన్నని దారాలతో ఉంటుంది. తిరుగుతున్న గుండ్రని ఒక పెద్ద పాత్రలో కొద్దిగా పంచదార వేస్తారు. అంచుల వైపు ఉండే హీటర్ వలన చక్కెర కరిగి, అది డ్రమ్ తిరుగుతున్నప్పుడు సన్నని రంధ్రాల గుండా బయటికి వస్తుంది. వాతావరణంలోని గాలిలో అది ఒక సాలె గూడులాగా డ్రమ్ గోడల చుట్టూ తయారౌతుంది. పొడవాటి కాడతో దానినుండి కావలసినంత పరిమాణంలో చేతిని గుండ్రంగా తిప్పుతూ ఒక బంతి లాగా తయారుచేస్తారు. ఒకసారి చక్కెర కొన్ని సార్లు పనిచేస్తుంది. పరిమాణాన్ని బట్టి అయిపోయాక మరికొంత చక్కెర వేస్తాడు.
గ్యాలరీ[మార్చు]
మూలాలు[మార్చు]
![]() |
విక్షనరీ, స్వేచ్చా నిఘంటువు లో పీచు మిఠాయిచూడండి. |
- ↑ "Cotton Candy". The Straight Dope. 2000-02-07. Retrieved 2011-11-30. CS1 maint: discouraged parameter (link)
- ↑ 2.0 2.1 "Cotton Candy Fun Facts". Archived from the original on 2011-07-08. Retrieved 2010-10-24. CS1 maint: discouraged parameter (link)