పుణ్యభూమి నాదేశం
స్వరూపం
పుణ్యభూమి నాదేశం (1995 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎ. కోదండరామిరెడ్డి |
---|---|
నిర్మాణం | మోహన్ బాబు |
తారాగణం | మొహన్ బాబు , మీనా, శుభశ్రీ, దాసరి నారాయణరావు, బ్రహ్మానందం, అన్నపూర్ణ |
సంగీతం | కె.వి.మహదేవన్ |
ఛాయాగ్రహణం | కె.వి. ఆనంద్ |
నిర్మాణ సంస్థ | శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ |
భాష | తెలుగు |
పుణ్యభూమి నా దేశం 1995 లో విడుదలైన తెలుగు సినిమా. ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించగా, మోహన్ బాబు తన నిర్మాణ సంస్థ శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై నిర్మించాడు. ఇందులో మోహన్ బాబు, మీనా ప్రధాన పాత్రల్లో నటించగా, దాసరి నారాయణరావు, గొల్లపూడి మారుతీరావు, అన్నపూర్ణ, బ్రహ్మానందం, బాబు మోహన్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఇది క్రాంతివీర్ అనే హిందీ చిత్రానికి రీమేక్.
మోహన్ బాబు చిన్న కుమారుడు మనోజ్ ఈ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించాడు. అతను తన చిన్ననాటి భరత్ పాత్రలో నటించాడు.[1]
నటీనటులు
[మార్చు]- భరత్ పాత్రలో మోహన్ బాబు
- స్వాతిగా మీనా
- బంగారయ్యగా దాసరి నారాయణరావు
- బంగారయ్య కుమారుడిగా రాజ్ కుమార్
- శుభశ్రీ
- అన్నపూర్ణ
- బ్రహ్మానందం
- బాబు మోహన్
- గొల్లపూడి మారుతీరావు
- నర్రా వెంకటేశ్వరరావు
- AVS
- ఎం.ఎస్.నారాయణ
- చైల్డ్ భరత్ గా మంచు మనోజ్
పాటలు
[మార్చు]బప్పీలహిరి ఈ సినిమాకు సంగీతం అందించాడు.
- "పదహారేళ్ళ రెడు" (గాయకులు: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్ర )
- "తూరుపులోనా సూర్యుడు" (గాయకులు: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్ర)
- "జై దుర్గా" (గాయకులు: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్ర)
- "అబ్బాయా చెసుకో పెళ్ళి" (గాయకులు: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం)
- "భరత దేశమా" (గాయకులు: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం)
- "టీనేజ్ స్వీటీ బ్యూటీ" (గాయకులు: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్ర)