పురాణం సూర్యనారాయణ తీర్థులు
Jump to navigation
Jump to search
పురాణం సూర్యనారాయణ తీర్థులు | |
---|---|
జననం | పురాణం సూర్యనారాయణ తీర్థులు 1876 గవరవరం, విశాఖపట్నం జిల్లా, ఆంధ్రప్రదేశ్ |
మరణం | 1946 |
ప్రసిద్ధి | తెలుగు, సంస్కృత పండితుడు |
తండ్రి | రామస్వామి |
తల్లి | మంగమ్మ |
పురాణం సూర్యనారాయణ తీర్థులు సంస్కృత, తెలుగు పండితుడు. అవధాని. ఇతడు 1876వ సంవత్సరంలో విశాఖపట్నం జిల్లా గవరవరంలో మంగమ్మ, రామస్వామి దంపతులకు జన్మించాడు.[1] తాతా సుబ్బరాయశాస్త్రి వద్ద వ్యాకరణశాస్త్రం చదివాడు. తిరుపతి వేంకట కవులతో పాటు అనేక పట్టణాలు, గ్రామాలు తిరిగి వారి అవధానాలు చూసి ఇతడు కూడా అవధానాలు చేశాడు. కామేశ్వరి అనే సారస్వత మాసపత్రికకు సంపాదకుడిగా వ్యవహరించాడు. ఇతనికి పురాణతీర్థ, కావ్యతీర్థ అనే బిరుదులు ఉన్నాయి. ఇతని శిష్యులలో పూడిపెద్ది కాశీవిశ్వనాథ శాస్త్రి మొదలైనవారు ఉన్నారు.
రచనలు
[మార్చు]- నాడీ నక్షత్రమాల (పరిష్కర్త)
- కళాపూర్ణోదయము (పింగళి సూరన కావ్యానికి పరిష్కర్త)
- దేవాంగ పురాణము
- శ్రీ యోగవాసిష్ఠము
- శ్రీమదాంధ్రమహాభారతము (పరిష్కర్త)
- రఘూదయం
- ముప్పది యిద్దరు మంత్రుల చరిత్రము
- దేవవ్రత చరిత్రము
- ఆచార్యసూక్తిముక్తావళి
మూలాలు
[మార్చు]- ↑ రాపాక ఏకాంబరాచార్యులు (2016). అవధాన విద్యా సర్వస్వము (1 ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. p. 950.