Jump to content

పూర్వాంచల్ శ్రేణి

వికీపీడియా నుండి

పూర్వాంచల్ శ్రేణి, లేదా తూర్పు పర్వతాలు, ఈశాన్య భారతదేశంలో విస్తరించి ఉన్న హిమాలయాల ఉప పర్వత శ్రేణి . ఇది బ్రహ్మపుత్ర లోయకు దక్షిణంగా ఉంది.

భౌగోళికం

[మార్చు]

పూర్వాంచల్ శ్రేణి లేదా తూర్పు పర్వతాలు హిమాలయాలకు ఉప-పర్వత శ్రేణి. ఇది సుమారు 94,800 చ.కి.మీ. విస్తీర్ణంలో ఉంది. 40 లక్షల మంది జనాభాకు ఈ శ్రేణి నెలవు. నాగాలాండ్, మణిపూర్, త్రిపుర, మిజోరాం కొండలు, కాచర్ జిల్లాలు ఈ శ్రేణిలో భాగం. దానితో పాటు అస్సాం రాష్ట్రం, త్రిపా జిల్లా, అరుణాచల్ ప్రదేశ్‌లోని లోహిత్‌లో కొంత భాగం హాఫ్ లాంగ్ తహశీల్‌లో ఐదవ వంతు ఈ శ్రేణిలో ఉన్నాయి.[1]

ఈ శ్రేణి ఈశాన్య భారతదేశంలోని హిమాలయ వ్యవస్థకు తూర్పు వైపున పొడిగింపు. ఇది, దిహాంగ్ నది లోయ దాటి దక్షిణం వైపు తీవ్రంగా వంగి, మయన్మార్‌ భారతదేశాల సరిహద్దు తూర్పు భాగంలో వ్యాపించింది. పట్‌కాయ్ కొండలు, నాగా హిల్స్, మిజో హిల్స్, మణిపూర్ కొండలు పూర్వాంచల్‌లో భాగం.[1]

భూగర్భ శాస్త్రం

[మార్చు]

పూర్వాంచల్ పర్వతాలు బలమైన ఇసుకరాతితో కూడుకుని ఉంటాయి.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Saikia, Partha (17 February 2019). "Purvanchal Range of Northeast India | Eastern Mountains". NORTH EAST INDIA IN DETAILS. Archived from the original on 12 జూలై 2022. Retrieved 20 May 2020.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

ఇవి కూడా చూడండి

[మార్చు]