Jump to content

పూస

వికీపీడియా నుండి
పుసలు

పూసలు (Beads) అలంకరణలో విస్తృతంగా ఉపయోగించే వస్తువులు. హారంగా తయారుచేయడం కోసం దారం ఎక్కించడానికి అనువుగా వీటికి మధ్యలో నుండి సన్నని రంధ్రం ఉంటుంది. ఈ పుసలు ఒక మిల్లీమీటరు నుండి సెంటీమీటరు కంటే పెద్దవిగా, వివిధ ఆకారాలలో కూడా ఉంటాయి. ఇవి అన్ని వర్ణాలలోను ఉంటాయి.

పూసల్ని గిరిజనుల నుండి ఆధునిక యువతుల వరకు అందరూ వ్యక్తిగత అలంకారానికి, వివిధ గృహోపకరణాలలో ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి, దుస్తులు, పాదరక్షలు, పరదాలలో ఇలా చాలా విధాలుగా మన దైనందిన జీవితంలో భాగంగా ఉన్నాయి. అబాకస్లో ఉపయోగించేవి కూడా కొన్ని పూసలు.

పుసలు ఎక్కువగా గాజు, ప్లాస్టిక్, రాళ్ళుతో తయారుచేస్తారు. కానీ కొన్ని రకాల పూసలు ఎముక, కొమ్ము, దంతం, లోహాలు, ముత్యాలు, మట్టి, పింగాణీ, లక్క, కర్ర, కర్పరాలు, విత్తనాలు మొదలైన చాలా రకాల పదార్ధాలతో తయారుచేస్తారు. చెట్ల విత్తనాలైన రుద్రాక్షలు మనం పూసల రుద్రాక్ష మాలగా ధరిస్తున్నారు. అయితే అన్నింటిలోకి గాజు పూసలకే ఆదరణ అధికం.

పూసల్ని వివిధ కళారూపాలలో, చేతిపనులలో ఉపయోగిస్తారు. పూసల్ని గుచ్చడానికి ప్లాస్టిక్ లేదా నైలాన్ దారాన్ని ఉపయోగించి గుచ్చుతారు. ఆభరణాలలో అయితే బంగారు లోహపు తీగతో గుచ్చి రాలిపోకుండా ముడివేస్తారు.

భాషా విశేషాలు

[మార్చు]

పూస [ pūsa ] pūsa. తెలుగు n. A bead, మణి. A joint of a finger, వ్రేలులోనగువాని కీలు. A bit or piece. వెన్నుపూసలు the joints of the backbone. ముడ్డిపూస the rump, os coccyx. "చిటివేలి పూసపై ఘటియిల్లు పెడకట్టి చిమ్ముల నురియడాల్ముమ్మరముగ." A. vi. 104. వెన్నపూస a bit of butter, i.e., butter. "పుట్టనియట్టి బిడ్డలకు పూసలు కట్టుదు రమ్మలక్కలు." (Ahalya. iii. 63.) women call for necklaces for their children before they are born, i.e., they count the chickens before they are hatched. పూసగ్రుచ్చిన రీతి (KP. iv. 193.) in regular order. పూసకజ్జెము pūsa-kajjemu. n. The sweetmeat called maccaroons. పూస కామంచి గడ్డి or పూసల కామంచి గడ్డి pūsa-kāmanchi-gaḍḍi. n. A kind of కామంచి. పూస గురువెంద pūsa-guruvenda. n. A kind of head. గుంజాలత. పూసయొమ్ము or పూసయెముక the back bone, వెన్నుపూస. "చేదోయి కురుచయై చెవులు నిల్వంకలై పూసయెమ్ముకలు పొంచుకట్టి." Kāsi Khānd. vi. 48. పూసలవాడు pūsala-vāḍu. n. One who sells beads, one who polishes precious stones, రత్నములు సానపెట్టువాడు.

ప్రత్యేకమైన పూసలు

[మార్చు]

వింటేజ్ పూసలు

[మార్చు]

వింటేజ్ ("Vintage") పూసలు సంగ్రహకులకు ప్రత్యేక ఆకర్షణ. ఏ రకమైన పూసలైనా 25 సంవత్సరాల కంటే పురాతనమైతే వాటిని వింటేజ్ పూసలుగా పరిగణిస్తారు. ఇవి ఎక్కువగా ప్లాస్టిక్, స్ఫటికాలు, గాజుతో తయారైవుంటాయి.

సాంప్రదాయక పూసలు

[మార్చు]
చెక్కబడిన సినబార్ లక్క పూసలు

పశ్చిమ ఆఫ్రికాలో కిఫ్ఫా పూసలు, గాజు పొడి పూసలు లాంటివి సాంప్రదాయకమైనవి. టిబెటన్లు కంచూ పూసలు ఉపయోగిస్తారు. భారతదేశంలోని రుద్రాక్ష పుసలు (Rudraksha beads) కూడా ఒక ఉదాహరణ. వీటిని బౌద్ధులు, హిందువులు జపమాలగా ఉపయోగిస్తారు. మగతమ పూసలు సాంప్రదాయక జపనీస్ పూసలైతే సినబార్ లక్కతో చేసిన పుసలు చైనాలో ఉపయోగిస్తారు. కొన్ని రకాల జీవుల కర్పరాలతో చేసిన పూసలు ఉత్తర అమెరికా తెగలవారు ఉపయోగిస్తారు.[1]

మూలాలు

[మార్చు]
  1. Dubin, Lois Sherr. North American Indian Jewelry and Adornment: From Prehistory to the Present. New York: Harry N. Abrams, 1999: 170-171. ISBN 0-8109-3689-5.
"https://te.wikipedia.org/w/index.php?title=పూస&oldid=4195861" నుండి వెలికితీశారు