పెద్ద ఉప్పర పల్లి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పెద్ద ఉప్పర పల్లి, చిత్తూరు జిల్లా, సోమల మండలానికి చెందిన గ్రామము.[1]

పెద్ద ఉప్పర పల్లి
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా చిత్తూరు
మండలం సోమల
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం
 - పురుషుల 3,739
 - స్త్రీల 3,752
 - గృహాల సంఖ్య 1,769
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

గ్రామ విశేషాలు[మార్చు]

ఈ గ్రామము .... చుట్టూ అడవి మయమైన కొండలు కోనల మద్యన ఉంది. ఈ గ్రామ సమీపమునందు ఎత్తైన ఒక పర్వతము ఉంది. దాని కొండ కొన యందు ఒక పురాతనమైన ఒక చిన్న కోట ఉంది. అది కొండ కొనన వున్నందున అక్కడికి చేరుట దుర్లభము. దాని పేరు దుర్గము. ఆ కొండ కొన క్రింద ఒక సహజంగా ఏర్పడిన ఒక గుహలో చిన్న శివాలయము ఉంది. ఆ చుట్టు ప్రక్కల గతంలో ఆ నాటి పాలకుల నివాసములు, వారి గుర్రపు శాలలు, పశువుల శాలలు నామ మాత్రముగా మిగిలి యున్నవి. గుప్త నిధుల కొరకు ఈ ప్రాంతములు ముష్కరులు అనేక ప్రదేశములలో త్రవ్వకాలు జరిపి పురాతన కట్టడాలకు నష్టము కలుగ జేశారు. ఈ కొండ కొన నుండి చిన్న నీటి కాలువ ఉంది. అది కొండ క్రింద వున్న ఒక చెరువుకు కలుపబడి యున్నది. అక్కడ పొలాల మద్య ఒక పురాతన మైన చిన్న ఆలయమున్నది. ఈ ప్రాంతపు చరిత్ర ఎక్కడా గ్రంథస్తమయి వున్నట్లు కనుపించదు. సోమల తర్వాత ఈ మండలములో ఇదే ప్రముఖ ప్రాంతము.

గ్రామ జనాభా[మార్చు]

జనాభా (2011) - మొత్తం 7,491 - పురుషుల 3,739- స్త్రీల 3,752 - గృహాల సంఖ్య 1,769
జనాభా (2001) - మొత్తం 6,983 - పురుషుల 3,536 - స్త్రీల 3,447 - గృహాల సంఖ్య 1,549

రవాణా సౌకర్యము[మార్చు]

ఈ గ్రామమునకు రోడ్డు రవాణా బస్సులు నిత్యము తిరుగు తుంటాయి. ఇక్కడి నుండి తిరుపతి, చిత్తూరు, బెంగళూరు మొదలగు ప్రాంతాలకు నేరుగా బస్సు సౌకర్యము ఉంది.

విద్యా సౌకర్యాలు[మార్చు]

ఈ గ్రామములో ఒక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉంది. మరియు ఒక ప్రాథమిక పాఠశాల ఉంది.

ప్రథాన పంటలు[మార్చు]

ఈ గ్రామములో ప్రధానమైన పంటలు వరి, చెరకు, టమాట, మామిడి మొదలగునవి. ఇక్కడి ఎక్కువగా వ్వవసాయ దారులు నివసిస్తారు. చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా ఇక్కడ నివసిస్తున్నారు.

మూలాలు[మార్చు]

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". మూలం నుండి 2014-09-13 న ఆర్కైవు చేసారు. Retrieved 2015-09-01. Cite web requires |website= (help)