పెళ్ళానికి ప్రేమలేఖ ప్రియురాలికి శుభలేఖ
పెళ్ళానికి ప్రేమలేఖ ప్రియురాలికి శుభలేఖ (1992 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | రేలంగి నరసింహారావు |
---|---|
తారాగణం | రాజేంద్ర ప్రసాద్, వైదేహి |
సంగీతం | ఎం. ఎం. కీరవాణి |
నిర్మాణ సంస్థ | శ్రీ నళిని క్రియెషన్స్ |
భాష | తెలుగు |
పెళ్ళానికి ప్రేమలేఖ ప్రియురాలికి శుభలేఖ 1992 లో వచ్చిన కామెడీ చిత్రం. శ్రీ నళిని సినీ క్రియేషన్స్ నిర్మాణ సంస్థ [1] లో వడ్డే నవీన్ నిర్మించాడు. రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించాడు.[2] ఇందులో రాజేంద్ర ప్రసాద్, శ్రుతి, నందిని నటించగా, జెవి రాఘవులు సంగీతం సమకూర్చాడు.[3] ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్గా నమోదైంది.[4]
కథ
[మార్చు]రాజా (రాజేంద్ర ప్రసాద్) తన భార్య కీర్తి (శ్రుతి) ని ఎంతో ప్రేమించే నమ్మకమైన భర్త. కీర్తి చాలా సరళమైనది. అంకితభావంతో ఉన్న భార్య, ఆమె జీవితం పూర్తిగా తన భర్త చుట్టూనే తిరుగుతుంది. రాజా కీర్తిల అనుబంధం కొత్త దంపతుల మాదిరిగానే ఉంటుంది. వారు ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. అది ఎప్పటికీ అలాగే ఉంటుందని వారి నమ్మకం. రాజా, స్వాతి (నందిని) అనే అందమైన అమ్మాయిని కలిసే వరకూ అలాగే నడిచింది. ఆమె ఆధునిక మహిళ అని, ఆమె ఆలోచనలు చాలా ఆధునికంగా ఉన్నాయని రాజాకు నిజంగా ఇష్టం. తనకు పెళ్ళైందనే సంగతి ఆమెకు చెప్పకుండా అతను నెమ్మదిగా ఆమెను ఇష్టపడతాడు. రాజా తన భార్య, కొత్తగా దొరికిన స్నేహితురాలు మధ్య తిరుగుతూ, వాళ్ళకు అనుమానం కలక్కుండా తీవ్రంగా ప్రయత్నిస్తాడు. కానీ చివరికి, కీర్తి నిజం తెలుసుకుని, తన భర్త ఉంపుడుగత్తెను ఎదుర్కోడానికి వెళుతుంది. కానీ, ఆమె తన కాలేజీ స్నేహితురాలు స్వాతి అని తెలుస్తుంది. కాస్త ప్రశాంతత పొందిన తరువాత, అతడు తమకు ద్రోహం చేసాడని ఇద్దరూ భావిస్తారు. రాజాకు ఒక పాఠం నేర్పించాలని నిర్ణయించుకుంటారు. కాబట్టి, వారు నిజం తెలియదని నటిస్తూ, వారు అదే విధంగా వ్యవహరిస్తారు. కీర్తి స్వాతి యొక్క ప్రణాళిక అమలులోకి పడతారు. రాజా రెండు సంబంధాలను కొనసాగించడంలో ఉండే ఒత్తిడి అనుభవం లోకి వస్తుంది. రాజా, కీర్తి స్వాతి ల ఈ అసాధారణ సంబంధానికి ఏమి జరుగుతుందో మిగతా కథ వెల్లడిస్తుంది.
తారాగణం
[మార్చు]- రాజాగా రాజేంద్ర ప్రసాద్
- కీర్తిగా శ్రుతి
- స్వాతిగా నందిని
- లక్ష్మణరావుగా బ్రహ్మానందం
- దుష్యంతుడుగా బాబు మోహన్
- సన్నస్సీగా గుండు హనుమంతరావు
- ఇన్స్పెక్టర్గా కాశీ విశ్వనాథ్
- ఖాన్ సాబ్ పాత్రలో కృష్ణ చైతన్య
- లక్ష్మణరావు భార్యగా శ్రీలక్ష్మి
- దుష్యంతుడి భార్యగా పాఖీజా
- దుష్యంతుడి భార్యగా చంద్రిక
పాటలు
[మార్చు]సం. | పాట | పాట రచయిత | గాయనీ గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "పక్కేసి ఉంచుకో" | వేటూరి సుందరరామమూర్తి | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర | 4:04 |
2. | "బాతురూములో" | వేటూరి సుందరరామమూర్తి | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర | 3:59 |
3. | "వన్ టీ త్రీ" | వేటూరి సుందరరామమూర్తి | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర | 4:49 |
4. | "అల్లిబిల్లి" | సాహితి | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర | 3:44 |
5. | "కట్టుకున్నవాడే" | వేటూరి సుందరరామమూర్తి | చిత్ర, ఎస్.పి. శైలజ | 5:18 |
6. | "కన్నుగొట్టి రా" | సాహితి | మనో, ఎస్.పి. శైలజ, రమణి | 4:51 |
మొత్తం నిడివి: | 26:45 |
మూలాలు
[మార్చు]- ↑ "Pellaniki Premalekha Priyuraliki Subhalekha (Banner)". Chitr.com.[permanent dead link]
- ↑ "Pellaniki Premalekha Priyuraliki Subhalekha (Direction)". Filmibeat.
- ↑ "Pellaniki Premalekha Priyuraliki Subhalekha (Cast & Crew)". moviefone. Archived from the original on 2016-06-05. Retrieved 2020-08-26.
- ↑ "Pellaniki Premalekha Priyuraliki Subhalekha (Review)". The Cine Bay. Archived from the original on 2018-10-13. Retrieved 2020-08-26.