పిచ్చుక
పిచ్చుక | |
---|---|
ఇంటి పిచ్చుక | |
Scientific classification | |
Kingdom: | |
Phylum: | |
Class: | |
Order: | |
Family: | పేసరిడే ఇల్లిగర్, 1811
|
ప్రజాతి | |
పిచ్చుక (ఆంగ్లం Sparrow) ఒక చిన్న పక్షి.
నిజమైన పిచ్చుకలు పేసరిఫార్మిస్ క్రమంలో పేసరిడే కుటుంబానికి చెందిన చిన్న పక్షులు. ఇవి సాధారణం చిన్నగా బొద్దుగా గోధుమ-ఊదా రంగులో ఉండి చిన్న తోకతో పొట్టిగా ఉండే బలమైన ముక్కు కలిగివుంటాయి. వివిధ జాతుల మధ్య భేదాలు అల్పంగా ఉంటాయి. పిచ్చుకలు ముఖ్యంగా గింజలను తింటాయి, కొన్ని చిన్న చిన్న క్రిమి కీటకాలను కూడా తింటాయి. గల్స్ లేదా కొండ పిచ్చుకలు పట్టణాలలో నివసించి ఏదైనా తింటాయి. ఇవి Chestnut Sparrow (Passer eminibey) 11.4 సె.మీ. (4.5 అంగుళాలు), 13.4 గ్రా., నుండి Parrot-billed Sparrow (Passer gongonensis), at 18 సె.మీ. (7 అంగుళాలు), 42 గ్రా. (1.5 oz) మధ్యలో ఉంటాయి. పిచ్చుకలు శరీర నిర్మాణంలో ఇతర గింజలను తినే పక్షుల లాగే ఉండి, పృష్ఠ బాహ్య ఈకలు అవశేషాలుగా మారతాయి, నాలుకలో ఒక ఎముక అధికంగా ఉంటుంది.[1]
ఈ నిజమైన ప్రాచీన పిచ్చుకలు యూరప్, ఆఫ్రికా, ఆసియాలో విస్తరించాయి. ఆస్ట్రేలియా, అమెరికా ఖండాలలో విస్తరించి, పట్టణాలలో బాగా స్థిరపడ్డాయి. అమెరికా పిచ్చుకలు లేదా ఆధునిక పిచ్చుకలు వీనికి కొన్ని పోలికలున్నా, చాలా భిన్నమైనవి. ఇవి ఎంబరిజిడే కుటుంబానికి చెందినవి. ఇలాగే హెడ్జ్ పిచ్చుక లేదా డన్నక్ (Prunella modularis) కూడా అసలు పిచ్చుకలకు సంబంధించినది కాదు.
జీవనశైలిలో పెనువేగంగా వచ్చిన మార్పే 'పిచ్చుకపై బ్రహ్మాస్త్రం'గా పరిణమించింది. పిచ్చుక జాతి అంతరించనుంది. శరవేగంగా పట్టణీకరణ, అంతరిస్తున్న పచ్చదనం, రసాయనాలతో పళ్లు, ఆహార ధాన్యాల ఉత్పత్తి. పిచ్చుకలు అంతరించిపోవడానికి కారణాలు. సెల్యూలర్ టవర్లు నుంచి వెలువడే అయస్కాంత తరంగాలు ఆ జాతికి ముప్పుగా పరిణమించాయి. కృత్రిమమైన పిచ్చుకగూళ్లను ఏర్పాటు చేయడం ద్వారా పిచ్చుక జాతిని కొంతవరకు సంరక్షించవచ్చని శాస్త్రవేత్తల సలహా.[2] గతంలో ఊర పిచ్చుకలు పల్లెటూర్లల్లో విరివిగా వుండేవి. రైతులు పిచ్చుకల ఆహారం కొరకు వరి కంకులను గుత్తులుగా కట్టి ఇంటి చూరుకు వేలాడ దీసె వారు. ప్రస్తుతం పంటలు లేక పిచ్చుకలకు ఆహారం కరువై ఇంకా అనేక కారణాల వలన పల్లెల్లో అవి కనబడడం లేదు. ఆ జాతి క్షీణ దశలో వున్నటు గ్రహించ వచ్చు. నిజమైన పిచ్చుకలో ఇంచుమించు 35 జాతులున్నాయి. ఈ దిగువన పేర్కొన్నవి పూర్తి జాబితా.
-
సుడాన్ బంగారు పిచ్చుకలు, ఇక్కడ సుడాన్ యొక్క ఎర్ర సముద్ర తీరంలో కనిపిస్తాయి, ఇవి సంతానోత్పత్తి కాలం వెలుపల ఎక్కువగా ఉంటాయి.
-
జార్జియాలోని బటుమీలో నల్ల సముద్రం దగ్గర నీటి స్నానం చేస్తున్న ఇంటి పిచ్చుకలు
భాషా విశేషాలు
[మార్చు]పిచ్చిక [ piccika ] or పిచ్చుక pichhika. తెలుగు n. A sparrow. పిచ్చికకుంటు, పిచ్చికుంటు, పిచ్చుకకుంటు,లేక, పిచ్చుకుంటు one who hops like a sparrow, i.e., a lame man; a cripple. అనూరుడు, కాళ్లులేనివాడు; a beggar, బిచ్చమెత్తువాడు. వెదురుపిచ్చిక, కొండపిచ్చిక, చెరుకుపిచ్చిక, ఊరపిచ్చుక, పొదపిచ్చిక, పేదపిచ్చుక are different species. పిచ్చికగోళ్లు pichchika-gōḷḷu. n. "Sparrow's claws." A sort of grain. H. iv. 156. పిచ్చికమీను pichchika-mīnu n. A flying fish, Exocetus volitans. పిచ్చుకకాలు piṭsṭsuka-kālu. n. A kind of grass.
వర్గీకరణ ప్రకారం జాతుల జాబితా
[మార్చు]- Passer, నిజమైన పిచ్చుకలు
- Saxaul Sparrow, Passer ammodendri
- ఇంటి పిచ్చుక, Passer domesticus
- స్పానిష్ పిచ్చుక, Passer hispaniolensis
- సింద్ పిచ్చుక, Passer pyrrhonotus
- సొమాలి పిచ్చుక, Passer castanopterus
- Cinnamon Sparrow or Russet Sparrow, Passer rutilans
- Pegu Sparrow or Plain-backed Sparrow, Passer flaveolus
- మృత సముద్ర పిచ్చుక, Passer moabiticus
- Rufous Sparrow, Passer motitensis
- Socotra Sparrow, Passer insularis
- Iago Sparrow or Cape Verde Sparrow, Passer iagoensis
- కేప్ పిచ్చుక or Mossie, Passer melanurus
- Grey-headed Sparrow, Passer griseus
- Swainson's Sparrow, Passer swainsonii
- చిలుక ముక్కు పిచ్చుక, Passer gongonensis
- Swahili Sparrow, Passer suahelicus
- Southern Grey-headed Sparrow, Passer diffusus
- ఎడారి పిచ్చుక, Passer simplex
- చెట్టు పిచ్చుక, Passer montanus
- సూడాన్ బంగారు పిచ్చుక, Passer luteus
- అరేబియన్ బంగారు పిచ్చుక, Passer euchlorus
- en:Chestnut Sparrow, Passer eminibey
- ఇటాలియన్ పిచ్చుక, Passer italiae
- Kenya Rufous Sparrow, Passer rufocinctus
- Kordofan Rufous Sparrow, Passer cordofanicus
- Shelley's Rufous Sparrow, Passer shelleyi
- ఆసియన్ ఎడారి పిచ్చుక, Passer zarudnyi
- Petronia, the rock sparrows
- Yellow-spotted Petronia, Petronia pyrgita
- Chestnut-shouldered Petronia, Petronia xanthocollis
- Yellow-throated Petronia, Petronia superciliaris
- Bush Petronia, Petronia dentata
- Rock Sparrow, Petronia petronia
- Carpospiza, Pale Rockfinch
- Pale Rockfinch, Carpospiza brachydactyla
- Montifringilla|, the snowfinches
- White-winged Snowfinch, Montifringilla nivalis
- Black-winged Snowfinch, Montifringilla adamsi
- White-rumped Snowfinch, Montifringilla taczanowskii
- Père David's Snowfinch, Montifringilla davidiana
- Rufous-necked Snowfinch, Montifringilla ruficollis
- Blanford's Snowfinch, Montifringilla blanfordi
- Afghan Snowfinch, Montifringilla theresae
- Tibetan Snowfinch, Montifringilla henrici
ప్రపంచ పిచ్చుకల దినోత్సవం
[మార్చు]ప్రతి సంవత్సరం మార్చి 20న ప్రపంచ పిచ్చుకల దినోత్సవం జరుపుకుంటారు. పిచ్చుకలు ఒకనాడు పంట చేలల్లో, పల్లె ముంగిళ్లలో, ధాన్యపు రాశుల్లో కిలకిలమంటూ సందడి చేసేవి. నాడు గ్రామాల లోని ఇళ్ల ముంగిట ఇవి గుంపులుగా వాలడం ఏదో అలికిడి అవగానే తుర్రుమని ఎగరడం వంటి దృశ్యాలు సందడిగా చూడముచ్చటగా ఉండేవి. ఇవి దిగుడు బావులలోకి వేలాడుతున్న చెట్లపై కట్టుకున్న గూళ్లు చాలా అద్భుతంగా ఉండేవి. ఇవి పూరిళ్ల చూరులలో గూళ్లు కట్టుకొని జనావాసాలతో మమేకమై ఉండేవి. మానవుడు పెంచుకుంటున్న సాంకేతిక పరిజ్ఞానం వీటి మనుగడకు శాపంగా మారింది. సెల్ తరంగాల రేడియేషన్, కాలుష్యం కారణంగా ఇవి ప్రకృతి నుంచి కనుమరుగవుతున్నాయి. జనావాసాలతో మమేకమై జీవిస్తున్న వీటి విషయాలలో ఇవి మెత్తని పీచు వట్టి వాటితో గూడు కట్టడం, గుడ్లను పొదగడం, నోటితో ఆహారాన్ని తెచ్చి పిల్లలకు అందించటం, ఆ పిల్లలు రెక్కలొచ్చి ఎగిరెంత వరకు జాగ్రతగా కాపాడటం మనకు తరచూ కనిపించే దృశ్యాలు, ఈ దృశ్యాలు తల్లి ప్రేమకు నిదర్శనంగా నిలుస్తాయి. ఇటువంటి ఆదర్శవంతమైన పిచ్చుకల అన్యోన్యతను గుర్తించిన ప్రపంచ దేశాలు ప్రతి సంవత్సరం మార్చి 20 న ప్రపంచ పిచ్చుకల దినోత్సవమును నిర్వహిస్తున్నాయి. ఈ పిచ్చుకల ప్రాధాన్యతను గుర్తించిన భారత ప్రభుత్వం తపాలా బిళ్లను కూడా విడుదల చేసింది. జనావాసాల మధ్య నివసిస్తున్న పిచ్చుకల మనుగడకు ప్రమాదం ఏర్పడితే అది మానవ మనుగడకు ఎందుకు ప్రమాదం కాదు అని గుర్తించిన ప్రపంచ దేశాలు "ప్రపంచ పిచ్చుకల దినోత్సవము" నాడు పిచ్చుకల మనుగడకు అవసరమైన ప్రాధాన్యత అంశాలపై చర్చించి అందుకు అవసరమైన కార్యక్రమాలను చేపడుతున్నాయి.
మూలాలు
[మార్చు]- ↑ Bledsoe, A.H.; Payne, R.B. (1991). Forshaw, Joseph (ed.). Encyclopaedia of Animals: Birds. London: Merehurst Press. p. 222. ISBN 1-85391-186-0.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-11-20. Retrieved 2020-02-19.
బయటి లింకులు
[మార్చు]- Old World sparrow videos on the Internet Bird Collection