పొట్టి రాంబాబు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పొట్టి రాంబాబు

పొట్టి రాంబాబు తెలుగు సినిమా హాస్యనటుడు.[1][2]

జీవిత విశేషాలు

[మార్చు]

ఆయన స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కిర్లంపూడి మండలం బూరుగుపూడి గ్రామం.[3] రాంబాబు చిన్నప్పటి నుంచి నాటకాలంటే ఇష్టపడేవారు. చిన్నతనంలోనే తన తండ్రి చనిపోవడంతో తల్లి సంరక్షణలోనే ఈయన పెరిగారు. చిన్నప్పటి నుంచి తన చుట్టు పక్కల గ్రామాల్లో నాటకాలు వేసేవారు. ఎక్కడ నాటకం వేసినా పొట్టి వ్యక్తి చేసే పాత్ర మాత్రం కచ్చితంగా ఈయనే చేసేవారు. ఒకసారి హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో ఓ నాటకం వేశారు. ఆ నాటకంలో ఆయన చేసిన పెర్‌ఫార్మెన్స్‌ను విజయచందర్‌ మెచ్చుకున్నారు. సినిమాల్లో అవకాశాలు వస్తాయని అప్పట్లోనే ఆయన అన్నారు. 2002లో ప్రభాస్‌ చిత్రం 'ఈశ్వర్‌'లో తొలిసారిగా నటించారు. తర్వాత చేసిన 'చంటిగాడు' చిత్రంలో చేసిన పాత్ర గుర్తింపునిచ్చింది. ఇప్పటి వరకు చిన్న చితకాపాత్రలు 120కి పైగా సినిమాల్లో నటించారు.[4]

సినిమా ప్రస్థానం

[మార్చు]

రాజమండ్రి సమీపంలోని బూరుగుపూడి గ్రామానికి చెందిన రాంబాబు తెలుగుతెరపైకి వచ్చింది హీరో ప్రభాస్ తొలి చిత్రం ‘ఈశ్వర్’తో. ‘చంటిగాడు’, ‘దొంగ -దొంగది’, ‘కథానాయకుడు’, ‘దొంగల బండి’, ‘ అస్త్రం’, ‘గోపి-గోపిక-గోదావరి’ తదితర 40కి పైగా చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తున్న ‘పులిరాజా ఐపీఎస్’ నిర్మాణంలో ఉంది.[5]

తూర్పు యాస

[మార్చు]

ఈశ్వర్ సినిమాలో హీరో మిత్ర బృందంలో పనసకాయ పట్టుకుని తిరిగే క్యారెక్టర్‌లో తూర్పు గోదావరి యాసతో రాంబాబు హాస్యాన్ని పండించారు. ఆ తర్వాత చంటిగాడు చిత్రంలో కోటప్పకొండ పాత్రలో కడుపుబ్బ నవ్వించారు. జగ్గంపేట గ్రామ దేవత రావులమ్మ తల్లి అంటే రాంబాబుకు ఎంతో భక్తి. స్వగ్రామానికి వచ్చిన ప్రతిసారీ అమ్మవారి దర్శనం చేసుకునేవారు. తమిళంలో కూడా రెండు చిత్రాల్లో నటించారు.[6]

మరణం

[మార్చు]

పొట్టి రాంబాబు(35) మెదడులో రక్తం గడ్డ కట్టడంతో మంగళ వారం డిసెంబరు 29 2015 న మరణించారు. రాంబాబుకు భార్య, కొడుకు, కుమార్తె ఉన్నారు.

మూలాలు

[మార్చు]
  1. హాస్యనటుడు పొట్టి రాంబాబు మృతి
  2. "Telugu actor 'Potti' Rambabu dead". By: IANS Hyderabad. The Indian experess. Dec 29, 2015. Retrieved 30 December 2015.
  3. "కమెడియన్ పొట్టి రాంబాబు ఇకలేరు..." Archived from the original on 2016-01-01. Retrieved 2015-12-30.
  4. "హాస్య నటుడు పొట్టి రాంబాబు కన్నుమూత". Archived from the original on 2016-03-04. Retrieved 2015-12-30.
  5. biography of potti rambabu
  6. కల నెరవేరకుండానే..

ఇతర లింకులు

[మార్చు]