Jump to content

గోపి గోపిక గోదావరి (సినిమా)

వికీపీడియా నుండి
గోపి గోపిక గోదావరి
దర్శకత్వంవంశీ
స్క్రీన్ ప్లేవంశీ
నిర్మాతవల్లూరుపల్లి రమేష్
తారాగణంవేణు, కమలినీ ముఖర్జీ, జీవా, కృష్ణ భగవాన్, జయలలిత, కొండవలస లక్ష్మణరావు
ఛాయాగ్రహణంలోకి పి. గౌడ్
కూర్పుపైడిరెడ్డి
సంగీతంచక్రి
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
జూలై 10, 2009 (2009-07-10)
సినిమా నిడివి
162 ని
భాషతెలుగు

గోపి గోపిక గోదావరి వంశీ దర్శకత్వంలో 2009 లో విడుదలైన ఒక సినిమా.[1] ఇందులో వేణు, కమలినీ ముఖర్జీ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకు వల్లూరుపల్లి రమేష్ నిర్మాతగా వ్యవహరించగా, మహర్షి సినిమా పతాకంపై విడుదలైంది.[2] చక్రి సంగీతం అందించాడు.

గోపిక గోదావరి నది మీద పడవలో ఒక ఆసుపత్రి నడుపుతూ పేదలకు వైద్య సహాయం అందిస్తూ ఉంటుంది. ఆమె సేవకు అడ్డు వస్తుందని పెళ్ళిని వాయిదా వేయడానికైనా వెనుకాడని నిబద్ధత కలిగినది. హైదరాబాదులో ఉన్న ఆమె స్నేహితురాలు ఆత్మహత్య చేసుకుంటుంది. ఆ బాధ నుంచి బయటపడటం కోసం గోపి అనే గాయకుడితో ఫోన్ లో మాట్లాడుతూ ఉంటుంది. కానీ గోపిక సంచార వైద్యశాలలో వాళ్ళిద్దరూ కలుసుకునే సమయానికి గోపికి పూర్వజ్ఞాపకాలు మరిచిపోతాడు. ప్రభు అనే పేరుతో ఆమెతో పరిచయం అవుతుంది. ఈలోపు గోపికని శ్యాం ప్రసాద్ అనే వ్యక్తి పెళ్ళి చేసుకోవాలనుకుంటాడు. గోపి ఇక తిరిగిరాడని అతన్ని పెళ్ళి చేసుకోమని ప్రభునే సలహా ఇస్తాడు. మళ్ళీ విచిత్రమైన పరిస్థితిలో గోపికి పూర్వస్మృతి వస్తుంది. అప్పుడు వాళ్ళిద్దరూ ఎలా ఒక్కటయ్యారన్నది మిగతా కథ.

తారాగణం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: వంశీ
  • మాటలు - పడాల శివసుబ్రహ్మణ్యం
  • కెమెరా - లోకి పి. గౌడ్
  • కూర్పు - పైడిరెడ్డి
  • ఆర్ట్ - డి.వై సత్యనారాయణ

పాటలు

[మార్చు]

ఈ సినిమాకు చక్రి సంగీతం అందించాడు.

1:గో గో రే రే రచన: రామజోగయ్య శాస్త్రి , గానం.చక్రి , వంశీ

2: సుందరి , రచన: రామజోగయ్య శాస్త్రి , గానం.వేణు, మధుమిత

3:నువక్కడుంటే , రచన: రామజోగయ్య శాస్త్రి , గానం. చక్రి,కౌసల్య

4: బాల గోదావరి , రచన: రామజోగయ్య శాస్త్రి,గానం. కార్తీక్, కౌసల్య , వంశీ

5: మావిడాకు, రచన: రామజోగయ్య శాస్త్రి, గానం. వాసు, గీతా మాధురి



మూలాలు

[మార్చు]
  1. "Gopi Gopika Godavari Movie Review, Trailers, Galleries, Photos - 123telugu.com - Andhra Pradesh News and Views". www.123telugu.com. Retrieved 2020-07-09.
  2. "Gopi Gopika Godavari review - Telugu cinema Review - Venu Thottempudi & Kamalinee Mukherjee". www.idlebrain.com. Archived from the original on 2019-12-12. Retrieved 2020-07-09.

బయటి లింకులు

[మార్చు]