Jump to content

పోకిరిరాజా

వికీపీడియా నుండి
(పోకిరి రాజా నుండి దారిమార్పు చెందింది)
పోకిరిరాజా
దర్శకత్వంఎ.కోదండరామిరెడ్డి
తారాగణంవెంకటేష్,
రోజా,
శుభశ్రీ
సంగీతంరాజ్ - కోటి
నిర్మాణ
సంస్థ
ఎల్.వి.యస్.ప్రొడక్షన్స్
భాషతెలుగు

పోకిరిరాజా ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో 1995 లో విడుదలైన తెలుగు చిత్రము. ఇందులో వెంకటేష్, రోజా, శుభశ్రీ ముఖ్యపాత్రల్లో నటించారు. రాజ్ కోటి ఈ చిత్రానికి సంగీతం అందించారు.[1]

ప్రజలను మోసం చేసి 2000 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డ అంతర్జాతీయ స్టాక్ బ్రోకర్ అశోక్ కుమార్ ను అరెస్టు చేస్తారు పోలీసులు. అతన్ను నిర్బంధించి స్వయంగా ముఖ్యమంత్రిని పర్యవేక్షించమని ఆదేశిస్తుంది ప్రభుత్వం. మాఫియా గ్యాంగ్ లీడరైన విక్కీ అశోక్ కుమార్ జైలు నుంచి తప్పించు కోవడానికి తన తమ్ముడైన భద్రంని ప్లాస్టిక్ సర్జరీ సహాయంతో ముఖ్యమంత్రిలాగా మారుస్తాడు.

ధనిక పారిశ్రామికవేత్త అయిన ఆనందరావు నాయుడు తన కొడుకు చంటి, మేనల్లుడు నానిల అల్లరితో విసిగిపోయి ఉంటాడు. వీళ్ళు ఎప్పుడూ పనిపాటా లేకుండా తిరుగుతుంటారు. వీళ్ళిద్దరూ ప్రతిభ, నిఖిత అనే ఇద్దరు అమ్మాయిలను ప్రేమిస్తూ ఉంటారు. కాలేజీలో తమ చదువుల గురించి కూడా అబద్ధాలు చెబుతూ తిరుగుతూ ఉంటారు. అది ఆనందరావు నాయుడికి తెలిసి ఇంట్లోంచి వెళ్ళగొడతాడు.

వీళ్ళు ఒకసారి ముఖ్యమంత్రి కొడుకుని ప్రమాదం నుంచి కాపాడితే ఆయన వీళ్ళని తమ ఇంటికి ఆహ్వానిస్తాడు. అప్పుడే విక్కీ ముఖ్యమంత్రి మీద దాడి చేస్తాడు. ఆ దాడిలో ముఖ్యమంత్రి భార్య, కొడుకు చనిపోతారు. ముఖ్యమంత్రికి గాయాలవుతాయి. చంటి, నాని ఇద్దరూ దుండగులను అనుసరించి వెళ్ళి వాళ్ళ పథకాలన్నీ తెలుసుకుంటారు. వాళ్ళ మీద దాడి జరగ్గా నాని పారిపోతాడు. చంటి మాత్రం అదృశ్యం అయిపోతాడు. అందరూ అతన్ని చనిపోయాడని భావిస్తారు. చంటి హత్యకేసులో నాని జైలుపాలవుతాడు. ఈ లోపు మాఫియా ముఠా ఆసుపత్రిలో ఉన్న ముఖ్యమంత్రిని మార్చేసి ఆ స్థానంలో నకిలీ వ్యక్తిని ప్రవేశ పెడతారు.

ఒక మారుమూల పల్లెటూర్లో ఆనందరావు కవల సోదరుడైన నరసింహకు అచ్చు చంటి పోలికలతో ఉండే బాలరాజు అనే కొడుకు ఉంటాడు. బాలరాజు తన కాబోబే భార్య చంద్రముఖిని తీసుకుని పట్నం వస్తాడు. అప్పుడే చంటి కూడా బ్రతికి ఉన్నాడని తెలుస్తుంది. వీళ్ళిద్దరూ కలిసి మాఫియా ముఠా ఆట కట్టించి ముఖ్యమంత్రిని ఎలా కాపాడాడన్నదే మిగతా కథ.

తారాగణం

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]
  • గుంపకింద కోడిపెట్ట , రచన:వేటూరి సుందర రామమూర్తి,గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం , కె ఎస్ చిత్ర
  • ఓఎర్రతోలు పిల్లా , రచన: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,కె ఎస్ చిత్ర , ఎస్ పి శైలజ
  • ఒక్కొక్క వాన చినుకా , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి,గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
  • కలగా వచ్చినావు, రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
  • కొట్టండయ , రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  • ఓయే ఓయే , రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం , కె ఎస్ చిత్ర

మూలాలు

[మార్చు]
  1. "Pokiri Raja (1995) | Pokiri Raja Movie | Pokiri Raja Telugu Movie Cast & Crew, Release Date, Review, Photos, Videos". FilmiBeat (in ఇంగ్లీష్). Retrieved 2020-07-20.

బయటి లంకెలు

[మార్చు]