Jump to content

తెలంగాణ పోడు పట్టాల పంపిణీ

వికీపీడియా నుండి

పోడు పట్టాల పంపిణీ అనేది తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలోని పోడు భూమిని సాగు చేసుకుంటున్న వారికి ఆయా భూమి పట్టాలను పంపిణీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమం.[1] 2023, జూన్ 30న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రారంభించిన ఈ పోడు పట్టాల పంపిణీ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని లక్షా 51 మంది రైతులకు, 4 లక్షల 50 వేల ఎకరాల పోడు భూమి పట్టాలను పంపిణీ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.[2]

ఆసిఫాబాదులో పోడు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్

ప్రతిపాదన

[మార్చు]

కొన్ని దశాబ్దాల క్రితం ఛత్తీస్‌గఢ్, ఒడిస్సా రాష్ట్రాల నుంచి వలస వచ్చిన గొత్తికోయలు, ఇతర గిరిజనులు ఏజెన్సి ప్రాంతాల్లోని పలు గ్రామాల్లో గుడిసెలు వేసుకొని అటవిప్రాంతాల్లో పోడుకొట్టి ఆ భూమిలో వ్యవసాయం చేసుకుంటూ వస్తున్నారు. తాత ముత్తాతల నుంచి అటవీ భూములను సాగు చేసుకుంటున్న పేదలకు ఎలాంటి హక్కు పత్రాలు లేవు. ఆయా భూములకు సంబధించిన పట్టాలు ఇవ్వాలని గత కొన్ని సంవత్సరాలుగా గిరిజనులు ప్రభుత్వాలను కోరుకున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అటవీ హక్కుల చట్టం- –2005 ప్రకారం గిరిజనులకు పోడు పట్టాల పంపిణీ జరిగింది. తరువాత కూడా అనేకమంది పోడు పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. దాంతోపాటు మళ్ళీ కొత్తగా పోడు వ్యవసాయం చేసుకోవడం ప్రారంభించారు.[3]

సర్వే

[మార్చు]

2018 ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కేసిఆర్ పోడు రైతులకు పట్టాలను పంపిణీ చేస్తామని వాగ్ధానం చేశాడు. దానిననుసరించి పోడు భూములను పంపిణీ చేయడానికి ముందు, ప్రభుత్వం పోడు భూములపై అధ్యయనానికి సబ్‌ కమిటీ వేసింది. మూడంచెల సర్వే నిర్వహించిన ఆ కమిటీ, వాస్తవ స్థితిగతుల ఆధారంగా మార్గదర్శకాలు రూపొందించింది.

2021, నవంబరు 8 నుంచి పోడు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం, ఆ దరఖాస్తులను పరిశీలన కోసం డివిజన్ల వారిగా సబ్‌డివిజన్‌ స్థాయి కమిటీలను ఏర్పాటుచేసింది. దరఖాస్తులను పరిశీలించిన కమిటి, వాటిని జిల్లా స్థాయి కమిటీలకు సిఫారస్‌ చేసింది. పోడు భూములకు హక్కు పట్టాల కోసం 4.14 లక్షల మంది నుంచి 12.14 లక్షల ఎకరాలకు దరఖాస్తులు వచ్చాయని ప్రభుత్వం తెలిపింది.[4] జీవో 140 ద్వారా లబ్ధిదారుల ఎంపిక జరిగింది.

ప్రకటన

[మార్చు]

పోడు భూమి పట్టాల పంపిణీ గురించి అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకురాగా, 'ఇకముందు గిరిజనులు ఎవరూ చెట్లు నరకకుండా హామీపత్రం ఇస్తే, పోడు భూమి పట్టాలను అందజేస్తామని' ముఖ్యమంత్రి కేసీఆర్ 2023 అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా 2023, ఫిబ్రవరి 10న అసెంబ్లీలో ప్రకటించాడు.[5]

ప్రారంభం

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "CM Kcr: 4లక్షలకుపైగా ఎకరాలకు పోడు పట్టాలు.. పంపిణీ ప్రారంభించిన సీఎం కేసీఆర్‌". EENADU. 2023-06-30. Archived from the original on 2023-06-30. Retrieved 2023-07-13.
  2. telugu, NT News (2023-06-30). "CM KCR | వాళ్ల పేరు మీదనే పోడు పట్టాలు.. మారుమూల పొలాలకూ త్రీఫేజ్‌ కరెంటు : సీఎం కేసీఆర్‌". www.ntnews.com. Archived from the original on 2023-07-01. Retrieved 2023-07-13.
  3. Karthik, S. (2023-06-01). "పోడు రైతులకు 'పట్టా'భిషేకం". Mana Telangana. Archived from the original on 2023-06-01. Retrieved 2023-07-13.
  4. ABN (2023-02-24). "CM KCR: త్వరితగతిన పోడు భూములకు పట్టాలు!". Andhrajyothy Telugu News. Archived from the original on 2023-03-20. Retrieved 2023-07-13.
  5. "నెలాఖరుకల్లా పోడు భూములు పంపిణీ చేస్తాం: సీఎం కేసీఆర్‌". Sakshi. 2023-02-11. Archived from the original on 2023-02-11. Retrieved 2023-07-13.
  6. "Telangana State Portal పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం". www.telangana.gov.in. 2023-07-01. Archived from the original on 2023-07-13. Retrieved 2023-07-13.
  7. "Modi shifted coach factory to Gujarat, left Telangana with repair shed: KTR". The New Indian Express. 2023-07-01. Archived from the original on 2023-07-05. Retrieved 2023-07-13.
  8. Kommuru, Jyothi (2023-06-30). "Harish Rao: పాల్వంచలో గిరిజన రైతులకు పోడు పట్టాలు పంపిణీ చేసిన మంత్రి హరీశ్‌ రావు". www.hmtvlive.com. Archived from the original on 2023-07-10. Retrieved 2023-07-13.
  9. "పోడు పట్టాలతో పది ప్రయోజనాలు". EENADU. 2023-07-01. Archived from the original on 2023-07-01. Retrieved 2023-07-13.