పోతుల విఘ్నేశ్వర రావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పోతుల విఘ్నేశ్వర రావు
జననం
పోతుల విఘ్నేశ్వరరావు

1949 మే 10
దేవగుప్తం గ్రామం, అమలాపురం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్.
మరణం22 డిసెంబరు 2005 (వయస్సు 56)
న్యూఢిల్లీ, భారతదేశం
జాతీయతభారతీయుడు
వృత్తిదళిత సామాజిక ఉద్యమకారుడు & మాలమహానాడు వ్యవస్థాపక అధ్యక్షుడు
జీవిత భాగస్వామిప్రమీలాదేవి

పోతుల విఘ్నేశ్వరరావు (పి.వి.రావు గా సుపరిచితుడు) దళిత సామాజిక ఉద్యమకారుడు. ఆంధ్రప్రదేశ్ లో షెడ్యూల్డ్ కులాలను ఎ, బి, సి, డి గ్రూపులుగా వర్గీకరించడాన్ని వ్యతిరేకిస్తూ పోరాడటానికి దళిత మాల మహానాడు స్థాపించి ఉద్యమానికి నాయకత్వం వహించాడు.

మాల మహానాడు ఉద్యమం

[మార్చు]

ఆంధ్రప్రదేశ్‌లోని దళిత జనాభాలో 20 శాతం మంది 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకుగా ఉండేడి. 1998 లో తెలుగు దేశం పార్టీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు తన పార్టీని రాష్ట్రంలో బలంగా స్థాపించాలంటే ఈ దళితుల మద్దతును విభజించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు. ప్రత్యేక రిజర్వేషన్ ప్రయోజనాలను చంద్రబాబు నాయుడు మాదిగలను సంక్షేమం, విద్యా సంస్థలలో సీట్లు, రిజర్వేషన్లను కల్పిస్తూ వేరుచేసాడు. షెడ్యూల్డ్ కులాలను ఎ,బి,సి,డి గ్రూపులుగా వర్గీకరించడానికి ఎం.ఆర్.పి.యస్ ఉద్యమాని నాయకత్వం చేయడానికి మాజీ నక్సలైట్ మంద కృష్ణ మాదిగ ను తీసుకువచ్చాడు. అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 59 ఉప కులాలను వారి జనాభా ప్రకారం నాలుగు గ్రూపులుగా వర్గీకరించి వారి వాటాలను కేటాయించింది. ఈ విధంగా గ్రూప్ ఎలోని 12 కులాలకు 1 శాతం, మాదిగలతో పాటు బి గ్రూపులోని 17 ఇతర కులాలకు 7 శాతం, మాలలతో పాటు సి గ్రూప్‌ లోని 24 కులాలకు 6 శాతం, గ్రూప్ డిలోని నాలుగు కులాలకు 1 శాతం రిజర్వేషన్ల లభించింది. 

మాల కులస్థులు ఇప్పుడు తమ వాటాను 15% లో 6% కి మాత్రమే పరిమితం చేయవలసి వచ్చింది. ఇది మాలలకు తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాలను ఉప గ్రూపులుగా విభజించడాన్ని విఘ్నేశ్వర రావు వ్యతిరేకించాడు. నాయుడు ప్రభుత్వ విభజన రాజకీయాలను వ్యతిరేకించినందుకు అతనిని ఉద్యోగం నుండి తొలగించారు. రావు తరువాత మాల మహానాడును ఏర్పాటు చేసి, సమాజంలో సంఖ్యాపరంగా ముఖ్యమైన, విద్యావంతులైన మాలల యొక్క కుల ఏకీకరణకు నాయకత్వం వహించాడు. 

షెడ్యూలు కులాల వర్గీకరణకు వ్యతిరేకంగా మాల మహానాడు పోరాటం 1997 లో ప్రారంభమైంది. ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం జారీ చేసిన జి.ఒ తరువాత ప్రారంభించారు. [1] హైకోర్టు ఈ ప్రభుత్వ ఉత్తర్వును కొట్టేసినప్పుడు ప్రభుత్వం ఒక ఆర్డినెన్సును జారీ చేసింది. తరువాత దీనిని ఆంధ్రప్రదేశ్ శాసన సభ అమలు చేసింది. [2] ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ చట్టాన్ని సమర్థించింది. [3] 2001 లో, మాల మహానాడు సుప్రీంకోర్టుకు వెళ్ళింది. ఉద్యమకారులు కోర్టు తలుపులు తట్టిన నేపథ్యంలో సుప్రీంకోర్టు లోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం నవంబర్ 7, 2004 శుక్రవారంనాడు ఇ.వి.చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసులో షెడ్యూల్డ్ కులాలను ఉప సమూహాలుగా వర్గీకరించడం రాజ్యాంగ విరుద్ధం అని ఏకగ్రీవంగా నిర్ణయించింది. అంటరానితనం ఏకైక ప్రమాణం అని, షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 16 లను ఉల్లంఘించిందని కోర్టు తెలిపింది. తద్వారా ఇది రాజ్యాంగంలోని ప్రాథమిక నిర్మాణాన్ని ప్రభావితం చేసింది. 

సుప్రీంకోర్టు 2004 లో ఈ ఉత్తర్వులను కొట్టివేసింది. [4] [5] [6]

మాలలు, మాదిగల మధ్య ఐక్యత

[మార్చు]

మాదిగలు చేసిన ఆందోళన ఈ సమస్యపై మాల, మాదిగల ఆధిపత్య కులాల మధ్య లోతైన విభేదాలను సృష్టించింది. పి.వి.రావు ఎప్పుడూ మాలల, మాదిగల మధ్య ఐక్యత కోసం పోరాడాడు. [7] వర్గీకరణ కోసం సుదీర్ఘకాలంగా పోరాడిన అతిపెద్ద ఎస్సీ గ్రూపు మాదిగలకు, వారి విభేదాలను ప్రక్కన పెట్టి ఎస్సీల సాధికారత కోసం పోరాడటానికి చేతులు కలపాలని ఆయన విజ్ఞప్తి చేశాడు.

మరణం

[మార్చు]

22 డిసెంబర్ 2005 న న్యూఢిల్లీలో గుండెపోటుతో రావు మరణించాడు. [8] షెడ్యూల్డ్ కులాలను ఎ, బి, సి, డి గ్రూపులుగా వర్గీకరించడానికి వ్యతిరేకంగా పోరాడటానికి పలువురు పార్టీ నాయకులను కలవడానికి ఆయన న్యూ ఢిల్లీ వెళ్లారు. [9] అతను 56 సంవత్సరాల వయస్సులో మరణించాడు. హిందూ ఆచారాల ప్రకారం దహనం చేయబడ్డాడు. అతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అతని భార్య ప్రమీళా దేవి అమలాపురం లోక్‌సభ నియోజకవర్గానికి ప్రజారాజ్యం పార్టీ టికెట్‌పై పోటీ చేసినప్పటికీ ఓడిపోయింది. 

మూలాలు

[మార్చు]
  1. "P.V. Rao vs Director, Dept. Of Information ..on 25 August, 1999".
  2. "Andhra HC upholds categorisation of SCs".
  3. "MRPS, Mala Mahanadu take opposite stands on verdict". The Hindu. Chennai, India. 9 November 2000. Archived from the original on 4 October 2012. Retrieved 2016-07-26.
  4. "Apex court quashes AP`s legislation on reservation".
  5. "SC quashes Andhra reservation law as unconstitutional". The Times of India. 5 November 2004. Archived from the original on 24 September 2012.
  6. "S.C. rules against quota within quota". The Hindu. Chennai, India. 6 November 2004. Archived from the original on 12 February 2005.
  7. "Mala Mahanadu for restraint". The Hindu. Chennai, India. 7 November 2004. Archived from the original on 15 April 2005.
  8. "Mala Mahanadu chief passes away". The Hindu. Chennai, India. 24 December 2005. Archived from the original on 16 February 2006.
  9. "Plea to install statue of Mala Mahanadu leader". The Hindu. Chennai, India. 23 December 2006. Archived from the original on 5 December 2007.