పోస్ట్‌మాన్
స్వరూపం
(పోస్ట్ మేన్ నుండి దారిమార్పు చెందింది)
పోస్ట్ మేన్ | |
---|---|
దర్శకత్వం | ముప్పలనేని శివ |
రచన | పరుచూరి సోదరులు (మాటలు), ముప్పలనేని శివ (చిత్రానువాదం) |
కథ | విష్ణువర్ధన్ |
నిర్మాత | మోహన్ బాబు |
తారాగణం | మోహన్ బాబు, రాశి, సౌందర్య |
ఛాయాగ్రహణం | కె. ఎస్. ప్రకాష్ |
సంగీతం | వందేమాతరం శ్రీనివాస్ |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | జనవరి 13, 2000[1] |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
పోస్ట్‌మాన్ ముప్పలనేని శివ దర్శకత్వంలో 2000 వ సంవత్సరంలో విడుదలైన తెలుగు చిత్రం. ఇందులో మోహన్ బాబు, సౌందర్య ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్ర సంగీతం మంచి విజయాన్ని సాధించింది.
కథ
[మార్చు]విష్ణు హైదరాబాదులో పోస్టుమ్యాన్ గా పనిచేస్తుంటాడు. అందరికీ తలలో నాలుకనా మెలుగుతూ అందరితో మంచివాడనిపించుకుంటూ ఉంటాడు. విష్ణు తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయి ఉంటారు. వాళ్ళ పాత ఇంటిని విష్ణు మేనమామ అయిన రామకోటి స్వాధీనం చేసుకుని అతనికి మాత్రం డాబామీద ఓ చిన్న గదిలో తలదాచుకుంటూ ఉంటాడు.
నటవర్గం
[మార్చు]- విష్ణు గా మోహన్ బాబు
- అర్చన గా సౌందర్య
- శిరీష గా రాశి
- మణిచందన
- అన్నపూర్ణ
- రామకోటి గా కోట శ్రీనివాసరావు
- రవిబాబు
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకుడు - ముప్పలనేని శివ
పాటలు
[మార్చు]- లాహిరి లాహిరి లాహిరి నన్ను చేరుకుంది చెలి మాధురి. రచన: సుద్దాల అశోక్ తేజ, గానం. ఉదిత్ నారాయణ , కె ఎస్ చిత్ర
- అచ్చ తెలుగులా , రచన: ఘంటాడి కృష్ణ, గానం.జేసుదాస్, సుజాత మోహన్.
- కుకూ కోకిలమ్మ , రచన: గురు చరణ్ , గానం.కె.జే.జేసుదాస్ , కె ఎస్ చిత్ర.
- బావా బావా లగ్గం , రచన: సుద్దాల అశోక్ తేజ., గానం. ఉదిత్ నారాయణ్, స్వర్ణలత
- మనుషుల్లో జెంటిల్ మెన్ , రచన: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు , గానం.ఉదిత్ నారాయణ, స్వర్ణలత.
- వేషము వేసి , రచన: జంధ్యాల పాపయ్య శాస్త్రి , గానం.జేసుదాస్.
- ఊలు దారాలు , రచన: జంధ్యాల పాపయ్య శాస్త్రి, గానం. జేసుదాస్.
- నేనొక పూల మొక్క , రచన: జంధ్యాల పాపయ్య శాస్త్రి, గానం. జేసుదాస్.
- ఇచ్చోటనే , రచన: గుర్రం జాషువా, గానం.జేసుదాస్.
మూలాలు
[మార్చు]- ↑ "Movie review". idlebrain.com. Retrieved 23 January 2018.