Jump to content

ప్రకాష్ దహకే

వికీపీడియా నుండి
ప్రకాష్ ఉత్తమ్‌రావు దహకే

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2009 - 2014
ముందు రాజేంద్ర పట్నీ
తరువాత రాజేంద్ర పట్నీ
నియోజకవర్గం కరంజా

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి సాయి దహకే
వృత్తి రాజకీయ నాయకుడు

ప్రకాష్ ఉత్తమ్‌రావు దహకే మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహారాష్ట్ర శాసనసభకు 2009 మహారాష్ట్ర ఎన్నికలలో కరంజా శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

ప్రకాష్‌ దహకే మహారాష్ట్ర రాష్ట్ర మాజీ మంత్రి దిలీప్ వాల్సే పాటిల్‌కు బావ.

రాజకీయ జీవితం

[మార్చు]

ప్రకాష్ దహకే కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1995 మహారాష్ట్ర ఎన్నికలలో కరంజా శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన ఆ తరువాత నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చేరి 1999 మహారాష్ట్ర ఎన్నికలలో కరంజా శాసనసభ నియోజకవర్గం ఎన్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. ప్రకాష్ దహకే ఆ తరువాత భరిపా బహుజన్ మహాసంఘ పార్టీలో చేరి 2004 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో బీబీఎం అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.

ప్రకాష్ దహకే ఆ తరువాత తిరిగి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2009 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ఎన్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి శివసేన అభ్యర్థి రాజేంద్ర పట్నీపై 30375 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. దహకేకి 62658 ఓట్లు రాగా, పట్నీకి 32283 ఓట్లు వచ్చాయి.[1] ఆయన ఆ తరువాత 2014, 2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయాడు.

మరణం

[మార్చు]

ప్రకాష్‌ దహకే కరోనా బారిన పడి నాగ్‌పూర్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2021 మే 10న రక్తపోటు తగ్గి గుండెపోటు రావడంతో మరణించాడు.[2]

మూలాలు

[మార్చు]
  1. "Maharashtra Assembly Election 2009 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 3 September 2010.
  2. News18 लोकमत (10 May 2021). "झुंज अयपशी, राष्ट्रवादीचे माजी आमदार प्रकाशदादा डहाके यांचं कोरोनामुळे निधन" (in మరాఠీ). Archived from the original on 3 December 2024. Retrieved 3 December 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)