ప్రకాష్ రత్నపురం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రకాష్ రత్నపురం
ప్రకాష్ రత్నపురం
జననంబోథ్‌, నిర్మల్‌ జిల్లా
స్థితిడీఎస్పీ, జగిత్యాల
నివాస ప్రాంతంజగిత్యాల పట్టణం
జాతీయతభారతీయుడు

రత్నపురం ప్రకాష్‌[1] ప్రస్తుతం జగిత్యాల జిల్లాలో డీఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన గతంలో సీఐగా పని చేసి పదోన్నతి పొందారు. విధి నిర్వహణలో విలక్షణతో పలు ప్రత్యేకతలను సంతరించుకున్నారు.

జననం, విద్యాభ్యాసం[మార్చు]

రత్నపురం ప్రకాష్‌[2][3] నిర్మల్‌ జిల్లా బోథ్‌లో జన్మించారు. తండ్రి బక్కన్న పాఠశాల ఉపాధ్యాయుడు. చిన్ననాటి నుంచే విలువలను నూరిపోశారు. ప్రకాష్‌ ఇంటర్‌ వరకు బోథ్‌లోనే చదివారు. నిర్మల్‌ ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ ఆర్థిక శాస్త్రంలో మేటిగా నిలిచి అప్పటి గవర్నర్‌ రంగరాజన్‌ చేతుల మీదుగా బంగారు పతకాన్ని అందుకున్నారు.

ఉద్యోగ వివరాలు, ప్రత్యేకతలు[మార్చు]

1995లో ఎస్సైగా ప్రవేశ పరీక్ష రాసి ఎంపికయ్యారు. 2010లో సీఐగా పదోన్నతి పొందారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తూ చదువాపేసిన వారు, మద్యం తాగుతూ పట్టుబడ్డ యువత సన్మార్గంలో నడవాలని వినూత్న చర్యలకు శ్రీకారం చుట్టారు. ఒక రోజు గ్రౌండ్‌లో అతని కంటికి ఎనిమిది మంది యువకులు మద్యం సేవిస్తూ కనిపించారు. వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. కానీ తరువాత ఇలాంటి యువకులు గ్రామాల్లో చాలా మంది ఉన్నారని తెలుసుకున్నారు. ఇది ఇలాగే కొనసాగితే యువత అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతూ మళ్లీ నక్సలిజం బాట పట్టే అవకాశాలు ఉంటాయని గుర్తించారు. పత్రికా ప్రకటనల ద్వారా రక్షణ విభాగాల్లో ఉద్యోగం చేయాలనే ఆసక్తి ఉండి.. చదువు మానేసిన యువత వివరాలను సేకరించారు. ఇలా 142 మందిని గుర్తించారు. ఇందులో 12 మంది అమ్మాయిలు ఉన్నారు. సింగరేణి అధికారులు, ప్రత్యేక నిపుణుల సాయంతో వాళ్లందరికీ ఆర్మీ, పోలీస్‌ ఉద్యోగాల కోసం శిక్షణ ఇచ్చారు. దీనికి ఆయన 'యువత భవిత'గా నామకరణం చేశారు. ఇందులో 72 మందికి పోలీస్‌, ఆర్మీ, బీఎస్‌ఎఫ్‌ వంటి వాటిల్లో ఉద్యోగాలు రావడంతో ఆయన పేరు మారుమోగింది.

పురస్కారాలు, సత్కరాలు[మార్చు]

  • అమెరికాలో ఇంటర్నేషనల్‌ చీఫ్స్‌ ఆఫ్‌ పోలీస్‌ ఆధ్వర్యంలో కమ్యూనిటీ పోలీస్ అవార్డును అందుకున్నాడు.
  • ప్రకాష్‌ చేపట్టిన కార్యక్రమాలను చూసి అమెరికా తెలుగు సంఘం (ఏటీఏ) ఆయన్ని సన్మానించింది.

మూలాలు[మార్చు]

  1. hindudayashankar (2021-08-26). "DSPs transferred, R Prakash is new DSP of Jagtial". Hindudayashankar (in ఇంగ్లీష్). Archived from the original on 2023-01-05. Retrieved 2023-01-05.
  2. "ATA fecilitates CI Prakash Ratnapuram - USA - video Dailymotion". Dailymotion (in ఇంగ్లీష్). 2013-10-27. Retrieved 2023-01-05.
  3. Pavan (2021-08-26). "Telangana: 19 DSPs reshuffled in the state, DGP issues orders". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2023-01-05.

వెలుపలి లంకెలు[మార్చు]