ప్రజాస్వామ్యం (1987 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రజాస్వామ్యం
(1987 తెలుగు సినిమా)
దర్శకత్వం పరుచూరి బ్రదర్స్
రచన పరుచూరి బ్రదర్స్
తారాగణం రాధ ,
‌రాజశేఖర్ ,
శివకృష్ణ
సంగీతం చక్రవర్తి
నిర్మాణ సంస్థ ఈతరం ఫిల్మ్స్
భాష తెలుగు

}} ప్రజాస్వామ్యం పరుచూరి బ్రదర్స్ రచన, దర్శకత్వంలో ఈతరం ఫిల్మ్స్ పతాకంపై పోకూరి బాబూరావు నిర్మించిన 1987 నాటి తెలుగు చలన చిత్రం.

రాష్ట్ర ప్రభుత్వం ఈచిత్రాన్ని తృతీయ ఉత్తమ చిత్రంగా కాంస్యనంది అవార్డు ప్రకటించింది

నిర్మాణం[మార్చు]

అభివృద్ధి[మార్చు]

పరుచూరి బ్రదర్స్ కథను రాసేప్పుడు వారిలో చిన్న సోదరుడైన పరుచూరి గోపాలకృష్ణ ఈ సినిమాను ఎలాగైనా తామే దర్శకత్వం వహించాలని ఆశించారు. ప్రముఖ అభ్యుదయ చిత్ర దర్శకుడు టి. కృష్ణ ఏదైనా కథ ఉంటే చెప్పమని పరుచూరి వెంకటేశ్వరరావును అడిగినప్పుడు ఆయన ఈ సినిమా కథాంశాన్ని చెప్పారు. ఆయనకు నచ్చడంతో ఈ సినిమాకు కథ, మాటలు పరుచూరి బ్రదర్స్ రాయడానికి దర్శకత్వం టి.కృష్ణ వహించడానికి నిర్ణయించుకుని ఆ మేరకు పత్రికలకు ప్రకటించారు. ఇంతలో టి.కృష్ణ అకాలమరణం పొందడంతో సినిమా సందేహంలో పడింది. పరుచూరి సోదరులను సినీ పాత్రికేయుడు పసుపులేటి రామారావు ప్రజాస్వామ్యం సినిమా ఏమవుతుంది? అని ప్రశ్నించగా ఆ సినిమా ఆగదని గోపాలకృష్ణ వెల్లడించారు. ఈ విషయాన్ని పత్రికల్లో చదివిన ఈతరం ఫిల్మ్స్ అధినేత, టి.కృష్ణ సన్నిహితుడు, నిర్మాత పోకూరి బాబూరావు తానే నిర్మాతగా వ్యవహరిస్తానని ముందుకురావడంతో పరుచూరి సోదరుల దర్శకత్వంలో సినిమా ప్రారంభమైంది.
సినిమా చిత్రీకరణకు ముందు రాసుకున్న వెర్షన్ కథలో కీలకమైన పాత్రల్లో ఒకటి అయిన శారద పాత్ర ఉరిశిక్షతో మరణిస్తుంది. రషెస్ చూశాకా పరుచూరి వెంకటేశ్వరరావు సహరచయిత, సహదర్శకుడు అయిన గోపాలకృష్ణతో "శారద మరణిస్తే ప్రజాస్వామ్యం చచ్చిపోయినట్టే కదా" అని ప్రశ్నించారు. శారద పాత్రను బతికిస్తే వాస్తవానికి దూరమైపోతుందని గోపాలకృష్ణ సందేహించినా, నిర్మాత బాబూరావు కూడా ఆ పాత్ర బతికితేనే బావుంటుందని భావించారు. దాంతో కథలో ముఖ్యమైన మార్పులు జరిగాయి.[1]

నటీనటుల ఎంపిక[మార్చు]

చిత్రీకరణ[మార్చు]

సినిమాలోని ప్రధానమైన సన్నివేశాలు, ఎక్కువ భాగమూ ఒంగోలు, పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు. ప్రధాన చిత్రీకరణ దాటేసరికి 17వేల అడుగుల ఫిల్మ్ వచ్చింది. సినిమాలో ఎడిటింగ్ దశ దాటాకా కథలో ముఖ్యమైన మార్పులు చేర్పులు జరగడంతో ప్రధాన చిత్రీకరణ దశ దాటినా విడుదలకు కొద్దిరోజుల ముందు కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించారు. కీలకమైన పాత్ర శారద మరణించినట్టుగా క్లైమాక్స్ ప్రధాన చిత్రీకరణ దశలో చిత్రీకరణ మొత్తం జరుపుకోగా లెవంత్ అవర్లో (రషెస్ చూసుకున్నాకా) ఆ పాత్ర మరణించలేదని తీయాలని కథలో మార్పులు చేశారు. దాంతో సినిమాకు ఓ పక్క రీరికార్డింగ్ జరుగుతూండగా మరోపక్క చేసిన షూటింగ్ లో ఏవితల్లీ పాటలోని మాంటేజి షాట్లు, క్లైమాక్స్ సన్నివేశాలు చిత్రీకరించారు. అశోక్, తిలక్, యాదగిరి, బోసు తప్పించుకోవడం, రాయుడు కాలిస్తే శాంత మరణించడం, రాయుణ్ణి భుజాల మీద నరకడం, గవర్నర్ దగ్గరకు తీసుకువెళ్ళడం, గవర్నర్ నిజం తెలిసి ఫోన్ చేసి ఉరి ఆపుదామనుకుంటే ఎవరూ ఎత్తకపోవడం, గవర్నర్ ఉరి ఆపేందుకు ఉత్తరం ఇవ్వడం, ఆ ఉత్తరాన్ని తీసుకువస్తూంటే సీఐ తీసుకువచ్చిన అవాంతరాలు, ఉత్కంఠ మధ్య చివరకు జైలర్ చేతికి ఉత్తరం అంది ఉరి ఆపుచేయడం వంటి వరుస క్లైమాక్స్ సన్నివేశాలన్నీ ఎడిటింగ్ దాటాకా రీరికార్డింగ్ దశలో చిత్రీకరించినవే.[1]

నిర్మాణానంతర కార్యక్రమాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 పరుచూరి, గోపాలకృష్ణ (డిసెంబరు 2008). లెవంత్ అవర్ (2 ed.). హైదరాబాద్: వి టెక్ పబ్లికేషన్స్. pp. 57–67.