"సైకస్" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
1,573 bytes added ,  13 సంవత్సరాల క్రితం
*వేళ్ళు ద్విరూపకాలు, సాధారణ వేరు, ప్రవాశాభ వేరు అను రెండు రకాలుగా ఉంటాయి.
*కాండం కొనభాగంలో ఒక కిరీటంలాగా ఏర్పడిన పక్షవత్ (arborescent) సంయుక్త [[పత్రాలు]]. ఇవి 1-3 మీటర్ల పొడవుతో ఉంటాయి. ఇవి సాధారణంగా సమపిచ్ఛకాలు. అడ్డంగా విస్తరించిన రాంబాయిడ్ ఆకారంలో నున్న పత్రపీఠం వల్ల ఇవి కాండానికి అతుక్కొని ఉంటాయి. ఒక పొడవైన లావుపాటి రాకిస్ మీద సుమారు 50-100 పత్రకాలు రెండు వరుసలలో ఉంటాయి. ఈ పత్రకాలు వృంతరహితంగా, చర్మిలంగా, బిరుసుగా బల్లెం ఆకారంలో ఉండి, ఒక ప్రస్ఫుటమైన మధ్య ఈనె ఉంటుంది. కొన్ని కింది పత్రకాలు కంటకాలుగా రూపొందవచ్చును.
 
==ప్రత్యుత్పత్తి==
సైకస్ సిద్ధబీజదం అబ్బురపు మొగ్గలు లేదా లఘులశునాల వల్ల శాకీయోత్పత్తిని జరుపుతుంది. లఘులశునాలు కాండం పీఠభాగాల్లో అభివృద్ధి చెందుతాయి. వీటిలో దుంపవంటి కాండం, కొన్ని పత్రాలు ఉంటాయి. లఘులశునం నేలపై పడితే అబ్బురపు వేళ్ళను ఏర్పరచుకొని స్వతంత్రమైన మొక్కగా పెరుగుతుంది. సిద్ధబీజదం సుమారు పది సంవత్సరాలపాటు శాకీయ పెరుగుదల తరువాత విత్తనాలవల్ల ప్రత్యుత్పత్తిని జరుపుకుంటుంది.
సైకస్ మొక్కలు భిన్న సిద్ధబీజత ఉన్న ఏకలింగాశయులు. ఇవి అలైంగిక ప్రత్యుత్పత్తిని జరుపుకొని సూక్ష్మసిద్ధబీజాలు, స్థూలసిద్ధబీజాలు అనే రెండురకాల సిద్ధబీజాలను వేరువేరు మొక్కలపై ఉత్పత్తి చేస్తాయి.
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/211398" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ