"తాతా సుబ్బరాయశాస్త్రి" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
 
'''తాతా సుబ్బరాయశాస్త్రి''' (1867-1944) [[విజయనగరం జిల్లా]]కు చెందిన ప్రముఖ [[సంస్కృతము|సంస్కృత]] పండితుడు. సంఘ సంస్కర్త. [[వితంతు వివాహం|వితంతు]] పునర్వివాహాలను సమర్థించాడు. అంటరానితనాన్ని వ్యతిరేకించాడు. మహామహోపాధ్యాయ బిరుదాంకితుడు<ref>{{Cite web |url=http://itivzm.com/downloadable_files/visit_vizianagaram.pdf |title=VISIT VIZIANAGARAM |website= |access-date=2015-12-17 |archive-url=https://web.archive.org/web/20160310130329/http://itivzm.com/downloadable_files/visit_vizianagaram.pdf |archive-date=2016-03-10 |url-status=dead }}</ref>.
==జీవిత విశేషాలు==
ఇతడు [[విజయనగరం|విజయనగరాని]]కి సమీపంలోని ఒంటితాడి అగ్రహారంలో [[1867]], [[జనవరి 25]]న తాతా సూర్యనారాయణావధాని,సోమిదేవమ్మ దంపతులకు జన్మించాడు<ref name="అక్షర నక్షత్రాలు">{{cite book |last1=నియోగి |title=అక్షరనక్షత్రాలు |date=1 September 2019 |publisher=భారతీ తీర్థ ప్రచురణ |location=విజయనగరం |pages=4-6 |edition=1 }}</ref>. సోమిదేవమ్మకు కొడుకును మహాపండితునిగా చేయాలనే బలమైన కోరిక ఉండేది. సుబ్బరాయశాస్త్రి తన తల్లి కోరిక ప్రకారమే నడుచుకున్నాడు. ఇతడు విజయనగరంలో బులుసు సుబ్రహ్మణ్యశాస్త్రి వద్ద సంస్కృత సాహిత్యం అభ్యసించి అందులో ప్రావీణ్యం సంపాదించాడు. ఏకసంథాగ్రాహిగా మన్ననలను అందుకున్నాడు. ఇతనికి చదువుపట్ల ఉన్న శ్రద్ధాసక్తుల గురించి విన్న రుద్రభట్ల రామశాస్త్రి, లక్ష్మణశాస్త్రి సోదరులు ఇతడిని ప్రత్యేకంగా ఆహ్వానించి శిష్యునిగా చేర్చుకున్నారు. వారి వద్ద వ్యాకరణ, అలంకార శాస్త్రాలు ఔపోసన పట్టాడు. తరువాత ధర్మశాస్త్రంపై ఆసక్తితో గుమ్మలూరు సంగమేశ్వరశాస్త్రి వద్ద చేరి ఆ శాస్త్రాన్ని ఆసాంతం చదువుకున్నాడు. తరువాత [[కొల్లూరు కామశాస్త్రి]] వద్ద వేదాంతం, కట్టా సూర్యనారాయణ అనే సంగీత విద్వాంసుని వద్ద సంగీతశాస్త్రం అభ్యసించాడు. ఆ కాలంలో ఆంధ్రదేశంలో ఏ శాస్త్రంలో ఏ రకమైన సందేహం వచ్చినా తీర్చగల వారెవరంటే ముందుగా ఇతని పేరే చెప్పుకునేవారు. ఇతను చెప్పే తీర్పు నిష్పక్షపాతంగా, శాస్త్రబద్ధంగా,ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా ఉండేది. ఇతడు అనేక పర్యాయాలు విజయనగర పురపాలక సంఘంలోను, సహకార సంఘంలోను సభ్యునిగా, ప్రధానాచార్యునిగా పనిచేశాడు. ఇతడు కాలానికి అనుగుణంగా వస్తున్న మార్పులను స్వాగతించాడు. సాంఘిక దురాచారాలను వ్యతిరేకించాడు. వితంతు పునర్వివాహాలను సమర్థించాడు. అంటరానితనాన్ని వ్యతిరేకించాడు. మహాత్మాగాంధీ పిలుపును అందుకుని జీవితాంతం ఖద్దరు వస్త్రాలను ధరించాడు.
ఈయన [[కాశీ]] లోని పండితులను [[సాహిత్యం|సాహిత్య]] పోటీలో ఓడించిన మొదటి వ్యక్తి.<ref>[https://groups.google.com/forum/#!topic/soc.culture.indian.telugu/OchfN6Gv8YI Vizianagaram - Nostalgia - Prasad Tata and Sarepaka RamaGopal]</ref> ఇతడు 1944లో కన్నుమూశాడు.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2839839" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ